బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

జర్మన్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్, భారత మార్కెట్లో రెండు కొత్త లగ్జరీ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ మోడళ్లను కంపెనీ విడుదల చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

బిఎమ్‌డబ్ల్యూ ఈ రెండు మోడళ్లను రెట్రో-మోడ్రన్ స్టైల్‌లో డిజైన్ చేసింది. ఇవి అనేక ఫీచర్లు, పరికరాలు మరియు టెక్నాలజీతో నిండి ఉన్నాయి. వీటిలో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (ఆర్ నైన్‌టిలో మాత్రమే) మరియు ట్విన్ ఎగ్జాస్ట్ పైప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

ఈ రెండు మోడళ్లు కూడా క్లాసిక్ లుక్‌ని క్యారీ చేసేందుకు గుండ్రటి హెడ్‌ల్యాంప్ క్లస్టర్, గుండ్రటి ట్రిప్ మీటర్స్ మరియు స్పోక్ వీల్స్‌ను కలిగి ఉంటాయి. కాగా, ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ మోడల్‌లో ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం పెద్ద బటన్లతో కూడిన టైర్లను ఉపయోగించారు. అలాగే, ఈ రెండింటి ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్‌లో కూడా మార్పులు ఉన్నాయి.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులను కలిగి ఉంటుంది. ఇకపోతే, బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి ముందు భాగంలో గోల్డ్ కలర్ యుఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫోర్క్‌లను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, రెండు మోడళ్లు ఒకేలా ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ముందు వైపు డ్యూయెల్ 320 మిమీ డిస్క్‌లు మరియు వెనుకవైపు సింగిల్ 265 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇంజన్ పరంగా కూడా ఇవి రెండూ ఒకేలా ఉంటాయి. ఈ మోటార్‌సైకిళ్లలో శక్తివంతమైన 1170సిసి డ్యూయెల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ బాక్సర్ ఇంజన్‌ను ఉపయోదించారు.

MOST READ:45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

ఈ ఇంజన్ గరిష్టంగా 7250 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 119 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్ళు కేవలం 3.5 సెకన్లలోనే గంటకు 0 - 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలవు. వీటి గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ రెండు మోడళ్లను సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు. మార్కెట్లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి ధర రూ.18.50 లక్షలుగా ఉంటే, , ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ ధర రూ.16.75 లక్షలుగా ఉంది (రెండు ధరలు ఎక్స్-షోరూమ, ఇండియా).

MOST READ:చెన్నైలో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

భారత మార్కెట్లో ఈ రెండు మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని, ఆసక్తి గల కస్టమర్లు భారతదేశంలోని అన్ని బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ డీలర్‌షిప్‌లలో కానీ లేదా ఆన్‌లైన్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. త్వలోనే వీటి డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

ఇందులో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్‌ను గ్రానైట్ గ్రే మెటాలిక్, కాస్మిక్ బ్లూ మెటాలిక్ / లైట్ వైట్ యుని, కలమట మెటాలిక్ మ్యాట్ మరియు బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ / రేసింగ్ రెడ్ అనే నాలుగు రంగులలో అందిస్తున్నారు.

MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

కాగా, టాప్-ఎండ్ అయిన బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మోడల్‌ని బ్లాక్ స్టార్మ్ మెటాలిక్, ఆప్షన్ 719 అల్యూమినియం, నైట్ బ్లాక్ మాట్టే / అల్యూమినియం మ్యాట్ మరియు మినరల్ వైట్ మెటాలిక్ / ఔరమ్ అనే నాలుగు రంగులలో అందిస్తున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి మరియు ఆర్ నైన్‌టి స్క్రాంబ్లర్ బైక్స్ విడుదల; ధరలు

ఈ రెండు మోడళ్లలో పలు రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటిలో రెండు రెయిన్ మరియు రోడ్ అనే రెండు రైడింగ్ మోడ్స్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ఏబిఎస్ ప్రో, ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ట్రావెల్-డిపెండెంట్ డంపింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
BMW Motorrad Launches R nineT And R nineT Scrambler In India; Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X