హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ (Ather Energy) ప్రారంభం నుంచి కూడా మంచి ఆదరణ పొందుతూనే ఉంది. అయితే కంపెనీ తన ఉనికిని దేశంలో మరింత బలోపేతం చేయడానికి ఎప్పటికప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో తన 20 వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రిటైల్ అవుట్‌లెట్ ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ, హైదరాబాద్‌లోని నాగోల్ ఎక్స్ రోడ్‌లోని మమతా నగర్‌లో తన కొత్త రిటైల్ అవుట్‌లెట్ - ఏథర్ స్పేస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లకు మరింత చెరువవుతుంది. దీని ద్వారా కంపెనీ యొక్క అమ్మకాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

ఏథర్ ఎనర్జీ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రైడ్ మోటార్స్‌తో కలిసి హైటెక్ సిటీలో మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన తరువాత, ఇప్పుడు రెండవ ఎక్స్పీరియన్స్ సెంటర్ నగరంలోని మమతా నగర్‌లో ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ దినదినాభివృద్దివైపు క్రమంగా అడుగులు వేస్తుంది అని స్పష్టంగా తెలుస్తుంది.

హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

ఈ సందర్భంగా ఏథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మిస్టర్‌ రవ్‌నీత్‌ సింగ్‌ ఫోకెలా మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ కారణంగానే గత ఏడాది అమ్మకాలకంటే కూడా ఈ అక్టోబర్‌లో అమ్మకాలు 12 రెట్లు పెరిగాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 7,500 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని అయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రము మాకు కీలకమైన మార్కెట్, కావున పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కస్టమర్ల అవసరాలను తీర్చడంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభిస్తున్నాము అన్నారు.

హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

అంతే కాకుండా మేము ప్రారంభించిన మా మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ కి హైదరాబాద్ వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, కావున ఇప్పుడు రెండవ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించాము. అయితే రాబోయే నెలల్లో, మేము వరంగల్, ఖమ్మం మరియు వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా విస్తరించాలని యోచిస్తున్నాము అన్నారు.

హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

హైదరాబాద్ నగరంలో తమ మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి ఏథర్ ఎనర్జీ డిమాండ్‌ మునుపటికంటే కూడా దాదాపు 4 రెట్లు పెరిగింది, కావున ఇప్పుడు ప్రారంభించిన ఈ కొత్త ఏథర్ ఎనర్జీ డిమాండ్‌లో దాదాపు 4 రెట్లు పెరిగింది మరింత డిమాండ్ పెంచుతుంది అని భావిస్తున్నాము.

హైదరాబాద్‌లోని కస్టమర్లు వ్యక్తులు మొదట ఎక్స్పీరియన్స్ సెంటర్ సందర్శించే ముందు కంపెనీ వెబ్‌సైట్‌లో టెస్ట్ రైడ్ స్లాట్‌లను కూడా బుక్ చేసుకోవచ్చు, ఇది కస్టమర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

ఈ సందర్భంగా ప్రైడ్ మోటార్స్ చైర్మన్ ఎం సురేష్ రెడ్డి మాట్లాడుతూ, ఒక సంవత్సరం అనుబంధంలో ఏథర్ ఎనర్జీతో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. హైదరాబాద్‌లో మా రెండవ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది హైదరాబాద్ కస్టమర్ల కొనుగోలుకు మరింత అనుగుణంగా ఉంటుంది, అన్నారు.

హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

ప్రారంభానికి ముందు మార్కెట్‌లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో పెట్టుబడి పెట్టే కంపెనీలలో ఏథర్ ఎనర్జీ ఒకటి. కంపెనీ ఇప్పటికే 17 ఫాస్ట్ ఛార్జింగ్ లొకేషన్‌లను కలిగి ఉంది. ఇవి బంజారాహిల్స్, SD రోడ్, విద్యానగర్, జూబ్లీ హిల్స్, నానక్రామ్‌గూడ, సైనిక్‌పురి, కొండాపూర్ మరియు హైటెక్ సిటీ మొదలైన ప్రదేశాలలో ఉన్నాయి. ఏథర్ ఎనర్జీ మరో 8 నుంచి 10 స్థానాలను జోడించాలని యోచిస్తోంది.

హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ద్వారా కొనుగోలు దారులు చాలా వేగంగా తమ వాహనాలకు ఛార్జింగ్ వేసుకోవచ్చు. సాధారణంగా మౌలిక సదుపాయాలు సరైన రీతిలో లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు దేశంలో కొంత మందకొడిగానే ఉన్నాయి. అయితే వాహనాలకు కావలసిన ఛార్జింగ్ సదుపాయాలు కావాల్సిన సంఖ్యలో ఉంటే కొనుగోలుదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను నిస్సంకోచంగా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ యొక్క ఛార్జింగ్ నెట్‌వర్క్ 2021 డిసెంబర్ చివరి వరకు అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

హైదరాబాద్‌లో రెండవ రిటైల్ స్టోర్ ప్రారంభించిన Ather Energy: వివరాలు

ఏథర్ కంపెనీ యొక్క Ather 450X కంపెనీ యొక్క వేగవంతమైన మరియు తెలివైన స్కూటర్‌లలో ఒకటి. ఇది లిమిటెడ్-ఎడిషన్ సిరీస్ 1 తో పాటుగా గ్రే, గ్రీన్ మరియు వైట్ అనే నాలుగు రంగులలోఅందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ 6kW PMSM మోటార్, 2.9 kWh లిథియం అయాన్ బ్యాటరీతో శక్తిని పొందింది. ఇది ఎకో, రైడ్ మరియు స్పోర్ట్‌ అనే రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. Ather 450X కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు, ఇది 125cc కేటగిరీలో అత్యంత వేగవంతమైన స్కూటర్.

Most Read Articles

English summary
Ather energy opens new dealership in hyderabad details
Story first published: Wednesday, November 24, 2021, 18:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X