దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

ప్రముఖ ఇటాలియన్ సూపర్ బైక్ తయారీ దారు Ducati (డుకాటి) భారతీయ మార్కెట్లో కొత్త Ducati SuperSport 950 (డుకాటి సూపర్ స్పోర్ట్ 950) బైక్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). డుకాటి ఇండియా కొత్త సూపర్‌స్పోర్ట్ 950 BS6 కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. కావున డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త బైక్ గురించ్చి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలై కొత్త Ducati SuperSport 950 బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి స్టాండర్డ్ వేరియంట్ మరియు రెండు ఎస్ వేరియంట్. కంపెనీ యొక్క Ducati SuperSport 950 ధర రూ. 13.49 లక్షలు కాగా, సూపర్‌స్పోర్ట్ 950 ఎస్ ధరలు డుకాటి రెడ్ ధర రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా Ducati ఆర్కిటిక్ వైట్ సిల్క్ కలర్ ధర రూ. 15.69 లక్షలు.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

కొత్త Ducati SuperSport 950 బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. అప్‌డేటెడ్ సూపర్‌స్పోర్ట్ 950 చాలా స్పోర్టియర్‌గా కనిపిస్తాయి. ఈ బైక్ రోజూ రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

కొత్త Ducati SuperSport 950 బైక్ డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ విడుదలైనప్పటి నుంచి కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆధారం పొందింది. ఈ బైక్ 2016 లో మోస్ట్ బ్యూటిఫుల్ బైక్ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రారంభించిన నాలుగు సంవత్సరాల తరువాత, డుకాటి సూపర్‌స్పోర్ట్ 950 కొత్త స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్న యువ రైడర్స్ కోసం ఇది మరిన్ని అప్డేట్స్ పొందింది.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

ఈ బైక్ ముందు భాగంలో ఫుల్-ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ పొందుతుంది. వెనుక భాగంలో సాక్స్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఇవ్వబడింది. ఇందులో విండ్‌షీల్డ్, స్ట్రీమ్‌లైన్డ్ మరియు డైనమిక్ లైన్‌వంటివి కూడా ఉన్నాయి. ఫుల్లీ-టిఎఫ్‌టి కలర్ డాష్‌బోర్డ్ కూడా ఇందులో చూడవచ్చు.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

Ducati SuperSport 950 బైక్ బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, ఇది బ్రెంబో బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది.ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ బ్రెంబో M4-32 మోనోబ్లాక్ రేడియల్ కాలిపర్‌లు మరియు వెనుక భాగంలో 245 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది అద్భుతంగా పనిచేస్తాయి.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

కొత్త Ducati SuperSport 950 బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్లలో ఒకే ఇంజిన్ ఆప్సన్ ఇవ్వబడింది. బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా సవరించబడిన 937 సిసి ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 108.6 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 93 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

Ducati కంపెనీ తన రెండు వేరియంట్లలో అనేక ప్రామాణిక ఫీచర్లను అందించింది. ఇందులో LED హెడ్‌లైట్, 4.3 ఇంచెస్ ఫుల్లీ-టిఎఫ్‌టి డిస్‌ప్లే, సింగిల్ సైడెడ్ స్వింగార్మ్, ఎత్తైన హ్యాండిల్‌బార్, రివైజ్డ్ సీట్లు, త్రీ-స్పోక్ 'వై' అల్యూమినియం వీల్స్ మరియు పిరెల్లి డయాబ్లో రోసో 3 టైర్లు ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

ఇవి మాత్రమే కాకుండా ఇందులో బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా అప్‌డేట్ చేయబడిన హెడ్‌లైట్ డిజైన్, స్పోర్టియర్ ఫెయిరింగ్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన విండ్‌స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ ఇండికేటర్స్, స్టెప్-అప్ జీను మరియు ట్విన్-పాడ్ ఎగ్జాస్ట్ వంటివి కూడా ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

మోటార్‌సైకిల్ యొక్క లీన్ మరియు పిచ్‌ను కొలిచే కొత్త సిక్స్-యాక్సిస్ IMU సెన్సార్‌ కూడా ఇందులో ఉంటుంది. ఇది ABS, ట్రాక్షన్ కంట్రోల్ మరియు వీలీ కంట్రోల్ వంటి కార్నర్ అసిస్ట్ ఫీచర్‌లకు సహాయపడుతుంది. బైక్ మూడు రైడింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి స్పోర్ట్, టూరింగ్ మరియు అర్బన్ మోడ్స్.

దేశీయ మార్కెట్లో Ducati నుంచి మరో సూపర్ బైక్ లాంచ్; ధర రూ. 13.49 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Ducati SuperSport 950 బైక్ కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది, కావున ఈ కొత్త బైక్ దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను చవి చూస్తుందని విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Ducati supersport 950 bs6 launched in india at rs 13 49 lakhs features details
Story first published: Thursday, September 9, 2021, 17:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X