ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

ప్రముఖ అమెరికన్ ఐకానిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ (Harley-Davidson) తన హార్లే-డేవిడ్‌సన్ పాన్ అమెరికా 1250 (Harley-Davidson Pan America 1250) మోటార్‌సైకిల్‌ను సీట్ బేస్ లోపం కారణంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

కంపెనీ నివేదికల ప్రకారం, హార్లే-డేవిడ్‌సన్ 2021 మార్చి 8 మరియు 2021 అక్టోబర్ 13 మధ్య తయారు చేయబడిన పాన్ అమెరికా 1250 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లోని మొత్తం 2,689 యూనిట్లు ఈ లోపం వల్ల ప్రభావితమైనట్లు కంపెనీ తెలియజేసింది. ఇందులో సీట్ బేస్ సరిగ్గా అమర్చబడకపోవచ్చు. కావున ఈ కారణంగా బేస్ యొక్క హ్యాండ్‌హోల్డ్ భాగం యొక్క పగుళ్లకు దారి తీస్తుంది.

ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

ఈ రీకాల్ ద్వారా ప్రభావితమైన యూనిట్లకు కొత్త సీట్ బేస్‌తో భర్తీ చేయబడుతుంది. అయితే ప్రస్తుతం ఈ రీకాల్ అంతర్జాతీయ మార్కెట్ల కోసం మాత్రమే అమలు చేయబడిందని తెలుస్తోంది. అయితే భారతీయ మార్కెట్లో ఈ రీకాల్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. రీకాల్ ప్రకటించిన కారణంగా కస్టమర్లు డీలర్లను త్వరలో సంప్రదించవచ్చు. ఆ తర్వాత ప్రభావితమైన Harley-Davidson Pan America 1250 తో సమస్యను పరిష్కరించవచ్చు.

ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

ఇక కంపెనీ యొక్క పాన్ అమెరికా 1250 విషయానికి వస్తే, భారత మార్కెట్లో హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.16.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన పాన్ అమెరికా 1250 స్పెషల్ ధర రూ.19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

ఈ మోటార్‌సైకిల్‌లో ఫుల్లీ ఎల్‌ఈడి లైటింగ్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని, ఏబిఎస్, డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్‌ను నియంత్రించడానికి డేటాను అందించే ఐఎమ్‌యూ మరియు రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ ప్లస్ అనే ఐదు రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ప్రతి రైడింగ్ మోడ్ కూడా ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌లతో వస్తుంది.

ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా బైక్‌లో బ్లూటూత్ టెక్నాలజీ కలిగిన 6.8 ఇంచ్ కలర్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ డిస్ప్‌ప్లే యూనిట్ ఉంటుంది. దీని సాయంతో రైడర్ రిమోట్‌గా తన బైక్‌కు కనెక్ట్ అయి వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు మరియు నావిగేషన్‌తో పాటుగా అనేక రకాల ఫంక్షన్లను కంట్రోల్ చేయవచ్చు.

ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

హార్లే-డేవిడ్సన్ తయారు చేసిన ఈ మొట్టమొదటి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన 1,252 సిసి రివల్యూషన్ మాక్స్ వి-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 127 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

టాప్-ఎండ్ వేరియంట్ అయిన పాన్ అమెరికా 1250 స్పెషల్‌లో సెమీ యాక్టివ్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్‌తో పాటు వెహికల్ లోడ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టాండర్డ్ సెంటర్ స్టాండ్, సర్దుబాటు చేయగల వెనుక బ్రేక్ పెడల్, అల్యూమినియం స్కిడ్-ప్లేట్, హీటెడ్ హ్యాండ్ గ్రిప్స్, స్టీరింగ్ డంపర్, అడాప్టివ్ రైడ్ హైట్ మరియు ట్యూబ్‌లెస్ స్పోక్డ్ వీల్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

ఈ బైక్ ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, ముందు వైపు 320 మిమీ ట్విన్ డిస్కులు మరియు వెనుక వైపు 280 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇందులో ముందు వైపు 19 ఇంచ్ అల్లాయ్ వీల్‌ను మరియు వెనుక వైపు 17 ఇంచ్ అల్లాయ్ వీల్‌ను ఉపయోగించారు. వీటిపై మిష్లిన్ స్కార్చర్ అడ్వెంచర్ రేడియల్ టైర్లను అమర్చారు.

ఇది తెలుసా.. పాన్ అమెరికా 1250 కి Harley-Davidson రీకాల్ ప్రకటించింది: ఎందుకంటే?

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన ద్విచక్ర వాహనాలలో Harley-Davidson ఒకటి. ఇవి అత్యంత ఖరీదైన బైకులు కావడం వల్ల చాలా తక్కువమంది మాత్రమే వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇవి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగానే ఎక్కువమంది వీటిని ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు.

Most Read Articles

English summary
Harley davidson pan america 1250 recall 2689 units reason details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X