పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, దేశీయ మార్కెట్లో శరవేగంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ కంపెనీ కొత్త మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది.

పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ఇందులో భాగంగానే, ఏథర్ ఎనర్జీ పూనేలో తమ కొత్త షోరూమ్‌ని ఓపెన్ చేసింది. పూనే మార్కెట్లో తమ పాపులర్ స్కూటర్ ఏథర్ 450 డెలివరీలను కూడా ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ గత నెలలో ముంబైలో కూడా తమ డీలర్‌షిప్‌ను ప్రారంభించిన విషయం తెలిసినదే.

పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఏథర్ 450 అనే స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఏథర్ 450 ప్లస్ మరియు ఏథర్ 450ఎక్స్. హైదరాబాద్‌లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తున్నాయి. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

-> ఏథర్ 450 ప్లస్ - రూ.1,42,416

-> ఏథర్ 450ఎక్స్ - రూ.1,61,426

(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

MOST READ:వారెవ్వా.. జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్‌కి 300 కార్లతో స్వాగతం చెప్పిన అభిమానులు

పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ఏథర్ 450 స్కూటర్ స్పేస్ గ్రే, వైట్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 26 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఐపి67 రేటెడ్ వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ఏథర్ ఎనర్జీ ఈ బ్యాటరీపై 3 ఏళ్ల సమగ్ర వారంటీని ఆఫర్ చేస్తోంది. అలాగే, ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కూడా కంపెనీ 3 ఏళ్ల వారంటీని అందిస్తోంది. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 85 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

MOST READ:ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న సూపర్ ఉమెన్ వీడియో

పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వివరించింది.

పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ఎథర్ 450 టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఏథర్ ఎనర్జీ అందిస్తున్న టాప్-ఎండ్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి.

MOST READ:రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ఇందులో 4G నెట్‌వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని సాయంతోనే పూర్తి స్కూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే, దీనిపై సంగీతం మరియు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లను కూడా కంట్రోల్ చేయవచ్చు.

పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ఏథర్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించి, స్కూటర్‌కు రిమోట్‌గా కనెక్ట్ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఫోన్ కాల్స్‌ను స్వీకరించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు. ఇందులో పార్క్ అసిస్ట్ అనే ఫీచర్ ఉంటుంది. దీని సాయంతో స్కూటర్‌ను రివర్స్‌లో రైడ్ చేయవచ్చు.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్.. వివరాలు

పూనేలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ప్రారంభం, కొత్త షోరూమ్ ఓపెన్

ఏథర్ ఎనర్జీ తన రెండవ దశ ప్రణాళికలో భాగంగా, ఢిల్లీ, ముంబై, పూణేతో సహా పలు కొత్త నగరాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రారంభించనుంది. కొత్త నగరాల్లో, వినియోగదారులు ఛార్జింగ్ సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు కంపెనీ ఏథర్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ గ్రిడ్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది.

Most Read Articles

English summary
Ather Energy Opens New Showroom In Pune; Starts 450 Plus and 450X Scooter Deliveries. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X