హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

స్వీడన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ హస్క్వార్నా గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న పాపులర్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'విట్‌పిలెన్ 701'లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను ఆవిష్కరించింది. స్టాండర్డ్ హస్క్వార్నా విట్‌పిలెన్ 701తో పోలిస్తే, ఈ లిమిటెడ్ ఎడిషన్ విట్‌పిలెన్ 701లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

హస్క్వార్నా మోటార్‌సైకిల్ బ్రాండ్ గడచిన 2020 నుండి ఇటాలియన్ దుస్తుల బ్రాండ్ రీప్లే (REPLAY)తో ఓ అధికారిక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంలో భాగంగా, హస్క్వార్నా బ్రాండ్ కోసం రీప్లే బ్రాండ్ అధికారిక దుస్తులు, రైడింగ్ గేర్ మరియు యాక్ససరీలను తయారు చేస్తుంటుంది.

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

తాజాగా, ఇప్పుడు ఈ రెండు బ్రాండ్లు కలిసి స్పెషల్ ఎడిషన్ హస్క్వార్నా విట్‌పిలెన్ 701 మోటార్‌సైకిళ్లను రూపొందించాయి. ఇందులో హస్క్వార్నా లిమిటెడ్ ఎడిషన్ 701 సూపర్‌మోటో మరియు 701 ఎండ్యూరో ఎల్ఆర్ మోడళ్లు ఉన్నాయి.

MOST READ:బెంగళూరులో కరోనా ఎఫెక్ట్; లాక్‌డౌన్‌లో పట్టుబడ్డ వారికి డిఫరెంట్ పనిష్మెంట్

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

ఈ రెండు స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో, ప్రతి మోడల్ కూడా ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడుతుందని కంపెనీ తెలిపింది. అందుకే, ఇవి చాలా అరుదైన మోటార్‌సైకిళ్లుగా ఉంటాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్లపై ఇరు బ్రాండ్ల లోగోలతో కూడిన ప్రత్యేకమైన డిజైన్ ఉంటుంది.

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

మోటో 3 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో హస్క్వార్నా పోటీ పడిన నేపథ్యంలో, మోటో 3 హస్క్వార్నా మోటార్‌సైకిళ్లపై కూడా రీప్లే బ్రాండ్ లోగోను ఉపయోగించారు. ఫ్యూయెల్ ట్యాంక్, సీట్ కవర్స్, ఇంజన్ కౌల్స్ మరియు మోటార్‌సైకిల్‌లోని కొన్ని ఇతర భాగాలను ఇరు బ్రాండ్ల లోగోలతో ప్రత్యేకమైన రంగులలో కస్టమైజ్ చేశారు.

MOST READ:మీరెప్పుడూ చూడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీడియో.. ఇప్పుడు చూసెయ్యండి

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

స్టాండర్డ్ విట్‌పిలెన్ 701 మోటార్‌సైకిళ్లతో పోల్చితే, ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ విట్‌పిలెన్ 701 మోటార్‌సైకిళ్లు గంపులో ఉన్నా సులువుగా గుర్తు పట్టేలా ఉంటాయి. ఈ సరికొత్త మిడిల్‌వెయిట్-ఎడిషన్ మోడళ్లు కొత్త రంగులు మరియు ప్రత్యేక ఉపకరణాలతో లభిస్తాయి. ఈ విట్‌పిలెన్ 701 బైక్‌లు భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న విట్‌పిలెన్ 250 బైక్‌ల కంటే పెద్దవిగా ఉంటాయి.

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 మోటార్‌సైకిళ్లలో 692.7 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పి పవర్‌ను మరియు 72 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

ఇది రైడ్-బై-వైర్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లను కలిగి ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ హస్క్వార్నా విట్‌పిలెన్ 701 మోటార్‌సైకిళ్లలో అపెక్స్ సస్పెన్షన్ ప్యాకేజీ మరియు ప్రీమో బ్రేక్‌లను ఉపయోగించారు.

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

హస్క్వార్నా 701 సూపర్‌మోటో మరియు ఎండ్యూరో ఎల్‌ఆర్ బైక్‌లు విట్‌పిలెన్ 701 బైక్ యొక్క సాంప్రదాయ ఇంజన్ ప్లాట్‌ఫాంపై ఆధారంగా చేసుకొని రూపొందించారు. వీటిలో విట్‌పిలెన్ 701 సూపర్‌మోటో బైక్‌ను సాధారణ రోడ్లు మరియు రేసింగ్ ట్రాక్‌లు రెండింటిపై ఉపయోగించవచ్చు.

MOST READ:కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

కాగా, హస్క్వార్నా విట్‌పిలెన్ 701 ఎండ్యూరో ఎల్ఆర్ మాత్రం ప్రత్యేకించి ఆఫ్-రోడింగ్ ట్రాక్స్ కోసం రూపొందించబడినది. అన్ని రకాల ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ఈ మోటార్‌సైకిల్ అటు పూర్తి అడ్వెంచర్ ఆఫ్-రోడింగ్‌కు మరియు ఇటు రెగ్యులర్ సిటీ కమ్యూటింగ్‌కు కూడా అనుకూలంగా ఉండేలా తయారు చేశారు.

హస్క్వార్నా విట్‌పిలెన్ 701 లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ - వివరాలు

ప్రపంచవ్యాప్తంగా ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిళ్ళు కొన్ని అంతర్జాతీయ మార్కెట్లకు మాత్రమే పరిమితం చేశారు. మరి, ఒకవేళ భారతదేశంలో ఎవరైనా ఆసక్తిగల కస్టమర్లు దీనిని కొనుగోలు చేయాలనుకుంటే, కంపెనీ వారికి సహకరిస్తుందో లేదో చూడాలి.

Most Read Articles

English summary
Husqvarna Unveils Limited Edition Vitpilen 701 In Association With Replay. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X