దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ బిఎండబ్ల్యు మోటోరాడ్ కంపెనీ తన సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000 ఆర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ యొక్క ప్రారంభ ధర రూ. 17.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్). దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000 ఆర్‌ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి స్టాండర్డ్, ప్రో మరియు ఎం స్పోర్ట్ వేరియంట్లు. బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000ఆర్ స్టాండర్డ్, ప్రో, ఎం స్పోర్ట్‌ ధరల విషయానికి వస్తే, వరుసగా రూ. 17.90 లక్షలు, రూ. 19.75 లక్షలు, రూ. 22.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.

దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000 ఆర్‌ అనేది పెర్మియం నేకెడ్ స్పోర్ట్స్ బైక్, దీని రూపకల్పన బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000 ఆర్‌ఆర్ పై ఆధారపడి ఉంటుంది. ఈ బైక్‌లో ఎస్1000 ఆర్‌ఆర్ యొక్క ఇంజన్, ఫ్రేమ్ మరియు స్వింగార్మ్ ఉపయోగించబడ్డాయి. కానీ ఎస్1000 ఆర్ఆర్ తో పోలిస్తే ఎస్1000 ఆర్ లో చాలా అప్డేట్స్ చూడవచ్చు.

దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000 ఆర్‌ యొక్క ఫస్ట్ జనరేషన్ మోడల్ 2014 లో భారతదేశంలో ప్రారంభించబడింది. ఆ తరువాత ఈ బైక్ కాలక్రమంలో చాలా అప్డేట్స్ పొందింది. అయితే ఈ బైక్ ఇప్పుడు యూరో 5 మరియు బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా నవీనీకరించబడింది.

దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త బైక్‌లో కొత్త బాడీ ప్యానెల్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, డీఆర్‌ఎల్ లైట్స్ వంటివి ఉన్నాయి. హెడ్‌లైట్ లోపల డీఆర్‌ఎల్ లైట్ విలీనం చేయబడింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000 ఆర్‌ బైక్ ఈ విభాగంలో చాలా తేలికైన బైక్ అని కంపెనీ నివేదించింది.

దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

ఈ బైక్‌లో 6.5 ఇంచెస్ పెద్ద టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంది. దీని ద్వారా బైక్ యొక్క స్పీడ్, ఆర్‌పిఎం మరియు బైక్‌కు సంబంధించిన మరింత సమాచారం వాహనదారునికి తెలుస్తుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్‌లో కనెక్ట్ ఫీచర్ కూడా ఇవ్వబడింది. దీని సహాయంతో బ్లూటూత్ ద్వారా బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌లో స్మార్ట్‌ఫోన్ బేస్డ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ కూడా కలిగి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 999 సిసి ఇంజన్ ఉంది. ఇది 165 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త బైక్ యొక్క పవర్ అవుట్ ఫుట్ దాని పాత బైక్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇంజిన్ మునుపటికంటే కూడా చాలా సెన్సిటీవ్ గా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ బైక్‌లో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో మల్టీ-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఎబిఎస్, త్రీ రైడ్ మోడ్లు, వీలీ కంట్రోల్, పవర్ వీలీ మరియు డైనమిక్ బ్రేక్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కావున వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ బైక్‌, దాని మునుపటి మోడల్స్ కంటే కూడా దాదాపు 5 కిలోల తక్కువ బరువును కలిగి ఉంటుంది. కావున ఇది బైక్‌కు ఇంజిన్‌కు త్వరగా స్పందించడానికి సహాయపడుతుంది. ఈ బైక్ మొత్తం బరువు ఇప్పుడు 199 కేజీలు. ఈ బైక్ కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీ

దేశీయ మార్కెట్లో 2021 BMW S1000R విడుదల; ధర & పూర్తి వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ దేశీయ మార్కెట్లో, డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వి 4 మరియు ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ బైక్ మంచి ఫీచర్స్ కలిగి ఉంది అద్భుతమైన పర్ఫామెన్స్ అందించడం వల్ల మునుపటి కంటే చాలా ఎక్కువ అమ్మకాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
2021 BMW S 1000 R Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X