BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ అండ్ మోటార్‌సైకిల్ బ్రాండ్ BMW, ఓ సరికొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను ఆవిష్కరించింది. జర్మనీలోని మునిచ్ నగరంలో జరుగుతున్న 2021 IAA ఆటో షోలో BMW i Vision AMBY (బిఎమ్‌బ్ల్యూ ఐ విజన్ యాంబీ) పేరుతో ఓ బ్యాటరీ ఆపరేటెడ్ పెడల్ ఎలక్ట్రిక్ సైకిల్ ను ప్రదర్శించింది.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

ఆసక్తికరమైన విషయం ఎంటంటే, ఈ BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్, చూడటానికి సైకిల్ మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ బైక్. సింగిల్ చార్జ్ పై దీని రేంజ్ గరిష్టంగా 300 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అంతేకాదు, దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్ల వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మూడు స్పీడ్ రేటింగ్‌లను కలిగి ఉంటుంది. దీని స్పీడ్ ను సైకిల్ ట్రాక్‌‌ల కోసం 25 km/h, సిటీ రోడ్ల కోసం 45 km/h మరియు మల్టీ లేన్ రోడ్స్ (హైవేల) కోసం 60 km/h గా రేట్ చేయబడింది. అయితే, ఈ సైకిల్ ను హైవేలపై మరియు గంటకు 25 km/h కన్నా ఎక్కువ వేగంతో నడపాలంటే మాత్రం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ జియోఫెన్సింగ్ తో పాటుగా ప్రస్తుతం అనేక ఎలక్ట్రిక్ వాహనాలలో లభిస్తున్న అన్ని ఫాన్సీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది చాలా సింపుల్ డిజైన్ ను కలిగి ఉంటుంది. చూడటానికి డర్ట్ బైక్ మాదిరిగా కనిపించే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ముందు భాగంలో పెద్ద టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

ఈ సైకిల్ హ్యాండిల్‌బార్లు ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ ట్రాక్‌లకు అనుగుణంగా ఏరోడైనమిక్ డిజైన్ కలిగి ఉండి, తగిన ఎత్తులో అమర్చబడి ఉంటాయి. బైక్ ముందు భాగంలో 26 ఇంచ్ రిమ్ మరియు వెనుకవైపు 24 ఇంచ్ రిమ్ ఉంటాయి. వాటిపై అమర్చిన పెద్ద టైర్లు బెటర్ రోడ్ గ్రిప్ మరియు సేఫ్టీని ధృవీకరిస్తాయి.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

ఇందులో వెనుక టైరు చాలా వెడల్పుగా ఉండి, హై స్పీడ్స్ వద్ద కూడా మంచి బ్యాలెన్స్ ను అందించడంలో సహకరిస్తుందని కంపెనీ తెలిపింది. రైడర్ కంఫర్ట్ కోసం ఈ సైకిల్ లో డర్ట్ బైక్ లలో కనిపించినట్లుగా ఫ్లాట్ సీట్ అమర్చబడి ఉంటుంది మరియు ఫ్రేమ్‌ లో కలిసిపోయినట్లుగా ఉంటుంది. దీని మొత్తం బరువు కేవలం 65 కిలోలు మాత్రమే. సాంప్రదాయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఇది చాలా తేలికగా ఉంటుంది.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో బ్యాటరీని ఫ్రేమ్ మధ్యలో అమర్చబడి ఉంటుంది. దీని సామర్థ్యం 2,000 Wh గా ఉంటుంది. రైడర్ ఎంచుకునే రైడింగ్ మోడ్‌ని బట్టి దీని రేంజ్ 300 కిమీ (186 మైళ్ళు) వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం మూడు గంటల్లోనే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ ఖాళీ అయితే, పెడల్స్ సాయంతో దీనిని తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

BMW i Vision AMBY లభించే ఇతర సాంకేతిక మరియు సేఫ్టీ ఫీచర్లలో ఆటోమేటిక్ హై-బీమ్ అసిస్టెంట్, బ్రేక్ లైట్ అసిస్టెంట్, డే టైమ్ రైడింగ్ లైట్ కోసం ఆప్టిమైజ్ చేయబడిన ఏబిఎస్ సిస్టమ్ మరియు టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కోసం కంపెనీ ఓ ప్రత్యేకమైన మొబైల్ యాప్ ను కూడా అందిస్తోంది.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

BMW Motorrad తమ i Vision AMBY ద్వారా భవిష్యత్తులో కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సృష్టించాలని భావిస్తోంది. మార్కెట్లో ఇప్పటికే అనేక రకాల బ్యాటరీ పవర్డ్ ఎలక్ట్రిక్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ విజన్ యాంబి మాత్రం హైటెక్ ఫీచర్లను కలిగి ఉండి వినియోగం మరియు ప్రాక్టికాలిటీలో ముందు వరుసలో ఉంటుంది.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

భారత్‌లో BMW R 1250 GS మరియు R 1250 GS అడ్వెంచర్ బైక్స్ విడుదల..

ఇదిలా ఉంటే, BMW Motorrad భారత మార్కెట్లో తమ సరికొత్త 2021 BMW R 1250 GS మరియు R 1250 GS అడ్వెంచర్ బైక్స్ ను విడుదల చేసింది. ఈ రెండు మోడళ్లు ఇప్పుడు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడ్డాయి. దేశీయ విపణిలో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 20.45 లక్షలు మరియు రూ. 22.40 లక్షలుగా ఉన్నాయి.

BMW i Vision AMBY ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరణ.. ఇది మామూలు సైకిల్ కాదు..

ఈ రెండు మోడళ్లు కూడా ఒకే రకమైన ఇంజన్ ను కలిగి ఉంటాయి. ఇందులోని 1254 సిసి ట్విన్ సిలిండర్ ఇన్-లైన్ బాక్సర్ ఇంజన్ గరిష్టంగా 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 136 హెచ్‌పి శక్తిని మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 143 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. - వీటికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Bmw i vision amby concept electric bike unveiled at iaa 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X