గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) గత నెలలో అత్యధిక విక్రయాలను నమోదు చేసినట్లు ప్రకటించింది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు మరియు పండుగ సీజన్ సెంటిమెంట్ చక్కగా పనిచేయడంతో అక్టోబర్ 2021 లో ఏథర్ ఎనర్జీ మొత్తం 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, కంపెనీ అమ్మకాలు ఏకంగా 12 రెట్లు పెరిగాయని ఏథర్ ఎనర్జీ తెలిపింది.

గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

ఈ సందర్భంగా, ఏథర్ ఎనర్జీ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా మాట్లాడుతూ, ప్రస్తుత పండుగల సీజన్‌లో ఏథర్ అమ్మకాలు పెరిగాయని, అందుకే ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో 12 రెట్లు వృద్ధి చెందాయని అన్నారు. దేశవ్యాప్తంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటలోకి తెచ్చేందుకు ఏథర్ ఎనర్జీ దేశంలోని ప్రధాన నగరాల్లో తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.

గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ సంస్థకు దేశంలోని 19 నగరాల్లో దాదాపు 22 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ బ్రాండ్ దేశంలోని 42 నగరాలకు విస్తరించాలని మరియు అదనంగా మరో 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ విస్తరణతో పాటుగా, కంపెనీ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా తీవ్రంగా పనిచేస్తోంది.

గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

ఏథర్ ఎనర్జీ ఇప్పటికే దేశంలోని 22 కి పైగా నగరాల్లో 220 కి పైగా ప్రదేశాలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. కాగా, 2022 నాటికి దేశంలో కొత్తగా మరో 500 ఛార్జింగ్ గ్రిడ్ లను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లకు ఈ వేగవంతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ అందుబాటులో ఉందని మరియు ఇది డిసెంబర్ 2021 చివరి వరకు పూర్తిగా ఉచితం అని కంపెనీ పేర్కొంది.

గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు 6 నెలల పాటు కనెక్టివిటీ ఫీచర్లు ఉచితం..

ఇదిలా ఉంటే, ఏథర్ ఎనర్జీ తమ స్కూటర్ వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గడచిన దీపావళి సందర్భంగా, కంపెనీ తమ కస్టమర్లకు వచ్చే ఆరు నెలల పాటు అన్ని ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కనెక్టివిటీ ఫీచర్లను ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ తరుణ్ మెహతా ఈ విషయాన్ని స్వయంగా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలోని అన్ని కనెక్టివిటీ ఫీచర్లను అందించే యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) అయిన 'ఏథర్ కనెక్ట్‌' ని రీడిజైన్ చేసే పనిలో ఉందని, రూట్ ప్లానింగ్, నావిగేషన్, ఛార్జింగ్, సర్వీసింగ్ మరియు కస్టమైజేషన్‌తో సహా మొత్తం ఏథర్ కనెక్ట్ మొబిలిటీ అనుభవాన్ని అతుకులు లేకుండా చేయడానికి ఓ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తరుణ్ మెహతా తెలిపారు.

గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

ఏథర్ ఎనర్జీ ఎసక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు నవంబర్ 15 నుండి మే 15 వరకు, ఏథర్ కనెక్ట్ ప్రో సబ్‌స్క్రిప్షన్ ప్యాక్ యొక్క అన్ని ఫీచర్లు ఏథర్ 450ఎక్స్ మరియు 450 ప్లస్ యొక్క ప్రస్తుత మరియు కొత్త యజమానులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా కస్టమర్లు యాక్టివ్ కనెక్ట్ లైట్ / ప్రో సబ్‌స్క్రిప్షన్‌ ని కలిగి ఉంటే, కంపెనీ వారికి ప్రో-రేటా ప్రాతిపదికన రీఫండ్ చేస్తామని వివరించింది.

గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ భారతదేశలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఏథర్ 450ఎక్స్ (Ather 450X) మరియు ఏథర్ 450 ప్లస్ (Ather 450 Plus) మోడళ్లు ఉన్నాయి. వీటిలో ఏథర్ 450ఎక్స్ అనేది ప్రీమియం మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 6 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 2.9 kwh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది.

గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

ఈ బ్యాటరీ సాయంతో స్కూటర్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. పూర్తి ఛార్జ్ పై ఇది గరిష్టంగా 116 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడ్ మరియు ఎకో అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి.

గత నెలలో 3,500 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన Ather; 12 రెట్లు పెరిగిన సేల్స్

ఎథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే, రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి ఈ టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటుంది. ఎకో మోడ్‌లో, ఇది 85 కిమీ మరియు రైడ్ మోడ్‌లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది. చార్జింగ్ సమయం విషయానికి వస్తే, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Ather energy sold 3500 electric scooters in october 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X