భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌; వివరాలు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా భారత మార్కెట్లో అతి త్వరలో బిఎస్ 6 గోల్డ్ వింగ్ బైక్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే కంపెనీ దేశీయ మార్కెట్లో ఈ బైక్ ని ఎప్పుడు విడుదల చేస్తుంది అన్న విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌ అనేక అప్డేట్స్ కలిగి ఉంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌; వివరాలు

2021 హోండా గోల్డ్ వింగ్‌ బైక్‌లో 1,833 సిసి, లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్-6 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 126.4 బిహెచ్‌పి పవర్ మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్ గా లభిస్తుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌; వివరాలు

2021 హోండా గోల్డ్ వింగ్ కూడా చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో 7.0 ఇంచెస్ టిఎఫ్‌టి ఇన్‌స్టాన్స్ ట్రూ కన్సోల్‌తో పాటు ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో గైరోకాంపాస్ నావిగేషన్, స్మార్ట్ కీ, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ మరియు ఆల్-ఎల్ఇడి లైటింగ్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌; వివరాలు

ఈ లగ్జరీ హోండా గోల్డ్ వింగ్ బైక్‌లో స్పోర్ట్, రెయిన్, టూర్ మరియు ఎకో అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు లభిస్తాయి. 2021 గోల్డ్ వింగ్ బైక్ చూడటానికి చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ బైక్ స్టెప్డ్ సీట్లను కూడా కలిగి ఉంటుంది, కావున లాంగ్ డ్రైవ్ లో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌; వివరాలు

2021 హోండా గోల్డ్ వింగ్ బైక్ అల్ట్రా ప్రీమియం బైక్. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో డబుల్-విష్బోన్ మరియు వెనుక వైపు ప్రో-లింక్ సెటప్ కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ కంట్రోల్ సస్పెన్షన్-డంపింగ్ అనుకూలతను కలిగి ఉంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌; వివరాలు

బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఈ లగ్జరీ బైక్ ముందు భాగంలో 6 పిస్టన్ కాలిపర్‌లతో కూడిన ట్విన్ 320 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు మూడు పిస్టన్ కాలిపర్‌తో ఒకే 316 మిమీ డిస్క్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా మెరుగైన భద్రత కోసం ఇది ఏబీఎస్ తో ఎలక్ట్రిక్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌; వివరాలు

కొత్త 2021 హోండా గోల్డ్ వింగ్ బైక్ భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత, ఆఫ్రికా ట్విన్, సిబిఆర్ 650 ఆర్ మరియు సిబి 500 ఎక్స్ వాటితో సహా ఈ బ్రాండ్‌లోని ఇతర ప్రీమియం బైక్‌ల మాదిరిగానే ఇది హోండా యొక్క బిగ్‌వింగ్ డీలర్‌షిప్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతుంది.

భారత్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌; వివరాలు

రాబోయే కొద్ది నెలల్లో కొత్త గోల్డ్ వింగ్ భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో బిఎస్ 4 గోల్డ్ వింగ్ ధర రూ. 28.2 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అయితే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్న కొత్త 2021 బిఎస్ 6 ధర బిఎస్ 4 మోడల్ కంటే అధిక ధర కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Honda Gold Wing BS6 India, Launch Expected Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X