జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

దశాబ్ధాల విరామం తర్వాత భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ 'జావా మోటార్‌సైకిల్స్', ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని జావా మోటార్‌సైకిల్స్ సీఈఓ ఆశిష్ సింగ్ జోషి ధృవీకరించారు.

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. జావా మోటార్‌సైకిల్స్ ఇప్పటికే ఓ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై పని చేస్తోంది. యూకేలోని కోవెంట్రీలో తాము ఓ కొత్త డెవలప్‌మెంట్ సెంటర్‌ను కలిగి ఉన్నట్లు ఆశిష్ తెలిపారు.

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

ఈ డెవలప్‌మెంట్ సెంటర్‌ బిఎస్ఏ బ్రాండ్ కోసం పనిచేస్తోందని, ఇది 12-15 మంది ఉద్యోగుల బృందాన్ని కలిగి ఉందని ఆయన చెప్పారు. ఈ-బైక్‌లో ఉపయోగించే ఎలక్ట్రిక్ టెక్నాలజీని ప్రస్తుతం ఈ ఆర్ అండ్ డి సెంటర్‌లో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

నివేదికల ప్రకారం, జావా మోటార్‌సైకిల్స్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను 2022 మధ్య నాటికి మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ రెట్రో-మోడ్రన్ బ్రాండ్ నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఉత్పత్తిని కంపెనీ భారతదేశంలోనే చేసే అవకాశం ఉంది.

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

భారత మార్కెట్లో జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధరను అందుబాటులో ఉంచేందుకు గానూ, కంపెనీ దీని ఉత్పత్తిలో ఎక్కువ భాగం లోకలైజేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని డిజైన్‌ను కూడా కంపెనీ తమ ఐకానిక్ రెట్రో స్టైల్‌లోనే ఉంచే అవకాశం ఉంది. కాకపోతే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా ఇందులో అనేక ఆధునిక ఫీచర్లను జోడించనున్నారు.

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవీ మరియు స్టాండర్డ్ నెక్సాన్ కార్ల మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు, ఎలక్ట్రిక్ వెర్షన్ నెక్సాన్‌లో కంపెనీ బ్లూ కలర్ యాక్సెంట్‌లను జోడించినట్లుగా, జావా కూడా తమ పెట్రోల్ పవర్డ్ మరియు ఎలక్ట్రిక్ పవర్డ్ మోటార్‌సైకిళ్ల మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు ఈ తరహా స్ట్రాటజీనే పాటించే అవకాశం ఉంది.

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో పూర్తి ఎల్ఈడి లైటింగ్, పెట్రోల్ ఇంజన్ స్థానంలో భారీ బ్యాటరీ ప్యాక్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇంధన ట్యాంక్‌లో స్టోరేజ్ స్పేస్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇంకా తెలియదు, కానీ పూర్తి ఛార్జ్‌పై ఇది సుమారు 200 నుండి 250 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని సమాచారం.

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

ఇక జావా టూవీలర్ బ్రాండ్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ బ్రాండ్ భారత మార్కెట్లో మూడు మోటార్‌సైకిళ్లను అందిస్తోంది. వీటిలో మొదటిది జావా స్టాండర్డ్, ఇది కంపెనీ నుండి అత్యంత సరసమైన మోటార్‌సైకిల్, ఇది పూర్తిగా రెట్రో డిజైన్‌ను కలిగి ఉంటుంది.

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

ఇకపోతే, రెండవ మోడల్ జావా 42. దీనిని జావా స్టాండర్డ్ వేరియంట్‌పై ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు, కాకపోతే, ఇది స్టాండర్డ్ జావా కన్నా మరింత ఆధునికంగా కనిపిస్తుంది. జావా స్టాండర్డ్ మరియు 42 మోడళ్లలో 293సిసి, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

జావా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వస్తోంది, డిజైన్ ఎలా ఉంటుందో?

ఇక చివరగా, జావా మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోలో లభిస్తున్న మూడవ మోడల్ జావా పెరాక్. ఇదొక బాబర్ స్టైల్ బైక్, అంతేకాదు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏకైక మరియు సరసమైన బాబర్ స్టైల్ బైక్ కూడా ఇదే. జావా పెరాక్ బైక్‌లో 334 సిసి లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

Source: ZigWheels

Most Read Articles

English summary
Jawa Electric Motorcycle Plans Revealed; Features, Expected Range-And Other Details. Read in Telugu.
Story first published: Saturday, July 31, 2021, 12:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X