భారత్‌లో అత్యంత సరసమైన Komaki ఎలక్ట్రిక్ స్కూటర్; XGT-X1

భారతమార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసాయి. మరికొన్ని కంపెనీలు కొత్తవాహనాలను విడుదలచేసేపనిలో నిమగ్నమయ్యాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సంస్థ Komaki Electric (కోమకి ఎలక్ట్రిక్) కూడా దేశీయ మార్కెట్లో కొత్త Komaki XGT-X1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టింది.

భారత్‌లో అత్యంత సరసమైన Komaki ఎలక్ట్రిక్ స్కూటర్; XGT-X1

Komaki XGT-X1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని కంపెనీ 2020 జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ నివేదించింది. Komaki XGT-X1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఆప్సన్స్ తో విడుదలైంది. అవి ఒకటి జెల్ బ్యాటరీ కలిగి ఉన్న Komaki XGT-X1, మరొకటి లిథియం అయాన్ బ్యాటరీ ఉన్న Komaki XGT-X1. వీటి ధరలు వరుసగా (Komaki XGT-X1 జెల్ బ్యాటరీ) రూ. 45,000 కంటే తక్కువ, (లిథియం అయాన్ బ్యాటరీ Komaki XGT-X1) రూ. 60,000.

భారత్‌లో అత్యంత సరసమైన Komaki ఎలక్ట్రిక్ స్కూటర్; XGT-X1

Komaki ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లో దాదాపు 25,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉండటంతో పాటు, అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున మార్కెట్లో ఇది మంచి ఆదరణ పొందుతోంది.

భారత్‌లో అత్యంత సరసమైన Komaki ఎలక్ట్రిక్ స్కూటర్; XGT-X1

Komaki XGT-X1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జితో ఎకో మోడ్‌లో 120 కిమీ వరకు పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు సైజ్-అప్ బిస్ వీల్స్ ఉపయోగించబడ్డాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో అత్యంత సరసమైన Komaki ఎలక్ట్రిక్ స్కూటర్; XGT-X1

Komaki ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పెద్ద సీటు అమర్చబడింది. కావున వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా దీనికి వెనుక ఒక ట్రంక్ కూడా ఇవ్వబడింది. ఇది ఎక్కువ స్టోరేజ్ సామర్త్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డాష్ డిస్‌ప్లేను పొందుతుంది, ఇది సెల్ఫ్ డయాగ్నోసిస్ మరియు వైర్‌లెస్ అప్‌డేబుల్ ఫీచర్‌ల కోసం మల్టీ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

భారత్‌లో అత్యంత సరసమైన Komaki ఎలక్ట్రిక్ స్కూటర్; XGT-X1

Komaki కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై అద్భుతమైన వారంటీ కూడా అందిస్తుంది. కంపెనీ దాని లిథియం అయాన్ బ్యాటరీపై 2+1 సంవత్సరం (1 సంవత్సరం సర్వీస్ వారంటీ) వారెంటీ మరియు లీడ్ యాసిడ్ బ్యాటరీకి 1 సంవత్సరం అందిస్తుంది.

భారత్‌లో అత్యంత సరసమైన Komaki ఎలక్ట్రిక్ స్కూటర్; XGT-X1

Komaki ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా దీని గురించి మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలుదారులను ఆకర్షించడంలో విజయం సాధిస్తాయని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు అధికంగా ఉండటంతో పాటు, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా భారీ ధరను కలిగి ఉండటం వల్ల Komaki యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుందని అన్నారు.

అంతే కాకుండా Komaki ఎలక్ట్రిక్ స్కూటర్లు వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణ వాహనాలు వాతావరణనాన్ని ఎక్కువ కలుషితం చేస్తున్నాయి. కావున ఇప్పుడు దేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని సూచిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్లకు ఇప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి సహకరిస్తాయి.

భారత్‌లో అత్యంత సరసమైన Komaki ఎలక్ట్రిక్ స్కూటర్; XGT-X1

Komaki యొక్క ఎలక్ట్రిక్ ఇటీవల వృద్ధులు మరియు వికలాంగ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కోమకి XGT X5 ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు ట్రిమ్‌లలో అందించబడుతుంది. అవి XGT-X5- (72V24AH) మరియు XGT-X5 GEL. ఈతి ధరలు వరుసగా రూ .90,500 మరియు రూ. 72,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇవి కూడా వినియోగాదారులకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించబడ్డాయి. రానున్న కాలంలో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత డిమాండ్ పెరుగుతుంది. కావున Komaki కూడా మరింత ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాము.

భారత్‌లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్; Komaki XGT-X1

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది, అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన కనీస మెలిక సదుపాయాలు కావలసినన్ని అందుబాటులో లేదు. ఈ కారణంగా ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా తగిన ప్రయత్నాలు చేస్తుంది. దీనితో పాటు అనేక సంస్థలు కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇటువంటి కంపెనీలకు ప్రభుత్వం కూడా తమ వంతు ప్రోత్సహిస్తోంది.

Most Read Articles

English summary
Komaki xgt x1 e scooter most affordable electric scooter in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X