ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ను ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఎస్ఎక్స్ఆర్ 160 అని పిలువబడే ఇది సరికొత్త మాక్సి-స్కూటర్, దేశంలో కొత్త విభాగానికి నాంది పలికింది.ఇప్పుడు ఈ మాక్సి స్కూటర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. కస్టమర్లు ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 డెలివరీ తీసుకోవడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.25 లక్షలు.

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 చాలా కాలం తర్వాత భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు చివరకు వినియోగదారులను చేరుకుంటోంది. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 లాంచ్ అయినప్పటి నుండి డీలర్‌షిప్ వద్దకు రావడం ప్రారంభమైంది. ఈ స్కూటర్‌ను కొనాలనే వినియోగదారులు 5000 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ లో ఎల్‌ఇడి హెడ్‌లైట్, ఎల్‌ఇడి టైల్లైట్, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ఎబిఎస్-సిబిఎస్, క్రోమ్ ప్లేటెడ్ ఎగ్జాస్ట్, సౌకర్యవంతమైన మరియు విశాలమైన సీటు ఉన్నాయి. దీనికి యూరోపియన్ డిజైన్ ఇవ్వబడింది. ఈ కారణంగా ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

MOST READ:భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మాస్ట్రో ఎడిషన్ లాంచ్ : ధర & పూర్తి వివరాలు

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

ఈ స్కూటర్‌లో కంపెనీ పుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్ప్లిట్ గ్లోవ్ బాక్స్, మొబైల్ ఛార్జింగ్ కోసం యుఎస్‌బి ఛార్జర్, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ మరియు పెద్ద విండ్‌స్క్రీన్ కూడా ఇచ్చింది. ఇందులో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు ఎబిఎస్ కూడా ఉన్నాయి.

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

ఇక ఈ ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ లోని ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 160 సిసి ఇంజన్ కలిగి ఉంది, ఇది 11 బిహెచ్‌పి శక్తిని మరియు 11.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తిచేస్తుంది. ఈ ఇంజిన్‌తో సివిటి గేర్‌బాక్స్ ఉపయోగించబడింది. సంస్థ ఈ స్కూటర్ కి కనెక్టివిటీ టెక్నాలజీని కూడా ఇచ్చింది.

MOST READ:రూ. 24 లక్షలతో బైక్ కొన్న మలయాళీ స్టార్.. ఎవరో చూసారా..!

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

ఈ స్కూటర్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించడం జరిగింది. తద్వారా దీనిని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. భారతీయ మార్కెట్లో ఈ డిజైన్లతో ఉన్న స్సీకట్ర మొదటి స్కూటర్ ఇదే. దీనివల్ల కొత్త తరగతి వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తోంది. డెలివరీలు కూడా బాగానే జరుగుతున్నాయి.

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

ఇది కంపెనీ యొక్క అమ్మకాలను మెరుగుపరచడానికి చాలా బాగా దోహదపడుతుంది. ఇది భారత మార్కెట్లో మంచి స్థానాన్ని పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త మోడళ్లను తీసుకువస్తామని కంపెనీ తెలిపింది. కొంతకాలం క్రితం కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ట్రేడ్‌మార్క్ చేసింది.

MOST READ:లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ డెలివరీ ప్రారంభించిన ఏప్రిలియా ; వివరాలు

స్టైలిష్ గా ఉండటమే కాకుండా, మంచి పర్ఫామెన్స్ కూడా కలిగి ఉంటుంది, మరియు కంఫర్ట్ రైడింగ్ అనుభవాన్ని మిళితం చేసే మొదటి స్కూటర్. ఈ స్కూటర్ కి దేశీయ మార్కెట్లో ఏ విధమైన స్పందన వస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ కి దేశీయ మార్కెట్లో తప్పకుండా మంచి ఆదరణ లభిస్తుందనే మేము ఆశిస్తున్నాము.

Image Courtesy: Alwaye Motors Vespa

Most Read Articles

English summary
Aprilia SXR 160 Delivery Starts. Read in Telugu.
Story first published: Wednesday, January 6, 2021, 12:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X