మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ Ather Energy (ఏథర్ ఎనర్జీ). ఏథర్ ఎనర్జీ అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలతో మంచి ప్రజాధారంపొందగలిగింది. అయితే కంపెనీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తన నెట్వర్క్ పెంచుకునే తరుణంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో తన 20 వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.

మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

Ather Energy ప్రారంభించిన ఈ సెంటర్ మైసూర్ నగరంలో మొదటిది, అయితే కర్ణాటక రాష్ట్రంలో ఇది మూడవదిగా ఉంది. కంపెనీ కొత్తగా ప్రారంభించిన ఈ కొత్త డీలర్‌షిప్‌లో ఏథర్ 450ఎక్స్ మరియు 450 ప్లస్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. అంతే కాకుండా టెస్ట్ రైడ్స్ కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి.

మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలో భాగంగానే కంపెనీ తన పరిధిని విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఏథర్ ఎనర్జీ దేశంలోని అనేక నగరాల్లో తన వ్యాపారాన్ని నిరంతరం విస్తరిస్తోంది. ఇప్పుడు ఇందులో భాగంగానే 'హొన్నసిరి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్' మరియు ఏథర్ ఎనర్జీ హుంకూర్ రోడ్, హినకల్‌లో తన సర్వీస్ సెంటర్ ప్రారంభమైంది.

మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

Ather ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు, ఈ డీలర్‌షిప్‌ సందర్శించడం ద్వారా ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు. కంపెనీ దీనిని పండుగ సీజన్‌కు ముందు ప్రారంభించింది. ఇక్కడ కంపెనీ ఏథర్ 450 ప్లస్ ను టెస్ట్ రైడ్ మరియు సేల్ కోసం అందుబాటులో ఉంచబడుతుంది.

మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

ఇక్కడ ఏథర్ 450X ధర రూ. 1,44,500 వద్ద ఉంది. అంతే కాకుండా ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1,25,490. మైసూర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోందని ఏథర్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కోసం, కర్ణాటక ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అనేక పాలసీలను తీసుకువచ్చింది, దానితో పాటుగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం రిజిస్ట్రేషన్ ఫీజు మరియు రోడ్ టాక్స్ వంటివి కూడా మినహాయించింది.

మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

ఇది మాత్రమే కాకుండా రాబోయే 2-3 సంవత్సరాలలో 50% ప్రభుత్వ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త డీలర్‌షిప్‌ సందర్శించే వారికి మెరుగైన అనుభవం అందుతుంది. వాహనానికి సంబందించిన మొత్తం సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అన్ని విడిభాగాలు చూపబడతాయి. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని సందర్శించే ముందు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు టెస్ట్ రైడ్‌ని బుక్ చేసుకోవచ్చు.

మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

ఏథర్ కంపెనీ తన డీలర్‌షిప్‌లను ఈ సంవత్సరం గణనీయంగా విస్తరించింది. ఇందులో భాగంగానే కంపెనీ ముంబై, పూణే, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, తిరుచ్చి, విశాఖపట్నం, జైపూర్, కోజికోడ్, ఇండోర్ మరియు నాసిక్‌లో షోరూమ్‌లను ప్రారంభించింది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లకు మెలిక సదుపాయాలైన ఛార్జింగ్ వంటివి కావలసినన్ని అందించాడని కంపెనీ నిరంతరం కృషి చేస్తూనే ఉంది. కంపెనీ ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కూడా తన కొత్త డీలర్‌షిప్ ప్రారంభించబడింది.

మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

భవిష్యత్తులో ప్రతి నగరంలో 8 నుంచి 10 మరిన్ని ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఏథర్ యోచిస్తోంది, తద్వారా నగరంలోని ఎలక్ట్రిక్ వాహన డ్రైవర్లు ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగించవచ్చు. అంతే కాకుండా, మీ అపార్ట్‌మెంట్ మరియు బిల్డింగ్‌లో ఛార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేయడంలో అథర్ ఎనర్జీ సహాయపడుతుంది.

మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా 200 ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ స్టేషన్లను ప్రారంభించింది. ఇటీవల ప్రకటించినట్లుగా, భారతదేశంలో వాహనాల తయారీతో పాటు వాహన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెడుతున్న కంపెనీలలో ఏథర్ ఎనర్జీ ఒకటి. కంపెనీ ప్రతి నెలా కనీసం 45 ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్లను జోడిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి దాని EV ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను దాదాపు 500 కి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలో ఏథర్ ఎనర్జీ వెల్లడించింది. ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా విస్తరించడంలో నిరంతరం నిమగ్నమై ఉంది.

మైసూర్‌లో కొత్త డీలర్‌షిప్ ప్రారంభించిన Ather Energy: పూర్తి వివరాలు

ఇప్పటికే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు అనేక రాయితీలను అందిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని తప్పకుండా పెంచడంలో సహాయపడతాయి. తద్వారా కంపెనీ యొక్క అమ్మకాలు కూడా మెరుగుపడతాయి.

Most Read Articles

English summary
Ather energy opens new showroom in mysore karnataka details
Story first published: Monday, October 18, 2021, 19:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X