దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) లిమిటెడ్ '2021 ఇండియా బైక్ వీక్'లో ఎట్టకేలకు హైనెస్ CB350 యొక్క 'యానివర్సరీ ఎడిషన్' విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' ధర రూ. 2.03 లక్షలు (ఎక్స్-షోరూమ్). హోండా హైనెస్ CB350 బైక్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కారణంగా కంపెనీ ఈ యానివర్సరీ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

హోండా హైనెస్ CB350 బైక్ భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటికి 35,000 యూనిట్లను విక్రయించింది. అయితే కంపెనీ ఇప్పుడు విడుదల చేసిన ఈ కొత్త యానివర్సరీ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు ఈ బైక్ కోసం హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

కొత్త హోండా హైనెస్ CB 350 యానివర్సరీ ఎడిషన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఇగ్నియస్ బ్లాక్ మరియు మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్ కలర్స్. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ మరియు సైడ్ ప్యానెల్‌లపై గోల్డ్ కలర్ లో హోండా మరియు హైనెస్ అనే చిహ్నాలు చూడవచ్చు. ఇవి బైక్ కి మంచి దూకుడు రూపాన్ని అందిస్తాయి.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

ఈ బైక్ బ్రౌన్ స్ప్లిట్ సీటు, క్రోమ్ సైడ్ స్టాండ్ మరియు ఫ్యూయెల్ ట్యాంక్‌పై యానివర్సరీ ఎడిషన్ లోగోను పొందుతుంది. అయితే ఈ కొత్త బైక్ లో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయలేదు. దీనిని గమనించాలి. మొత్తానికి ఇది ఆకర్షణీయంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

సాధారణంగా కంపెనీ యొక్క హోండా హైనెస్ సిబి350 బైక్ రూ. 1,92,411 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ DLX మరియు DLX ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా హైనెస్ అనేక కొత్త మరియు ఆకర్షణీయమైన లక్షణాలతో కంపెనీ ప్రారంభించింది, దీని కారణంగా ఇది 350 సిసి శ్రేణిలోని ఇతర బైకుల నుండి చాలా భిన్నంగా అప్డేట్ చేయబడింది.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

హోండా హైనెస్ సిబి350 బైక్ యొక్క స్టాండర్డ్ వేరియంట్లలో డ్యూయల్ టోన్ బాడీ పెయింట్, డ్యూయల్ క్రోమ్ ఫినిష్ హార్న్, స్ప్లిట్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, క్రోమ్ ఫినిష్ ఫ్రంట్ అండ్ రియర్ మడ్‌గార్డ్స్, క్రోమ్ ఫినిష్ సైలెన్సర్ ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులో ఉంది, దీని సహాయంతో బైక్‌ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. బైక్‌లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. మ్యూజిక్ ప్లేబ్యాక్, ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్‌లు మరియు నావిగేషన్ వంటి ఫీచర్‌లను ఈ ఫీచర్‌తో పొందవచ్చు. ఇది ఫీచర్స్ పరంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ ఫీచర్స్ అన్ని కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

హోండా హైనెస్ సిబి350 బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఫ్రంట్ వీల్‌లో హబ్‌కు బదులుగా రిమ్‌పై డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. హోండా హైనెస్ సిబి 350 లో 348.36 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ 20.8 బిహెచ్‌పి పవర్ మరియు 30 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది, అంతే కాకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా ఈ బైక్ చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

ఎట్టకేలకు కొత్త హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. అయితే ఇది దేశీయ మార్కెట్లో ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది మరియు ఎలాంటి ఆదరణ పొందుతుంది, కంపెనీ యొక్క స్టాండర్డ్ హైనెస్ సిబి350 లాంటి అమ్మకాలను పొందుతుందా.. లేదా.. అనే మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా ఇటీవల హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) 2021 నవంబర్ అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ మొత్తం 2,80,381 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగలిగింది. ఇందులో 2,56,170 యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించగా, 24,211 యూనిట్లు ఎగుమతులు చేయబడ్డాయి.

దేశీయ మార్కెట్లో 'హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్' విడుదల: ధర & వివరాలు

2021 నవంబర్ అమ్మకాలు 2020 నవంబర్ అమ్మకాలతో పోలిస్తే ఎగుమతుల్లో 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ దేశీయ అమ్మకాలలో మాత్రమే 38% తగ్గుదలను నమోదు చేసింది. 2020 నవంబర్ లో కంపెనీ అమమకాలు 4,12,641 యూనిట్లు. అయితే 2021 నవంబర్ నెలలో అమ్మకాలు చాలా తగ్గాయి.

అయితే 2020 నవంబర్ నెల ఎగుమతుల్లో పోలిస్తే ఇప్పుడు కంపెనీ 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ దేశీయ మార్కెట్లో మాత్రం అమ్మకాలు చాలా తగ్గాయి. అయితే కంపెనీ ఇప్పుడు కొత్త హోండా హైనెస్ CB350 యానివర్సరీ ఎడిషన్ విడుదల చేయడంతో ఈ నెల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Honda highness cb 350 anniversary edition launched in india price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X