త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

కుర్రకారుని ఎంతగానో ఆకట్టుకుని, ఉర్రూతల్లోగించే బైక్ బ్రాండ్లలో ఒకటి KTM (కెటిఎమ్). నిజంగానే KTM బైకులకు ఎనలేని ఆదరణ ఉంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ రోజుకి కూడా యువ రైడర్లు ఎక్కువగా ఇష్టపడే బైకులలో KTM ముందు వరుసలో ఉంది. ఇంతటి ప్రజాదరణను పొందిన స్వీడిష్ బ్రాండ్ అయిన KTM భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేసి 10 వసంతాలు పూర్తి కావొస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్లను అందించడానికి ఒక అడుగు ముందుకు వేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

KTM (కెటిఎమ్) కంపెనీ 2012 వ సంవత్సరంలో తన ప్రయాణాన్ని భారతదేశంలో ప్రారంభించింది. ఆ సమయంలో KTM కంపెనీ రెండు మోడల్స్ ప్రారంభించింది. రెండు మోడళ్లతో ప్రయాణాన్ని ప్రారంభిచిన KTM బ్రాండ్ ఈ రోజుకి 11 మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ప్రస్తుతం KTM కంపెనీ 125 సిసి కెపాసిటీ కలిగిన బైకుల నుంచి 790 సిసి సామర్థ్యం కలిగిన మోడళ్ల వరకు బైకులను విక్రయిస్తోంది.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

అయితే ఇప్పుడు KTM కంపెనీ భారత మార్కెట్లో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా, కొత్త బైక్ బుకింగ్ మీద ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు కొత్త కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి, అంతే కాకుండా ఈ ఆఫర్లు మరింత ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

ప్రపంచ వ్యాప్తంగా KTM కంపెనీ ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ బైకులను ఎక్కువగా యువకులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. KTM బైకులు మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా చాలా స్టైలిష్ గా ఉండటం వల్ల ఎక్కువమందిని ఆకర్షించడంలో విజయం సాధిస్తోంది.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

ఇందులో ఉన్న ఫీచర్స్ మరియు పరికరాలు వాహనదారులకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇవ్వగలుగుతోంది. ఇవి మంచి పర్ఫామెన్స్ కూడా అందించడంలో వీటికి ఇవే సాటి. ఈ కారణాల వల్ల ఎక్కువమంది ద్రుష్టి ఈ బైకులపై పడింది.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

KTM కంపెనీ భారతదేశంలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్న తర్వాత మరో స్వీడిష్ కంపెనీ బైకులను కూడా ప్రవేశపెట్టింది. భారతదేశంలో అడుగుపెట్టిన మరో స్వీడిష్ బ్రాండ్ Husqvarna (హస్క్‌వర్నా). Husqvarna బ్రాండ్ కింద రెండు బైకులు అందుబాటులో ఉన్నాయి. అవి ఒకటి Husqvarna Vitpilen 250 కాగా మరొకటి Husqvarna Swartpilen 250.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) Sumeet Narang (సుమీత్ నారంగ్) ఈ సందర్భంగా మాట్లాడుతూ, KTM త్వరలో భారతదేశంలో విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. కంపెనీ ఈ కాలంలో ఎంతో ప్రతిష్టాత్మక పర్ఫామెన్స్ బైకులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా దాదాపు 500 షోరూమ్‌లు మరియు వర్క్‌షాప్‌లతో నెట్‌వర్క్‌ను విస్తరించడం జరిగింది.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

భారతదేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉత్సాహంతో మమ్మల్ని ఇంకా ఉత్సహంతో ముందుకు పయనించేలా చేస్తుంది.ఈ సమయంలోనే KTM కంపెనీ అన్ని కొత్త KTM మరియు Husqvarna బైక్‌ల బుకింగ్‌పై ఆఫర్లను అందిస్తోంది. 18 ఆగష్టు నుండి బుక్ చేయబడిన అన్ని KTM మరియు Husqvarna బైక్‌లపై 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో పాటు 3 సంవత్సరాల ఎక్స్టెన్షన్ వారంటీని కూడా అందిస్తోంది.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

KTM కంపెనీ ఈ ఆఫర్లతో పాటు 1 సంవత్సరం రోడ్ సైడ్ అసిస్టెన్స్ సౌకర్యం కూడా అందిస్తుంది. అంతే కాకుండా KTM ప్రో ఎక్స్‌పీరియన్స్ రైడ్ యాక్సెసరీస్ ధరపై 50 శాతం తగ్గింపును అందిస్తోంది. బైకు ధరలో 95 శాతం లోన్ చెల్లించవచ్చని KTM వెల్లడించింది. ఈ ఆఫర్ పరిమిత సమయం మాత్రమే ఉంటుంది, ఈ ఆఫర్స్ నిలిపివేసే సమయంలో కస్టమర్లకు కంపెనీ తెలియజేస్తుంది.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

రోజురోజుకి భారతీయ మార్కెట్లో కొత్త వాహనాలు పెరుగుతున్న సమయంలో KTM కంపెనీ కూడా దేశీయ మార్కెట్లో త్వరలో RC 390, RC 200 మరియు RC 125 అనే కొత్త మోడల్స్ విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ కొత్త బైక్ యొక్క టెస్టింగ్ కూడా చాలా సార్లు జరిగింది, టెస్టింగ్ సమయంలో చాలా సార్లు గుర్తించడింది.

త్వరపడండి.. KTM బైక్ కొనుగోలుపై ఇదివరకు ఎన్నడూ లేని అద్భుతమైన ఆఫర్స్

KTM విడుదల చేయనున్న కొత్త బైకులలో అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు ఉంటాయి. అంతహీ కాకూండా ఇవి మంచి డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌లతో లాంచ్ చేయబడుతుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, అప్‌డేటెడ్ హెడ్‌లైట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయి. కొత్త బైకులలో ఇప్పటికే ఉన్న మోడల్స్ లో ఉపయోగించే ఇంజిన్ ఉపయోగించబడుతుంది. త్వరలో విడుదల కానున్న కొత్త బైకులు అధునాతన టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Ktm completes 10 years in india offers discount schemes on bikes
Story first published: Friday, August 27, 2021, 9:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X