120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషల్ హెల్మెట్స్..

క్లాసిక్ మోటార్‌సైకిళ్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield), ఆటోమోటివ్ రంగంలో తన 120 సంవత్సరాల ప్రయాణాన్ని పురస్కరించుకుని మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్ లను విడుదల చేసింది. ఈ హెల్మెట్ శ్రేణిలో మొత్తం 12 రకాల హెల్మెట్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి కూడా కంపెనీ వారసత్వానికి చెందిన 12 దశాబ్దాల పోస్టర్ లేదా ప్రకటన ద్వారా స్ఫూర్తి పొందిన ప్రత్యేకమైన డిజైన్‌ ను కలిగి ఉంటాయి. ఉంటాయి.

ఈ హెల్మెట్లు అన్నీ కూడా లిమిటెడ్ ఎడిషన్లు కాబట్టి, కంపెనీ 12 డిజైన్లలో ఒక్కొక్కటి 120 యూనిట్లను మాత్రమే తయారు చేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ 120 సంవత్సరాల ప్రయాణం యొక్క కథలను తిరిగి చెప్పడానికి ప్రతి హెల్మెట్ కూడా ప్రత్యేకంగా చేతితో పెయింట్ చేయబడి ఉంటుంది మరియు దాని విశిష్టతను తెలిపే ప్రత్యేక సంఖ్యతో వస్తుంది.

120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషల్ హెల్మెట్స్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ అక్టోబర్ 18 వ తేదీ నుండి ఆరు వారాల పాటు ప్రతి వారం 2 లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్ డిజైన్‌ ల చొప్పున కంపెనీ వెల్లడిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రతి సోమవారం కంపెనీ ఒక డిజైన్ ను వెల్లడిస్తుంది మరియు రెండవ డిజైన్ ను బుధవారం నాడు ప్రదర్శించబడుతుంది.

ఈ డిజైనర్ హెల్మెట్ ల అమ్మకాలు వరుసగా శనివారం మరియు ఆదివారం నుండి ప్రారంభమవుతాయి. ప్రతి హెల్మెట్ డిజైన్ 001/120 నుండి 120/120 వరకు ప్రత్యేక సంఖ్యను కలిగి ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రతి హెల్మెట్ కూడా కేవలం 120 యూనిట్ల వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషల్ హెల్మెట్స్..

ఈ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్ లతో పాటుగా కంపెనీ ఈ హెల్మెట్ ప్యాకేజింగ్‌ లో ఓ పోస్ట్‌కార్డ్ ను కూడా డెలివరీ చేస్తుంది. ఈ పోస్ట్‌కార్డులో సదరు హెల్మెట్ డిజైన్ వెనుక దాగి ఉన్న కథను మరియు స్ఫూర్తిని వివరించడం జరుగుతుంది. ఈ పోస్ట్‌కార్డ్ లలో ఒరిజినల్ పోస్టర్ లేదా రాయల్ ఎన్‌ఫీల్డ్ బృందంతో చేత చేతితో గీసిన హెల్మెట్ డిజైన్‌ ను రూపొందించడానికి ఉపయోగించే అడ్వర్టైజింగ్ ఆర్ట్‌వర్క్ కూడా ఉంటుంది.

120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషల్ హెల్మెట్స్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ అందించనున్న అన్ని లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్లు కూడా అత్యుతన్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఈ హెల్మెట్‌లకు ట్రిపుల్ సర్టిఫికేషన్ (ISI, DOT, ECE) ఉంటుంది మరియు ఇవి ప్రీమియం ఇంటర్నల్స్, సన్ వైసర్ మరియు లెదర్ ట్రిమ్ లతో లభిస్తాయి. ఇవన్నీ మోటార్‌సైకిల్ పై రైడర్‌ లకు భద్రతను మాత్రమే కాకుండా, అత్యుత్తమ సౌకర్యాన్ని కూడా అందిస్తాయి.

120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషల్ హెల్మెట్స్..

ఇక ధర విషయానికి వస్తే, ఇవి రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్లు కాబట్టి, ఇవి కాస్తంత ప్రీమియం ధరనే కలిగి ఉంటాయి. వీటిలో ఓపెన్ ఫేస్ హెల్మెట్ ధర రూ. 6,950 కాగా, ఫుల్ ఫేస్ హెల్మెట్ ధర రూ. 8,450 గా ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ 120వ వార్షికోత్సవ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులోని ప్రతి హెల్మెట్ డిజైన్ కూడా, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ యొక్క గత 12 దశాబ్దాల వారసత్వాన్ని మరియు చరిత్రను వర్ణిస్తుంది.

120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషల్ హెల్మెట్స్..

ఈ సందర్భంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క నేషనల్ బిజినెస్ హెడ్ - నార్త్ అండ్ వెస్ట్ ఇండియా మరియు గ్లోబల్ హెడ్ - అపీరెల్ బిజినెస్, పునీత్ సూద్ మాట్లాడుతూ "రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ యొక్క గత 120 సంవత్సరాల కథలను పంచుకోవడానికి హెల్మెట్‌ల కంటే మెరుగైన కాన్వాస్ వేరే ఏముంటుంది. అందుకే, మన చరిత్రను సృష్టించడానికి మా ఈ లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్‌ రేంజ్ ను రూపొందించాము" అని అన్నారు.

120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషల్ హెల్మెట్స్..

Royal Enfield రైడింగ్ బూట్లు..

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ రైడర్ల జీవన శైలిని మరింత అద్భుతంగా మార్చడానికి అనేక యాక్ససరీలను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల 'మేక్ ఇట్ యువర్' ప్రోగ్రామ్ కింద జాకెట్స్, హెల్మెట్స్ మరియు టీ-షర్టులతో పాటుగా ఇప్పుడు టిసిఎక్స్ (TCX) సహకారంతో కొత్త రైడింగ్ బూట్స్ ను పరిచయం చేసింది. ఈ బూట్లు భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా ఉంటాయి.

అంతే కాకుండా, ఇవి కఠినమైన భద్రతా పరీక్షలకు లోబడి ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క టిసిఎక్స్ కలెక్షన్ ఇప్పుడు పురుషులు మరియు స్త్రీల కోసం వివిధ రకాల రైడింగ్ షూలను అందిస్తుంది. వీటిలో స్టెల్వియో డబ్ల్యుపి రైడింగ్ బూట్స్ ఫుల్ లెంత్ వాటర్‌ప్రూఫ్ అడ్వెంచర్ రైడింగ్ బూట్‌ల ధర రూ. 21,000 గా ఉంది. ఇవి పూర్తిగా లెదర్ తో తయారు చేయబడి ఉండి, కఠినమైన పరిస్థితుల్లో కూడా రైడర్ కి చాలా సౌకర్యంగా ఉంటాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

120 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెషల్ హెల్మెట్స్..

Royal Enfield మేక్ ఇట్ యువర్ 'జాకెట్'..

ఇవే కాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కస్టమర్ల కోసం కస్టమైజ్ చేసుకోదగిన టీషర్టులు మరియు రైడింగ్ జాకెట్లను కూడా అందిస్తోంది. వీటిని కొనుగోలు చేయదలిచిన కస్టమర్లు ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత, ఇందులోని మేక్ ఇట్ యువర్ (MIY) విభాగంలో అందించిన ఉత్పత్తులను ఎంచుకొని, తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవటం ద్వారా ఆర్డర్ చేయవచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Limited edition royal enfield helmet range launched to celebrate its 120th anniversary details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X