కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

ప్రముఖ ద్విచక్ర వాహనతయారీ దారు 'హోండా మోటార్‌సైకిల్ ఇండియా' మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన సంస్థగా పేరుగాంచింది. కంపెనీ ఇప్పటికే బ్రాండ్ నుంచి చాలా వాహనాలను ప్రవేశపెట్టింది. ఇందులో కూడా కంపెనీ యొక్క హోండా డియో స్కూటర్ చాలా ఎక్కువ అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తుంది.

కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

అయితే ఇటీవల కంపెనీ డియో స్కూటర్‌ పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే 2021 మే నెలలో డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా డియో స్కూటర్ కొనుగోలుపై కంపెనీ 5 శాతం క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అంటే ఇప్పుడు డియో స్కూటర్ కొనుగోలుపై 3,500 వరకు నగదు తగ్గింపు పొందవచ్చు.

కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

ఇది మాత్రమే కాకుండా SBI కార్డు కలిగి ఇఎంఐ చెల్లించే వినియోగదారులకు హోండా డియో కొనుగోలు కోసం ప్రత్యేక ఆఫర్ ఇవ్వబడుతుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ 2021 మే 1 నుండి జూన్ 30 వరకు అన్ని హోండా ద్విచక్ర వాహన డీలర్‌షిప్‌లకు వర్తిస్తుంది.

MOST READ:పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే

కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

కంపెనీ ఇటీవల కాలంలో కొత్త అవతార్ మరియు కొత్త ఫీచర్లతో హోండా డియో స్కూటర్‌ను ప్రవేశపెట్టారు. కొత్త డియో స్కూటర్ పై కంపెనీ 6 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. డియో స్కూటర్ స్టాండర్డ్ మరియు డీలక్స్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

హోండా డియో ఒక స్పోర్టి స్కూటర్, దీని రూపకల్పనలో ఎక్కువ లైన్స్ మరియు క్రీజులు కలిగి కలిగి ఉంటుంది. హోండా డియో బిఎస్ 6 స్కూటర్ లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లాంప్స్ ఉన్నాయి. కొత్త మోడల్ యొక్క డిజైన్ దాదాపుగా దాని బిఎస్ 4 మోడల్ లాగా స్పోర్టి మరియు దూకుడుగా ఉంటుంది.

MOST READ:ఆక్సిజెన్ ట్యాంకర్లను దొంగిలిస్తున్నారు.. జిపిఎస్ ట్రాకర్‌తో అక్రమాలకు చెక్..

కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

కొత్త హోండా డియో స్కూటర్ ఇప్పుడు ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇందులో ఉన్న డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ స్పీడ్, టైమ్, ఫ్యూయెల్ లెవెల్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ ఇండికేటర్ మరియు సర్వీస్ రిమైండర్ వంటి సమాచారాన్ని అందిస్తుంది.

కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

కొత్త హోండా డియో స్కూటర్ లో కొత్త ఇంజిన్ స్టార్ట్ మరియు స్టాప్ స్విచ్, దీనితోపాటు స్టోరేజ్ మరియు ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి సింగిల్ స్విచ్ ఉన్నాయి. స్కూటర్‌లో సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, తద్వారా స్టాండ్ తెరిచినప్పుడు ఇంజిన్ ఆటోమాటిక్ గా ఆఫ్ అవుతుంది.

MOST READ:గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?

కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

ఇప్పుడు కంపెనీ ఈ కొత్త డియో యొక్క వీల్ బేస్ కూడా మెరుగుపరిచింది. స్కూటర్ యొక్క బ్యాలెన్స్ మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉంది. డియో ఇప్పుడు స్ప్రింగ్ సస్పెన్షన్‌కు బదులుగా టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌తో భర్తీ చేయబడింది. ఇవన్నీ వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది మునుపటికంటే ఎక్కువ అప్డేట్ చేయబడి ఉంది.

కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

కొత్త హోండా డియో స్కూటర్ లో 110 సిసి బిఎస్ 6 ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్-ఇంజెక్షన్ ఇంజన్ ఉంది. ఇప్పుడు ఇంజిన్ పరిమాణం కూడా మార్చబడింది. ఈ ఇంజన్ 7.68 బిహెచ్‌పి పవర్, 8.79 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ మునుపటి కంటే మృదువైనది మరియు సమర్థవంతమైనదిగా ఉంటుంది.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

కొత్త హోండా డియో స్కూటర్‌పై సూపర్ డిస్కౌంట్ అఫర్.. పరిమిత కాలం మాత్రమే

దేశీయ మార్కెట్లో హోండా డియో స్కూటర్ కి మంచి డిమాండ్ ఉంది. కావున ఇది మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందు స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ వల్ల మరిన్ని ఎక్కువ అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Honda Dio May 2021 Discount Offers Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X