బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డాకర్ ర్యాలీ గురించి దాదాపు తెలియనివారు ఉండరు. ఇప్పుడు ఈ 2021 డాకర్ ర్యాలీ సౌదీ అరేబియాలో జరుగుతోంది. ప్రస్తుతం ఒకటి, రెండు, మూడు మరియు నాల్గవ దశలు పూర్తయ్యాయి. ఇందులో ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది రైడర్లు పాల్గొన్నారు. ఇందులో భారతదేశం తరపున పాల్గొన్న వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి మరియు గర్వించదగ్గ వ్యక్తి సిఎస్ సంతోష్.

బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

ఇతడు ఈ ర్యాలీలో మొదటి నుంచి చాలా చురుకుగా పాల్గొని అద్భుతమైన ప్రతిభను చూపుడు. కానీ దురదృష్టకరం ఏమిటంటే సంతోష్ డాకర్ ర్యాలీ నాలుగో దశలో గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. 2021 డాకర్ ర్యాలీ నాల్గవ దశలో వే పాయింట్ 4 ను దాటిన తర్వాత ఇండియన్ రైడర్ హీరో మోటార్‌స్పోర్ట్ యొక్క సిఎస్ సంతోష్ కుప్పకూలడంతో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.

బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

సిఎస్ సంతోష్‌ను రియాద్ ఆసుపత్రికి తరలించారు. సిఎస్ సంతోష్ గాయం నుంచి కోలుకుంటున్నట్లు హీరో మోటోస్పోర్ట్ తెలిపింది. కానీ ఈ రోజు సంతోష్ కోమాలోకి వెళ్లినట్లు తెలిపింది. ఇది నిజంగా విషాదకరమైన వార్త. డాకర్ ర్యాలీలో పాల్గొని ఎంతో కీర్తి ప్రతిష్టలు తెస్తున్న సంతోష్ కోమాలోకి వెళ్లడం జీర్ణించుకోలేని విషయం.

MOST READ:ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ వసూల్.. చూసారా !

బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

సిఎస్ సంతోష్ డాకర్ ర్యాలీలో ఏడవసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రపంచంలోనే కష్టతరమైన మరియు అత్యంత ప్రమాదకరమైన డాకర్ ర్యాలీలో పాల్గొన్న మొదటి భారతీయుడు సిఎస్ సంతోష్. ఇండియన్ ఏస్ ర్యాలీ వంటి పలు ప్రతిష్టాత్మక ర్యాలీ రేసుల్లో పాల్గొన్నాడు.

బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

సిఎస్ సంతోష్ స్టార్టింగ్ ప్రోలాగ్ దశలో 35 వ స్థానంలో నిలిచి 2021 డాకర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ఏడాది డాకర్ ర్యాలీ నాలుగో దశను 43 వ స్థానంలో ముగించాడు. డాకర్ ర్యాలీ మూడో దశలో 36 వ స్థానంలో నిలిచాడు. మూడవ దశలో హీరో మోటోస్పోర్ట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న సిఎస్ సంతోష్ 36 వ స్థానంలో నిలిచారు.

MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

ముగ్గురు రైడర్లతో కూడిన హీరో మోటోస్పోర్ట్ టీమ్ లో సిఎస్ సంతోష్ చేరారు. ఇందులో జోక్విమ్ రోడ్రిగెజ్ మరియు సెబాస్టియన్ బుహ్లెర్ ఉన్నారు. సిఎస్ సంతోష్ మరియు జోక్విమ్ రోడ్రిగెజ్ ఐదవసారి డాకర్ ర్యాలీలో కనిపిస్తున్నారు. 2021 డాకర్ ర్యాలీలో హీరో మోటోస్పోర్ట్ టీమ్ 3 స్టేజ్ తర్వాత జనరల్ రైకింగ్‌లో ఇద్దరు రైడర్స్ టాప్ 25 లో ఉన్నారు.

బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

జోకిమ్ రోడ్రిగెజ్ 19 వ స్థానంలో, సెబాస్టియన్ బుహ్లెర్ 24 వ స్థానంలో నిలిచారు. సి.ఎస్ సంతోష్ 34 వ స్థానంలో ఉన్నాడు. మూడవ స్టేజ్ పోతయినా తర్వాత, సిఎస్ సంతోష్ మాట్లాడుతూ, ఈ స్టేజ్ మరొక సుదీర్ఘమైన మరియు వేగవంతమైన దశ. ఇది చాలావరకు కష్టతరంగా ఉన్నప్పటికీ ఒక సవాలుగా ఉందన్నారు. ఎట్టకేలకు మూడవ స్టేజ్ పూర్తయ్యి నాల్గవ స్టేజ్ కి వెళ్లడం నిజంగా ఆనందంగా ఉందన్నారు.

MOST READ:మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్‌లో కుప్పకూలిన సిఎస్ సంతోష్

యావత్ భారతదేశం గర్వించదగ్గ సంతోష్ ఈ విధంగా ప్రమాదానికి గురవ్వడం చాలా బాధాకరం. సీఎస్ సంతోష్ త్వరగా కోలుకోవాలని, తిరిగి ఇలాంటి మరిన్ని ర్యాలీల్లో పాల్గొనాలని మేము ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #motorsports
English summary
CS Santosh Crashes Out In Stage 4 Of Dakar Rally 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X