భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

2021 డుకాటీ స్క్రాంబ్లర్ రేంజ్ ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలైంది. ఇందులో ఐకాన్, ఐకాన్ డార్క్ మరియు 1100 డార్క్ ప్రో అనే మూడు వేరియంట్స్ ఉన్నాయి. వీటిలో ఐకాన్ డార్క్ 800 మోడల్‌ ధర రూ. 7.99 లక్షలు, ఐకాన్ 800 వేరియంట్ ధర రూ. 8.49 లక్షలు కాగా, డుకాటీ స్క్రాంబ్లర్ 1100 డార్క్ ప్రో ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

భారత మార్కెట్లో విడుదలైన ఈ మూడు మోడల్స్ ఇప్పుడు సరికొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్డేట్స్ చేయబడ్డాయి. డుకాటీ ఇండియా ఇప్పుడు త ఆక్రొత్త బైక్స్ కోసం బుకింగ్‌లు స్వీకరించడం ప్రారంభించింది. వినియోగదారులు తమ స్క్రాంబ్లర్ బైక్స్ ని ఆన్‌లైన్‌లో లేదా భారతదేశం అంతటా ఉన్న బ్రాండ్ డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే మోటార్ సైకిళ్ల డెలివరీలు జనవరి 28 నుండి ప్రారంభమవుతుంది.

భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

డుకాటీ నుంచి విడుదలైన ఐకాన్ డార్క్ తో మొదలుపెట్టినట్లైతే, ఈ మోడల్ బ్రాండ్ యొక్క స్క్రాంబ్లర్ 800 రేంజ్ కి ఎంట్రీ లెవెల్ అఫర్. ఈ వేరియంట్ మాట్టే బ్లాక్ పెయింట్ స్కీమ్‌తో వస్తుంది, అదే సమయంలో బ్లాక్-అవుట్ ఫ్రేమ్ మరియు గ్రే రిమ్‌తో బ్లాక్ అపోల్స్ట్రేడ్ సీట్లను కలిగి ఉంది.

MOST READ:సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఎంట్రీ లెవల్ ‘ఐకాన్ డార్క్' కన్నా కొంచెం ఎక్కువ ధరతో విడుదలైన ఐకాన్ మోడల్ రెండు పెయింట్ స్కీమ్‌లలో పూర్తయింది. అవి డుకాటీ రెడ్ మరియు క్లాసిక్ ‘62 ఎల్లో '. వీటికి మళ్ళీ బ్లాక్ ఫ్రేమ్ మరియు బ్లాక్ సీట్స్ కలిగి ఉంటడం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

ఇక కొత్త 2021 డుకాటీ స్క్రాంబ్లర్ 800 రేంజ్ మోడల్, కొన్ని స్టీల్ టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంటర్ చేంజబుల్ అల్యూమినియం సైడ్ ప్యానెల్లు, కొత్త ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, స్విచ్ గేర్, వైడ్ హ్యాండిల్‌బార్లు, మృదువైన క్లచ్ కంట్రోల్ మరియు కొత్త ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి వాటిని కలిగి ఉంటుంది.

MOST READ:ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి

భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

2021 డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ మరియు ఐకాన్ డార్క్ వేరియంట్లు 803 సిసి ఎల్-ట్విన్ ఇంజిన్‌ కలిగి ఉంటాయి. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 8250 ఆర్‌పిఎమ్ వద్ద 72 బిహెచ్‌పి మరియు 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 66 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

రేంజ్-టాపింగ్ స్క్రాంబ్లర్ 1100 డార్క్ ప్రో మోటారుసైకిల్ ‘డార్క్ స్టీల్త్' లివరీతో వస్తుంది. కొత్త 1100 డార్క్ ప్రో 800 లో యానోడైజ్డ్ అల్యూమినియం భాగాలకు బదులుగా మాట్టే బ్లాక్ ఎలిమెంట్లను ఉపయోగించడం ద్వారా దాని మునుపటి మోడల్స్ కి కొంత భిన్నంగా కనిపిస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం

భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

డుకాటీ స్క్రాంబ్లర్ 1100 డార్క్ ప్రో కార్నరింగ్ ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి యాక్టివ్, జర్నీ మరియు సిటీ మోడ్స్. రేంజ్-టాపింగ్ వేరియంట్‌లో 1,079 సిసి ఎల్-ట్విన్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి మరియు 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 87 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

2021 డుకాటీ స్క్రాంబ్లర్ రేంజ్ చివరకు తన లేటెస్ట్ బిఎస్ 6 ఉద్గారప్రమాణాలకు అనుకూలంగా అదనపు ఫీచర్స్ మరియు పరికరాలతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది మునుపటికంటే చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. స్క్రాంబ్లర్ రేంజ్ మోడల్స్ భారత మార్కెట్లో బ్రాండ్ నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫర్లలో ఒకటిగా ఉన్నాయి.

MOST READ:ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్

Most Read Articles

Read more on: #ducati
English summary
2021 Ducati Scrambler Range Launched In India. Read in Telugu.
Story first published: Friday, January 22, 2021, 15:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X