దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

భారతీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు విడులవుతున్నాయి. ఇనులో భాగంగానే ప్రముఖ ఇటాలియన్ టూ వీలర్ బ్రాండ్ Ducati (డుకాటి) దేశీయ మార్కెట్లో కొత్త Ducati Monster (డుకాటి మోన్‌స్టర్) బైక్ ను విడుదల చేసింది. ఈ కొత్త Ducati Monster యొక్క ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు.

ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ కూడా కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ కొత్త బైక్ కొనుగోలు చేయాలనే కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లో కానీ లేదా అధీకృత డీలర్‌షిప్ లో కానీ బుక్ చేసుకోవచ్చు. Ducati Monster గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Ducati Monster రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి స్టాండర్డ్ వేరియంట్ మరియు డుకాటి మోన్‌స్టర్ ప్లస్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 10.99 లక్షలు, మరియు రూ. 11.24 లక్షలు (ఎక్స్ షోరూమ్).

దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

కొత్త Ducati Monster చాలా స్టైలిష్ గా కనిపించడమే కాకుండా, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కొత్త 2021 Ducati Monster లో హెడ్‌ల్యాంప్ లు పూర్తిగా ఎల్ఈడి లైటింగ్ సెటప్ ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 'బైసన్-బ్యాక్' ప్రొఫైల్‌ తో కూడిన కొత్త ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, సన్నటి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

Ducati Monster యొక్క రియర్ ప్రొఫైల్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక స్పోర్టీవ్ నెస్ పెంపొందించడానికి చాలా సన్నగా ఉంది. ఈ బైక్ ఒక నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్ కాబట్టి, దీని డిజైన్‌లో ఎక్కువగా కట్స్ లేదా క్రీజ్ లైన్స్ ఉండవు. అయినప్పటికీ అద్భుతంగా కనిపిస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

కొత్త 2021 Ducati Monster బైక్ లో కొత్త బిఎస్ 6 కంప్లైంట్ 937 సిసి లిక్విడ్ కూల్డ్, ట్విన్ సిలిండర్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ మరియు 93 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

కొత్త 2021 Monster ను దాని పానిగలె వి4 నుండి ప్రేరణ పొందిన సరికొత్త అల్యూమినియం ఫ్రేమ్‌ పై నిర్మించారు. ఈ బైక్ మొత్తం బరువు 166 కిలోలు మరియు ఇది మునుపటి కంటే 18 కిలోల తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇందులోని వెనుక సబ్ ఫ్రేమ్ ను గ్లాస్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్డ్ పాలిమర్ (GFRP) మెటీరియల్ తో తయారు చేయబడింది కాబట్టి, ఇది మునుపటి కంటే తేలికగా మరియు ధృడంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

కొత్త Ducati Monster యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 130 మిమీ డ్రైవ్‌ తో కూడిన 43 మిమీ అప్‌సైడ్ డౌన్ (యూఎస్‌డి) ఫోర్కులు మరియు వెనుక వైపు 140 మిమీ డ్రైవ్‌తో కూడిన మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ బైక్ లో మునుపటి కంటే మరింత తేలికైన కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ను ఉపయోగించారు.

దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

Ducati Monster అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో ట్విన్ బ్రెంబో ఎమ్4.32 4-పిస్టన్ మోనోబ్లాక్ కాలిపర్‌ లతో కూడిన ట్విన్ 320 మిమీ డిస్క్ బ్రేక్‌ లను మరియు వెనుక భాగంలో బ్రెంబో కాలిపర్‌ లతో కూడిన సింగిల్ 245 మిమీ డిస్క్ బ్రేక్‌ ను ఉపయోగించారు. ఈ బైక్ యొక్క అన్ని వేరియంట్లలో కూడా ఇదే విధమైన బ్రేక్ సెటప్ స్టాండర్డ్ ఫీచర్ గా లభిస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

కొత్త Ducati Monster బైక్ మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి స్పోర్ట్, టూరింగ్ మరియు అర్బన్ మోడ్స్. అంతే కాకుండా Ducati Monster లో కొత్త 4.3 ఇంచ్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇది వెహికల్ గురించి రైడర్ కి చాలా సమాచారాన్ని అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన Ducati Monster; ధర రూ. 10.99 లక్షలు

కొత్త Ducati Monster భారతదేశంలో అధికంగా విజృంభించిన కరోనా మహమ్మారి కారణంగా విడుదల ఆలస్యం అయ్యింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2021 Ducati Monster ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మరియు కవాసకి జెడ్ 900 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Ducati launched all new monster naked sport motorcycle in india detaills
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X