ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

హీరో సైకిల్స్ సంస్థకి చెందిన ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ హీరో లెక్ట్రో (Hero Lectro), తమ ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్ ని బట్టి హీరో లెక్ట్రో ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలు 7.5 శాతం నుండి 12.8 శాతం వరకు పెరిగాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ మెటీరియల్ మరియు సరుకు రవాణా ఖర్చుల ప్రభావాన్ని తగ్గించడానికే ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

తాజా ధరల సవరణ అనంతరం హీరో లెక్ట్రో ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలు సుమారు రూ. 5,000 వరకూ పెరిగాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. హీరో సైకిల్స్ తమ లెక్ట్రో బ్రాండ్ క్రింద సుమారు 10 వేరియంట్‌లతో కూడిన C సిరీస్ వంటి ఎలక్ట్రిక్ సైకిళ్ల శ్రేణిని విక్రయిస్తోంది, మార్కెట్లో వీటి ధరలు రూ. 28,999 (C3 మోడల్) నుండి రూ. 54,999 (F6i మోడల్) మధ్యలో ఉన్నాయి. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?
 • Hero Lectro C3 - రూ. 28,999
 • Hero Lectro C5 - రూ. 30,999
 • Hero Lectro C5e - రూ. 33,999
 • Hero Lectro C6 - రూ. 34,999
 • Hero Lectro C7 - రూ. 34,999
 • Hero Lectro C5v - రూ. 35,999
 • Hero Lectro C6e - రూ. 36,999
 • Hero Lectro C6v - రూ. 36,999
 • Hero Lectro C7+ - రూ. 36,999
 • Hero Lectro C8 - రూ. 36,999
 • Hero Lectro C5ie - రూ. 38,999
 • Hero Lectro C8i - రూ. 39,999
 • Hero Lectro C6ie - రూ. 40,999
 • Hero Lectro C9 - రూ. 46,999
 • Hero Lectro F6i - రూ. 54,999
 • (అన్ని ధరలు నవంబర్ 11, 2021వ తేదీ నాటికి, కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం.)

  ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

  హీరో లెక్ట్రో సి3 (Hero Lectro C3) ఇందులో బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ సైకిల్. ఇది సింగిల్ స్పీడ్ ఆప్షన్‌తో వస్తుంది. ఇందులో అమర్చిన బ్యాటరీ పూర్తి చార్జ్ గరిష్టంగా 25 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ బ్యాటరీ జీవితకాలం గరిష్టంగా మూడేళ్ల వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో పెడల్, క్రూయిజ్, పెడలెక్ మరియు థ్రోటల్ అనే నాలుగు రకాల రైడింగ్ మోడ్స్ ఉంటాయి. లెక్ట్రో సి3 యొక్క టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లుగా ఉంటుంది.

  ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

  కంపెనీ ప్రోడక్ట్ పోలియోలో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్ అయిన హీరో లెక్ట్రో ఎఫ్6ఐ (Hero Lectro F6i) సైకిల్‌పై దూర ప్రయాణాలు చేసే వారిని లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడింది. ఇందులో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ మరియు వేరు చేయగల (రిమూవబల్) బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఈ బ్యాటరీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 50 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

  ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

  ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో IP67 వాటర్ ప్రూఫ్ సామర్థ్యం కలిగిన 11.6 AH రిమూవబల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారు మరియు బయట చార్జింగ్ వసతులు లేని వారికి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లోని బ్యాటరీని తొలగించి, ఇంటిలోపల చార్జ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇంకా ఇందులో డిస్క్ బ్రేక్‌లు, 7 స్పీడ్ డ్రైవ్ ట్రైన్, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది యల్లో అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

  హీరో లెక్ట్రో కంపెనీకి దేశవ్యాప్తంగా 600 కంటే పైగా అవుట్‌లెట్‌లు ఉన్నాయి. అన్ని అవుట్‌లెట్లలో హీరో ఎలక్ట్రో ఇ-సైకిళ్లు అందుబాటులో ఉంటాయని హీరో సైకిల్స్ ప్రకటించింది. ధరల పెంపుపై కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య ముంజాల్ మాట్లాడుతూ.. ముడి వస్తువుల ధరలు మరియు ఇన్‌పుట్‌ ఖర్చులు పెరుగుదల వంటి బాహ్య మార్కెట్ కారకాల వలన తమ ఉత్పత్తి శ్రేణి యొక్క ధరలను సర్దుబాటు చేయకం తప్పడం లేదని అన్నారు.

  ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

  తప్పనిసరి చేస్తాయి. ఇది మా నాణ్యత కస్టమర్ అంచనాలకు అనుగుణంగా కొనసాగుతుందని నిర్ధారిస్తుంది. మరియు ప్రపంచ ప్రమాణాలు." తదుపరి ప్రకటనలో, "అన్ని మోడల్‌ల ధర రూ. 3 వేల నుంచి రూ. 5 వేలకు పెంచారు. హీరో ఎలక్ట్రో ఇండియా విద్యుత్ రంగంలో అధునాతన సాంకేతికత మరియు స్పష్టమైన విలువను ప్రతిపాదిస్తూ వాహనాలను తయారు చేస్తోంది. దీన్ని అనుసరించి కంపెనీ బలోపేతం అవుతుంది. వినియోగదారులకు సులభమైన సేవను అందించడానికి ఇది షోరూమ్ మరియు వర్చువల్ రెండింటిలోనూ సేవలను అందిస్తోంది.

  ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

  ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలి: హీరో సైకిల్స్

  ఇదిలా ఉంటే, భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లు మరియు ఫోర్ వీలర్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రోత్సాహకాలు అందిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఈ వాహనాల జాబితా ఎలక్ట్రిక్ సైకిళ్లు మాత్రం విస్మరించబడ్డాయి. ఎలక్ట్రిక్ సైకిళ్లపై ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందించడం లేదు. ఫలితంగా, రానున్న రోజుల్లో ఈ పరిశ్రమ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమను ఆదుకోవాలని హీరో సైకిల్స్ కోరింది.

  ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

  ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమను ప్రభుత్వ తయారీ లేదా ఎగుమతి ప్రోత్సాహక విధానానికి దూరంగా ఉంచారని, దీని కారణంగా పరిశ్రమ నష్టాలను ఎదుర్కొంటుందని హీరో సైకిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజాల్ అభిప్రాయ పడ్డారు. ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానమే దీనికి కారణమని పంకజ్ ముంజల్ వ్యాఖ్యానించారు.

  ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరలను పెంచిన Hero Lectro; కారణం ఏంటో తెలుసా?

  కేంద్ర ప్రభుత్వం యొక్క ఫేమ్-2 విధానం మరియు ఇటీవల ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకాలలో ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమను చేర్చలేదు లేదా ఎలక్ట్రిక్ సైకిల్స్ తయారు చేసే కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలను ప్రకటించలేదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ విధానం కారణంగా, రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశం సుమారు రూ. 10,000 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ సైకిల్ ఎగుమతి అవకాశాలను కోల్పోవచ్చని ఆయన అన్నారు.

Most Read Articles

English summary
Ero lectro increases e bicycle prices due to rising input freight costs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X