భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డుకాటీ 2021 స్ట్రీట్‌ఫైటర్ వి4 మరియు వి4 ఎస్ లను ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ కొత్త 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వి4 మరియు వి4ఎస్ పెర్ఫార్మెన్స్ స్ట్రీట్ నేకెడ్ మోటార్ సైకిళ్ల ధరలు వరుసగా రూ. 19.99 లక్షలు, రూ. 22.99 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా).

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన 2021 స్ట్రీట్ ఫైటర్ వి4 మరియు వి4 ఎస్ మోటార్ సైకిళ్ళు చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ బైక్ లో కొత్త ఎలక్ట్రానిక్స్ మరియు అప్డేటెడ్ పవర్ యూనిట్ కలిగి ఉంటుంది. ఈ స్ట్రీట్ ఫైటర్ వి 4 లైనప్ లో బ్రాండ్ యొక్క ప్రధాన న్యాక్డ్ మోటార్ సైకిల్ సమర్పణ.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వి4 బైక్ సింగిల్ రెడ్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. అదే స్ట్రీట్ ఫైటర్ వి4ఎస్ మాత్రం రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి డుకాటీ రెడ్ మరియు డార్క్ స్టీల్త్ కలర్స్.

ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే ఇప్పుడు ఈ బైక్ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు ఓపెన్ చేయబడ్డాయి.

MOST READ:మహీంద్రా కస్టమర్లకు గుడ్ న్యూస్.. వెహికల్ వారంటీ టైమ్ ఇప్పుడు జులై 31 వరకు

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

2021 డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వి4 మరియు వి4ఎస్ మోటారు సైకిళ్ల మునుపటి మోడల్స్ లో ఉన్న అదే ఇంజిన్ కలిగి కొంత అప్డేట్స్ చేయబడి ఉంటుంది. ఇందులో ఉన్న 1,103 సిసి ఇంజన్ 13,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 206 బిహెచ్‌పి మరియు 9.500 ఆర్‌పిఎమ్ వద్ద 123 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో డుకాటీ క్విక్ షిఫ్ట్ ఈవిఓ 2 బై డైరెక్షనల్ మరియు స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో జతచేయబడుతుంది.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

కొత్త 2021 డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వి4 బరువు 201 కేజీలు కాగా, వి4ఎస్ బరువు 199 కేజీల వరకు ఉంటుంది. ఈ మోటారుసైకిల్ యొక్క పవర్ మరియు టార్క్ ఫిగర్స్ అక్రపోవిక్ ఫుల్ రేసింగ్ పెర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్‌ను అమర్చడం ద్వారా 217 బిహెచ్‌పి మరియు 130 ఎన్‌ఎమ్‌లకు పెంచవచ్చు. ఇది మోటారుసైకిల్ బరువును 6 కిలోల వరకు తగ్గిస్తుంది.

MOST READ:మిచెలిన్ కంపెనీ టైర్లు ఎలా తయారుచేస్తుందో తెలుసా.. అయితే ఇది చూడండి

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

ఈ మోటారుసైకిల్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 270 కిలోమీటర్ల వరకు వుంటుంది. స్ట్రీట్ ఫైటర్ వి 4 మోడల్స్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం 5 ఇంచెస్ టిఎఫ్టి కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

ఇందులో మల్టిఫుల్ రైడింగ్ మోడ్‌లు, వివిధ పవర్ మోడ్‌లు, కార్నరింగ్ ABS ఈవిఓ, డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్ ఈవిఓ2, డుకాటీ వీలీ కంట్రోల్ ఈవిఓ, డుకాటీ స్లైడ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ ఈవిఓ మరియు ఆటో టైర్ కాలిబ్రేషన్ ఉంటాయి.

MOST READ:భారత్‌లో విడుదలైన వైట్ కార్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్; పూర్తి వివరాలు

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

ఈ కొత్త బైక్ లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు టైల్ లాంప్స్, ఫ్యూయెల్ ట్యాంక్, రేడియేటర్ గ్రిల్, లోడ్ ఫినిష్డ్ ఫోర్కులు మరియు సింగిల్-సైడెడ్ స్వింగార్మ్ వంటివి ఉన్నాయి. స్ట్రీట్ ఫైటర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, చూపరులను ఆకట్టుకునేవిధంగా ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

వి4 బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ యుఎస్‌డి షోవా బిపిఎఫ్ మరియు వెనుక భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ సాచ్స్ మోనో-షాక్ యూనిట్ కలిగి ఉంటుంది. ఇక వి4ఎస్ యొక్క ముందు భాగంలో ఎలక్ట్రానిక్-అడ్జస్టబుల్ ఓహ్లిన్స్ ఎన్ఐఎక్స్30 USD ఫోర్కులు మరియు వెనుక భాగంలో ఓహ్లిన్స్ టిటిఎక్స్36 మోనో-షాక్ యూనిట్లను కలిగి ఉంది.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

ఈ రెండు మోటార్‌సైకిళ్ల యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో డ్యూయల్ 330 మిమీ సెమీ ఫ్లోటింగ్ డిస్క్‌ల ద్వారా రేడియల్-మౌంటెడ్ బ్రెంబో మోనోబ్లోక్ స్టైల్మా ఎమ్4.30 4-పిస్టన్ కాలిపర్స్ మరియు వెనుక భాగంలో రెండు-పిస్టన్ కాలిపర్‌తో ఒకే 245 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

స్టాండర్డ్ స్ట్రీట్ ఫైటర్ వి 4 మోటారుసైకిల్ లో 5 స్పోక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండగా, వి 4 ఎస్ లో 3-స్పోక్ ఫోర్జెడ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ ఉంటాయి. భారత మార్కెట్లో అడుగుపెట్టిన 2021 స్ట్రీట్‌ఫైటర్ వి 4 మరియు వి 4 ఎస్, ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ మరియు కవాసకి నింజా జెడ్ హెచ్ 2 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Ducati Streetfighter V4 & V4S Launched In India. Read in Telugu.
Story first published: Thursday, May 13, 2021, 17:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X