హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

ప్రముఖ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇటీవల తన గ్రాజియా 125 స్కూటర్‌పై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఈ హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్‌ కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ వర్తిస్తుంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

కొనుగోలు దారులు ఇప్పుడు కొత్త హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను కొనుగోలు చేసినట్లయితే వారికి 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ లభిస్తుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆఫర్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇఎంఐ లావాదేవీలకు మాత్రమే చెల్లుతుంది, అంతే కాకుండా దీనితో పాటు కనీస లావాదేవీ విలువ రూ. 40,000 ఉండాలి అని హోండా తెలియజేసింది.

హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంచనుంది. ఈ హోండా గ్రాజియా 125 స్కూటర్‌లో అందించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ గురించి మరింత తెలుసుకోవడానికి మీకు సమీపంలో ఉన్న హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా డీలర్‌షిప్‌ను సందర్శించండి.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

కొత్త హోండా గ్రాజియా 125 స్పోర్ట్ ఎడిషన్ కొత్త బాడీ గ్రాఫిక్స్ తో రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గ్రాజియా 125 స్పోర్ట్ పెర్ల్ నైట్‌స్టార్ బ్లాక్ మరియు స్పోర్ట్స్ రెడ్ అనే కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

గ్రాజియా 125 స్పోర్ట్ ఎడిషన్ కొత్త కాస్మెటిక్ అప్‌డేట్ కాకుండా, మిగిలినవన్నీ దాదాపుగా దాని స్టాండర్డ్ మోడల్‌తో సమానంగా ఉంటుంది. ఈ స్కూటర్ అదే 125 సిసి హెచ్‌ఇటి (హోండా ఎకో టెక్నాలజీ) బిఎస్‌విఐ పిజిఎం-ఎఫ్‌ఐ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనికి పేటెంట్ కలిగిన ఎసిజి స్టార్టర్ మోటర్ ఉంది.

MOST READ:జూన్ 8 న భారత్‌లో అరంగేట్రం చేయనున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600

హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

ఈ హోండా గ్రాజియా 125 స్పోర్ట్ ఎడిషన్‌లో పాస్-స్విచ్, కొత్త ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, సీట్ కోసం మల్టీ-ఫంక్షనల్ స్విచ్ మరియు ఫ్యూయెల్ లిడ్ వంటివి కూడా కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ మంచి ఇంధన సామర్త్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

హోండా గ్రాజియా 125 స్పోర్ట్ ఎడిషన్‌లో 124 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి శక్తిని మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ వి- టైప్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

MOST READ:ఫస్ట్ టైమ్ కార్ డ్రైవ్ చేయడానికి సిద్దమైన కుమార్తెతో తండ్రి ఫన్నీ [వీడియో]

హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

కొత్త హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్‌లోని సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుకవైపు త్రీ వే అడ్జస్టబుల్ స్ప్రింగ్-లోడెడ్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇందులో మంచి బ్రేకింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 190 మిమీ డ్రమ్ బ్రేక్ మరియు వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంది.

Most Read Articles

English summary
Honda Grazia 125 Sports Edition Cashback Offer Announced. Read in Telugu.
Story first published: Friday, June 4, 2021, 12:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X