ఆఫ్-రోడ్ వెర్షన్ స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించిన డ్యుకాటి
ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ డ్యుకాటి, తమ పాపులర్ స్క్రాంబ్లర్ సిరీస్‌లో ఓ సరికొత్త ఆఫ్-రోడ్ స్పెక్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ ఉత్పత్తిని ప్రపంచ వ్యాప్తంగా 800 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ ఆఫ్-రోడ్ వెర్షన్ డ్యుకాటి స్క్రాంబ్లర్ మోడల్‌కు 'డెసెర్ట్ స్లెడ్ ఫాస్ట్‌హౌస్' అనే పేరును పెట్టారు. అమెరికన్ దుస్తుల బ్రాండ్ ఫాస్ట్‌హౌస్ సహకారంతో డ్యుకాటి ఈ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేసింది. గమనించినట్లయితే, ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై అమెరికన్ ఫ్లాగ్ డిజైన్ కనిపిస్తుంది.

స్టాండర్డ్ డ్యుకాటి స్క్రాంబ్లర్ డెసెర్ట్ స్లెడ్ మోడల్‌ని ఆధారంగా చేసుకొని ఈ లిమిటెడ్ ఎడిషన్ డెసెర్ట్ స్లెడ్ ఫాస్ట్‌హౌస్ మోడల్‌ను తయారు చేశారు. మింట్ 400 మోటార్‌సైకిళ్ల గ్రాఫిక్స్ నుండి ప్రేరణ పొంది, ఈ బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ మోటార్‌సైకిల్ బ్లాండ్ అండ్ గ్రే బేస్ థీమ్‌గా కలిగి ఉండగా, దీని ఫ్రేమ్‌ను రెడ్ కలర్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్‌పై డ్యూకాటి స్క్రాంబ్లర్ బ్యాడ్జ్ మరియు ఫాస్ట్‌హౌస్ బ్రాండింగ్ రెండూ కనిపిస్తాయి. ఈ మోటార్‌సైకిళ్లలోని ప్రతి ఫ్రేమ్‌పై లిమిటెడ్ ఎడిషన్ యొక్క సంఖ్యను ముద్రించబడి ఉంటుంది.

ఇంజన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ డ్యుకాటి స్క్రాంబ్లర్‌లో ఉపయోదించిన అదే 803సిసి, ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఈ ఫాస్ట్‌హౌస్ లిమిటెడ్ ఎడిషన్‌లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్, టార్క్ గణాంకాలు కూడా ఇంచు మించు ఒకేలా ఉండనున్నాయి.

ఈ మోటారుసైకిల్‌పై హార్డ్‌వేర్‌ను గమనిస్తే, ఇందులో సర్దుబాటు చేయగల కయాబా సస్పెన్షన్, తొలగించగల రబ్బరు ప్యాడ్‌లతో ఆఫ్-రోడ్ ప్రేరేపిత ఫుట్ పెగ్‌లు, బ్లాక్ స్పోక్ వీల్స్ మరియు పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్‌టిఆర్ టైర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌తో పాటు, డ్యుకాటి స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెడ్ ఫాస్ట్‌హౌస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల సేకరణను కూడా కంపెనీ పరిచయం చేసింది. షార్ట్ స్లీవ్ టీ షర్ట్, లాంగ్ స్లీవ్ టీ షర్ట్, జాకెట్ మరియు టోపీ మొదలైన అఫీషియల్ అప్పీరల్స్, యాక్ససరీస్‌ను కంపెనీ అందిస్తోంది.

ఈ ఏఢాది ఏప్రిల్ చివరి నాటికి డ్యుకాటిక స్క్రాంబ్లర్ డెసెర్ట్ స్లెడ్ ఫాస్ట్‌హౌస్ మోడల్ ప్రపంచ మార్కెట్లలో లభ్యం కానుంది. డ్యుకాటి డీలర్‌షిప్‌లు మరియు డ్యుకాటి వెబ్‌సైట్ ద్వారా కస్టమర్లు ఈ మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు. లిమిటెడ్ ఎడిషన్ కారణంగా, ఈ కొత్త స్క్రాంబ్లర్ ప్రస్తుతానికి భారత మార్కెట్‌ను తాకే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








