కేవలం 80 రూపాయలకు 800 కిలోమీటర్ల పరిధిని అందించే క్వాంటా ఎలక్ట్రిక్ బైక్; వివరాలు

దేశీయ మార్కెట్లో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకున్న డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ తరుణంలో కంపెనీలు కూడా చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసిన మార్కెట్లో విక్రయిస్తున్నారు. కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా తక్కువ నిర్వహణ ఖర్చు మరియు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలపై దృష్టి పెడుతున్నారు.

కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు చెందిన ఈవీ స్టార్ట్-అప్ గ్రావ్టన్‌ మోటర్స్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ క్వాంటాను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కేవలం 80 రూపాయలకు 800 కిలోమీటర్ల పరిధిని అందించే క్వాంటా ఎలక్ట్రిక్ బైక్; వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 99,000 (ఎక్స్-షోరూమ్). కొత్త క్వాంటా ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ వేరియంట్‌లో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో 1,000 రూపాయల చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కొత్త గ్రావ్టన్‌ క్వాంటా ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.

కేవలం 80 రూపాయలకు 800 కిలోమీటర్ల పరిధిని అందించే క్వాంటా ఎలక్ట్రిక్ బైక్; వివరాలు

ఈ క్వాంటా మోడల్ ఎలక్ట్రిక్ బైక్ స్థానికంగా అభివృద్ధి చేసిన ఫ్రేమ్, మోటారు కేసింగ్ మరియు బ్యాటరీ ప్యాక్‌తో 2016 నుండి అభివృద్ధి చేయబడుతోంది. అయితే దీనికి కావలసిన మోటారు సెల్స్ మరియు అయస్కాంతం వంటివి దిగుమతి చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

కేవలం 80 రూపాయలకు 800 కిలోమీటర్ల పరిధిని అందించే క్వాంటా ఎలక్ట్రిక్ బైక్; వివరాలు

ఈ బైక్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ కస్టమర్లను ఎక్కువగా ఆకర్శించేవిధంగా ఉంది. క్వాంటా ఎలక్ట్రిక్ బైక్ 100 సిసి ప్యాసింజర్ బైక్ కి సమానంగా ఉంటుంది. బ్యాటరీ విభాగానికి చురుకుదనం మరియు భద్రతను అందించడానికి రూపొందించిన మొట్టమొదటి రిబ్-కేజ్డ్ చాసిస్ ఈ బైక్ కి లభిస్తుందని కంపెనీ తెలిపింది. సస్పెన్షన్ సెటప్ సౌకర్యం కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేయబడింది.

కేవలం 80 రూపాయలకు 800 కిలోమీటర్ల పరిధిని అందించే క్వాంటా ఎలక్ట్రిక్ బైక్; వివరాలు

కొత్త క్వాంటా ఎలక్ట్రిక్ బైక్ లో 3 కిలోవాట్స్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటారు ఉంది. ఇది 170 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు సుమారు 70 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది 3 కిలోవాట్ల లిథియం-అయాన్ యూనిట్.

కేవలం 80 రూపాయలకు 800 కిలోమీటర్ల పరిధిని అందించే క్వాంటా ఎలక్ట్రిక్ బైక్; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఛార్జీపై 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే ఇది ఎకో మోడ్‌లో ఇది 320 కిలోమీటర్ల అందిస్తుంది. ఈ బైక్ భారతీయ రహదారులకు అనుకూలంగా ఉండేవిధంగా తయారు చేయబడింది. కావున దీనికి అనుకూలంగా 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో అందించబడ్డాయి.

కేవలం 80 రూపాయలకు 800 కిలోమీటర్ల పరిధిని అందించే క్వాంటా ఎలక్ట్రిక్ బైక్; వివరాలు

గ్రావ్టన్‌ యొక్క వినియోగదారులు తమ బ్యాటరీలను గ్రావ్టన్‌ యొక్క బ్యాటరీ స్టేషన్ వద్ద రీఛార్జ్ చేసి మార్చుకోవచ్చు. కంపెనీ దీనికోసం తెలంగాణా అంతటా వినియోగదారులకు అనుకూలంగా ఉండేవిధంగా బ్యాటరీ రీఛార్జ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. తరువాత కాలంలో దీని విస్తరణను బట్టి బ్యాటరీ రీఛార్జ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ బైక్‌ కేవలం రూ. 80 ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగలదని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

కేవలం 80 రూపాయలకు 800 కిలోమీటర్ల పరిధిని అందించే క్వాంటా ఎలక్ట్రిక్ బైక్; వివరాలు

గ్రావ్టన్‌ క్వాంటా బైక్ లో రెండు-మోడ్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. దీనిని ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా, ఛార్జ్ చేయడానికి 90 నిముషాల సమయం పడుతుంది. బ్యాటరీకి 5 సంవత్సరాల వరకు వారంటీ ఉంటుంది. ఇందులో రిమోట్ లాక్ / అన్‌లాక్, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, మ్యాపింగ్‌ సర్వీస్‌ స్టేషన్స్‌ మరియు స్మార్ట్ ఫోన్ యాప్ కూడా ఉన్నాయి. ఈ ఏలెక్ట్రిక్ బైక్ యొక్క పేలోడ్ సామర్థ్యం 250 కేజీలు. ఈ బైక్ మూడు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

Most Read Articles

English summary
Gravton Quanta Electric Bike Launched In India At Rs 99,000. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X