భారత్‌లో Honda Grazia125 యొక్క కొత్త Repsol Edition లాంచ్: ధర రూ. 86,714

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీదారు హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లో తన హోండా గ్రాజియా 125 యొక్క రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్‌ (Honda Grazia 125 Repsol Honda Team Edition) ను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్‌ను రూ. 86,714 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. ఈ కొత్త హోండా గ్రాజియా 125 రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ రెప్సోల్ ఆధునిక డిజైన్ పొందుతుంది. ఈ కొత్త స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో Honda Grazia125 యొక్క కొత్త Repsol Edition లాంచ్: ధర రూ. 86,714

కొత్త హోండా గ్రాజియా 125 రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ రేసింగ్ టీమ్-ఇన్స్పైర్డ్ గ్రాఫిక్స్ మరియు డిజైన్ థీమ్‌ను కలిగి ఉంది. ఈ ఎడిషన్ ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ యాక్సెంట్‌లు, హోండా MotoGP సిగ్నేచర్ కలర్‌తో వస్తుంది. ఇది దేశంలోని రేసింగ్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

భారత్‌లో Honda Grazia125 యొక్క కొత్త Repsol Edition లాంచ్: ధర రూ. 86,714

హోండా గ్రాజియా 125 రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ అండర్-బోన్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు వెనుకవైపు 3-టైప్స్ అడ్జస్టబుల్ సస్పెన్షన్‌ను పొందుతుంది. ఈ స్కూటర్ ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఆరంజ్ కలర్ అల్లాయ్ వీల్స్‌తో జత చేయబడి ఉంటుంది.

హోండా గ్రాజియా 125 రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో కంపెనీ ఫ్రంట్ వీల్‌లో 190 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్‌ను అందించింది. ఈ కొత్త స్కూటర్ లో LED DC హెడ్‌ల్యాంప్స్, LED పొజిషన్ ల్యాంప్స్ మరియు మైలేజ్ ఇండికేటర్‌ వంటి వాటిని పొందుతుంది.

భారత్‌లో Honda Grazia125 యొక్క కొత్త Repsol Edition లాంచ్: ధర రూ. 86,714

అంతే కాకుండా ఇది ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, మల్టీ-ఫంక్షన్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ పాసింగ్ స్విచ్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ లిడ్ మరియు ఇంజన్ కట్-ఆఫ్‌తో కూడిన సైడ్-స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఇవ్వబడ్డాయి. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను స్టాండర్డ్ హోండా గ్రాజియా 125 మాదిరిగానే ఉంచింది.

భారత్‌లో Honda Grazia125 యొక్క కొత్త Repsol Edition లాంచ్: ధర రూ. 86,714

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన టాప్ సెల్లింగ్ స్కూటర్ హోండా యాక్టివా 6G మరియు హోండా డియో యొక్క కొత్త వేరియంట్‌లను కూడా విడుదల చేయడానికి సన్నద్దమౌతోంది. ఇంతకు ముందు ఢిల్లీ ఆర్‌టీఓకి సమర్పించిన అప్రూవల్ సర్టిఫికెట్‌లో ఈ విషయం వెల్లడైంది.

భారత్‌లో Honda Grazia125 యొక్క కొత్త Repsol Edition లాంచ్: ధర రూ. 86,714

ఈ స్కూటర్లను ఎప్పుడు లాంచ్ చేస్తారు మరియు వాటిలో ఏ ఫీచర్లను అప్‌డేట్ చేస్తారు అనే దాని గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. కానీ RTOకి దాఖలు చేసిన అప్రూవల్ సర్టిఫికేట్ హోండా యాక్టివా 6G మరియు హోండా డియో యొక్క కొత్త వేరియంట్‌ల గురించి కొంత సమాచారాన్ని వెల్లడించింది.

హోండా గ్రాజియా 125 రెప్సోల్ హోండా టీమ్ ఎడిషన్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఈ కొత్త స్కూటర్ 123.97 సిసి, ఫ్యాన్-కూల్డ్, 4-స్ట్రోక్, PGM-FI ఇంజన్‌ని కలిగి ఉంటుంది. 8.14 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా, ఈ స్కూటర్‌లో ఐడిల్ స్టాప్ సిస్టమ్ ఉపయోగించబడింది. ఇది స్కూటర్ ఎక్కడైనా కొద్దిసేపు ఆగినప్పుడు, అది ఇంజిన్‌ను ఆపివేస్తుంది. ఈ స్కూటర్‌లో సైలెంట్ ఇంజిన్ స్టార్ట్ కోసం కంపెనీ ACG స్టార్టర్‌ను కూడా ఉపయోగించింది.

భారత్‌లో Honda Grazia125 యొక్క కొత్త Repsol Edition లాంచ్: ధర రూ. 86,714

హోండా మోటార్ సైకిల్ ఇటీవల గత నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గడిచిన 2021 సెప్టెంబర్ నెలలో మొత్తం 4,82,756 యూనిట్లు బైకులు మరియు స్కూటర్లను విక్రయించినట్లు తెలిపింది. కంపెనీ గత సంవత్సరం ఇదే నెలలో 5,26,866 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంటే మునుపటి కంటే కూడా ఈ సంవత్సరం అమ్మకాలు 08 శాతం తక్కువ.

భారత్‌లో Honda Grazia125 యొక్క కొత్త Repsol Edition లాంచ్: ధర రూ. 86,714

కంపెనీ దేశీయ మార్కెట్లో 4,63,679 యూనిట్లను విక్రయించగా, 19,077 యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలిపింది. 2020 సెప్టెంబర్ నెలతో పోలిస్తే, 2021 సెప్టెంబర్ నెలలో హోండా మోటార్ సైకిల్ అమ్మకాలు 37,000 తక్కువ. ఇదే సమయంలో 2020 ఆగస్టు నెలతో పోల్చితే 62,210 యూనిట్ల వాహనాలను విక్రయించి 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే ఎగుమతులు మాత్రం కొంత మందగించినట్లు తెలుస్తుంది.

భారత్‌లో Honda Grazia125 యొక్క కొత్త Repsol Edition లాంచ్: ధర రూ. 86,714

కంపెనీ సెప్టెంబర్ 2021 లో కేవలం 19,077 యూనిట్ల వాహనాలను మాత్రమే ఎగుమతి చేయగలిగింది. అదే 2020 సెప్టెంబర్ నెలలో 25,978 యూనిట్లను ఎగుమతి చేసింది. కానీ ఈ నెలలో మాత్రం కొంత వరకు తగ్గుముఖం పట్టాయని స్పష్టం అవుతుంది.

Most Read Articles

English summary
Honda grazia 125 repsol honda team edition launched price features details
Story first published: Monday, November 15, 2021, 18:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X