హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

ప్రతిష్టాత్మకమైన 2021 డాకర్ ర్యాలీ యొక్క 2 వ స్టేజ్ ఎట్టకేలకు ముగిసింది. ఈ సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ తో పోలిస్తే స్పెషల్ స్టేజ్, ఈ స్టేజ్ లో దూరం కూడా ఎక్కువ. అయినప్పటికీ ఇది చాలా వేగవంతమైన దశ. ఎంతో హోరా హోరీగా ఈ రెండవ దశ ముగిసింది.

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

డాకర్ ర్యాలీ యొక్క 43 వ ఎడిషన్‌లో పోటీ పడుతున్న ముగ్గురు భారతీయ రైడర్‌లు బలంగా నిలిచి రేపు 3 వ దశకు చేరుకున్నారు. ఈ పోటీ చలామది రైడర్లకు చాలా కష్టసాధ్యంగా మారింది. మాన్స్టర్ ఎనర్జీ యమహా ర్యాలీ టీమ్ యొక్క ఆండ్రూ షార్ట్ రైడింగ్‌తో సహా ఎక్కువ మంది పాల్గొనేవారు బైక్ కేటగిరీ నుండి రిటైర్ కావడంతో ఇది ఎంత కఠినమైందో మనకు అర్థమవుతోంది.

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

ర్యాలీ రేస్ యొక్కస్టేజ్ 2 బిషా మరియు వాడి అడ్-దావసిర్ మధ్య జరిగింది. స్టేజ్ 2 యొక్క మొత్తం దూరం 685 కిలోమీటర్లు. వీటిలో కాంపిటేటివ్ స్పెషల్ స్టేజ్ 457 కి.మీ. ఈ స్పెషల్ స్టేజ్ లో 82 శాతం ఇసుక, 13 శాతం ఇసుక దిబ్బ, 5 శాతం మట్టి ఉంటుంది. ఈ దారి మునుపటి స్టేజ్ కంటే చాలా కష్టంగా ఉంది. ఇది రైడర్స్ అందరికి సవాలుగా మారింది.

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

డాకర్ ర్యాలీ యొక్క 2 వ స్టేజ్ ను మాన్స్టర్ ఎనర్జీ హోండా ర్యాలీ జట్టుకు చెందిన జోన్ బారెడా బోర్ట్ గెలుచుకున్నాడు. అతని సహచరుడు మరియు డిఫెండింగ్ ఛాంపియన్ రికీ బ్రబెక్ రెండవ స్థానంలో నిలిచాడు. రాక్‌స్టార్ ఎనర్జీ హస్క్ వర్ణా ఫ్యాక్టరీ రేసింగ్ జట్టులో పాబ్లో క్వింటానిల్లా మూడవ స్థానంలో నిలిచారు.

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

ఇక ఇందులో పాల్గొన్న భారతీయ రైడర్స్ విషయానికి వస్తే , ఇందులో హరిత్ నోహ్ 04:56:05 సమయంలో స్టేజ్ 2 ని పూర్తి చేసి 32 వ స్థానాన్ని పొందాడు, ఇది మొదటి స్థానంలో ఉన్న రైడర్ కంటే 38 నిమిషాల 09 సెకన్ల వెనుక ఉంది. అతని సహచరులు లోరెంజో శాంటోలినో మరియు రుయి గొన్కల్వ్స్ 2021 డాకర్ ర్యాలీ యొక్క స్టేజ్ 2 ను వరుసగా 13 మరియు 21 వ స్థానంలో పూర్తి చేశారు.

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

ఇండియన్ ఏస్ ర్యాలీ రైడర్ సిఎస్ సంతోష్ 36 వ స్థానాన్ని పొందాడు, స్టేజ్ 2 ను 05:02:17 సమయం, 44 నిమిషాల 21 సెకన్లలో స్టేజ్ 1 నాయకుడి కంటే ముందుగానే ముగించాడు. ఆశిష్ రావరన్ 85 వ స్థానం పొందారు. అతను మల్లె మోటో విభాగంలో పాల్గొన్నాడు, అతను 1 07:37:11 సమయం లో ప్రత్యేక దశను పూర్తి చేశాడు.

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

2021 డాకర్ ర్యాలీ యొక్క రెండవ దశ తరువాత, సిఎస్ సంతోష్ మాట్లాడుతూ, ఈ రోజు ఈ స్టేజ్ 2 నిజంగా ఒక ప్రత్యేతికమైన కష్టతరమైన దశ. మొత్తం మీద చాలా ఉత్సాహంతో ప్రారంభించి మంచి అనుభూతిని పొందాను, ఈ రోజు రైడింగ్ చాలా వేగంగా ఉంది. మొదటి స్టేజ్ కంటే కూడా ఈ 2 వ స్టేజ్ చాలా సరదాగా అనిపించిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా బాగా రాణించగలను అనే విశ్వాసం కలిగిందని సంతోష్ తెలిపారు.

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

హీరో మోటోస్పోర్ట్ ర్యాలీ జట్టులోని ఇతర రైడర్స్, జోక్విమ్ రోడ్రిగ్స్ మరియు సెబాస్టియన్ బుహ్లెర్ 2021 డాకర్ ర్యాలీ యొక్క స్టేజ్ 2 ను వరుసగా 12 మరియు 14 వ స్థానంలో పూర్తి చేశారు. ప్రస్తుత ర్యాలీలో హీరో మోటోస్పోర్ట్ ముందుకు సాగుతోంది.

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

స్టేజ్ 2 ఫలితాలు :

హీరో మోటోస్పోర్ట్ ర్యాలీ టీమ్ స్టాండింగ్స్

*12 వ స్థానం - జోక్విమ్ రోడ్రిగ్స్ [04:36:04]

*14 వ స్థానం - సెబాస్టియన్ బుహ్లెర్ [04:38:43]

*36 వ స్థానం - సి ఎస్ సంతోష్ [05:02:17]

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

షెర్కో ర్యాలీ టీమ్ స్టాండింగ్స్

*13 వ స్థానం - లోరెంజో శాంటోలినో [04:38:07]

*21 వ స్థానం - రూయి గోన్కల్వ్స్ [04:45:20]

*32 వ స్థానం - హరిత్ నోహ్ [04:56:05]

హోరాహోరీగా సాగిన 2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 2 ; ఫలితాలు ఇవే

మల్లె మోటో క్లాస్

85 వ స్థానం - ఆశిష్ రోరనే [07:37:11]

స్టేజ్ 2 స్టాండింగ్స్ (బైక్)

*1 వ స్థానం - జోన్ బారెడ బోర్ట్ [04:17:56] (మాన్స్టర్ ఎనర్జీ హోండా టీం 2021)

*2 వ స్థానం - రికీ బ్రబెక్ [04:21:51] (మాన్స్టర్ ఎనర్జీ హోండా టీం 2021)

*3 వ స్థానం - పాబ్లో క్వింటానిల్లా [04:23:58] (రాక్‌స్టార్ ఎనర్జీ హుస్క్ వర్ణా ఫ్యాక్టరీ రేసింగ్)

More from DriveSpark

Article Published On: Tuesday, January 5, 2021, 12:30 [IST]
English summary
Dakar Rally 2021 Stage 2 Results & Highlights. Read in Telugu.
Read more on: #motorsport
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+