హస్క్వర్నా స్వార్ట్‌పిలెన్ 125 ఆవిష్కరణ; భారత్‌లోనూ విడుదలయ్యే ఛాన్స్!
స్వీడన్‌కి చెందిన హస్క్వార్నా మోటార్‌సైకిల్ కంపెనీ తమ స్వార్ట్‌పిలెన్ మోటార్‌సైకిల్‌లో రేంజ్‌లో ఓ సరికొత్త 125సీసీ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 125 ముందుగా యూరప్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత ఇది భారత మార్కెట్లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది.

యూరప్ మార్కెట్లలో 125సీసీ మోటార్‌సైకిళ్ల పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసింది. కెటిఎమ్ అనుబంధ సంస్థ అయిన హస్క్వార్నా, తమ కొత్త 125సీసీ మోటార్‌సైకిల్‌ను డ్యూక్ 125 మోడల్ ఆధారంగా తయారు చేసింది.

భారత టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో కెటిఎమ్ బ్రాండ్ మరియు హస్క్వార్నా బ్రాండ్‌ల కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. ఈ కొత్త హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 125 మోటార్‌సైకిల్‌ను బజాజ్ ఆటోకి చెందిన చాకన్ ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

భారత్‌లో తయారైన ఈ బైక్ యూరప్‌తో సహా వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి కానుంది. భారతదేశంలో హుస్క్వర్నా ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణను పరిశీలిస్తే, ఈ కొత్త స్వార్ట్‌పిలెన్ 125 కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

హస్క్వార్నా స్వార్ట్‌పిలెన్ 125 డిజైన్ పరంగా చూడటానికి స్వార్ట్‌పిలెన్ 250 మోడల్ మాదిరిగానే ఉంటుంది. స్వార్ట్‌పిలెన్ 250 మోడల్ ఇప్పటికే భారత మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ మోటార్‌సైకిల్‌లో ఎత్తైన హ్యాండిల్ బార్, నాబ్స్‌తో కూడిన టైర్లు మరియు సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంటాయి.

ఇంకా ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్ సెటప్, విలక్షణమైన ఫ్యూయెల్ ట్యాంక్ విభాగం, పొట్టిగా ఉండే వెనుక డిజైన్ మరియు ఫెండర్లు, అలాగే స్వింగార్మ్‌కి మౌంట్ చేయబడి ఉన్న టైర్ హగ్గర్ (రియర్ మడ్ ఫ్లాప్), ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్, గుండ్రటి ఎల్‌సిడి కన్సోల్ మరియు బాష్ నుండి గ్రహించిన ఏబిఎస్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

స్వార్ట్‌పిలెన్ 250 అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. అయితే, ఈ కొత్త స్వార్ట్‌పిలెన్ 125 మోడల్ మాత్రం స్పోక్ వీల్స్‌తో లభిస్తుంది. ఈ బైక్‌పై సస్పెన్షన్‌ను గమనిస్తే, ముందు వైపు 43 మిమీ ట్రావెల్‌తో కూడిన డబ్ల్యూపి అపెక్స్ ఫోర్కులు మరియు వెనుకవైపు 142 మిమీ ట్రావెల్‌తో కూడిన ప్రీలోడ్-అడ్జస్టబల్ డబ్ల్యూపి అపెక్స్ మోనో షాక్ అబ్జార్వర్ ఉన్నాయి.

ఇంజన్ విషయానికి వస్తే, కెటిఎమ్ 125 డ్యూక్ మోడల్‌లో ఉపయోగించిన అదే 125సీసీ ఇంజన్‌ను ఈ స్వార్ట్‌పిలెన్ 125 మోడల్‌లోనూ ఉపయోగించారు. ఇందులోని 125 సిసి, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 14.3 బిహెచ్‌పి పవర్‌ను, 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 12 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

హస్క్వార్నా 125 మోడల్ కెటిఎమ్ డ్యూక్ 125 మోడల్ ఆధారంగా తయారవుతున్న నేపథ్యంలో, ఇది ఈ ఏడాదే భారత మార్కెట్లో కూడా విడదలయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్లో హస్క్వార్నా మోటార్‌సైకిళ్ల ధరలు కెటిఎమ్ మోడళ్ల ధరల కన్నా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఈ కొత్త 125సీసీ బైక్ ధర రూ.1.25 లక్షల నుండి రూ.1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








