హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా వృద్ధి చెందుతోంది. ఈ ట్రెండ్ చూస్తుంటే, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలే రోడ్లను శాసిస్తాయని తెలుస్తోంది. ప్రత్యేకించి, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఈ వృద్ధి రేటు చాలా వేగంగా ఉంది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని బజాజ్ ఆటో (చేతక్ ఈవీ) మరియు టీవీఎస్ మోటార్ కంపెనీ (ఐక్యూబ్) వంటి సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

కాగా, ఇప్పుడు జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా కూడా భారతదేశంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భారతదేశపు ద్వితీయ అగ్రగామి టూవీలర్ బ్రాండ్ అయిన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) మరో రెండేళ్లలో తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

ఈ విషయాన్ని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా (Atsushi Ogata) ధృవీకరించారు. అయితే, హోండా యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎలాంటి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2022-23 నాటికి విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

హోండా 2-వీలర్స్ ప్రస్తుతం, ప్రస్తుతం భారత మార్కెట్లో బెన్లీ అనే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ని పరీక్షిస్తోంది. అయితే, ఈ హోండా బ్రాండ్ కింద భారతదేశంలో విడుదల కాబోయే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ బెన్లీ అని ఖచ్చితంగా చెప్పలేము. హోండా గడచిన 2019 టోక్యో మోటార్ షోలో బెన్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రదర్శించింది. ఈ ఈవెంట్‌ లో బెన్లీ స్కూటర్ ను వాణిజ్యపరమైన ఉపయోగం కోసం ఉపయోగించబడే ఎలక్ట్రిక్ స్కూటర్‌ గా ప్రదర్శించారు.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

కాబట్టి, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వాణిజ్యపరమైన ఉపయోగం కోసం భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తుందని మేము భావించడం లేదు. జపాన్‌కు చెందిన హోండా 2-వీలర్స్ 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వీటిలో భారత్ కు రాబోయే మోడల్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

అయితే, హోండా బ్రాండ్ భారతీయ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ని విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ దీనిని పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసే అవకాశం ఉంది. భారతదేశంలో తయారైన హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కంపెనీ ఇతర విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయవచ్చు.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

హోండా సంస్థకు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం కొత్తేమీ కాదు. హోండా ఇప్పటికే కొన్ని విదేశీ మార్కెట్లలో వాణిజ్య మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి విక్రయిస్తోంది. హోండా మొబైల్ ఎనర్జీ ప్యాకేజీ (MPP) ను భారతదేశంలో విడుదల చేయబోయే మొదటి హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

హోండా MPP అనేది పర్యావరణ అనుకూల సాంకేతిక ఆవిష్కరణ. ఇది సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుండి విద్యుత్ శక్తిని అందిస్తుంది. భవిష్యత్తులో అవసరమైతే ఈ మొబైల్ పవర్ ప్యాకేజీని ఇ-రిక్షాలలో కూడా ఉపయోగించవచ్చని హోండా 2-వీలర్స్ పేర్కొంది. భారత మార్కెట్లో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కోసం కంపెనీ ఇప్పటికే కొన్ని వివిధ దేశీయ డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

అట్సుషి ఒగాటా తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలో స్థానికంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికల కారణంగా, భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రాక ఆలస్యం అవుతోంది. ఒకవేళ, వారు కేవలం భారత మార్కెట్ కోసం మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను తయారు చేయాలనుకుంటే, ఈ కంపెనీ నుండి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను 2021 నాటికి విడుదల చేయవచ్చని ఆయన చెప్పారు.

గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

Honda Forza 300 మాక్సి-స్కూటర్ వస్తోంది..

హోండా టూవీలర్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, భారతదేశంలో మాక్సి స్టైల్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, దేశీయ విపణిలో తమ పెద్ద స్కూటర్ అయిన హోండా ఫోర్జా 300 (Honda Forza 300) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

హోండా నుండి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే..

హోండా గత ఏడాది ఫిబ్రవరిలో ఫోర్జా 300 మ్యాక్సి స్కూటర్‌ ను భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కానీ, కోవిడ్-19 కారణంగా ఇది ఆలస్యమైంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, హోండా తమ కొత్త 2021 ఫోర్జా 350 మాక్సి స్కూటర్ ని ఇక్కడి మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఇందులో హోండా వాయిస్ కంట్రోల్ సిస్టమ్ మరియు స్విచ్ గేర్ వంటి కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Honda plans to launch their first electric scooter in india by 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X