పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ద్విచక్రవాహన తయారీ సంస్థల్లో ఒకటి Royal Enfield (రాయల్ ఎన్‌ఫీల్డ్). Royal Enfield కంపెనీ యొక్క బైకులు కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.

అయితే కంపెనీ ఈ బైక్ రైడర్ల జీవన శైలిని మరింత మార్చడానికి అనేక పరికరాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల 'మేక్ ఇట్ యువర్' ప్రోగ్రామ్ కింద జాకెట్స్, హెల్మెట్స్ మరియు టీ-షర్టులు వంటి వాటిని అందిస్తోంది. అయితే ఇప్పుడు TCX (టిసిఎక్స్) సహకారంతో కొత్త రైడింగ్ బూట్స్ పరిచయం చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

బైక్ తయారీదారు Royal Enfield ఇప్పుడు TCX సహకారంతో కొత్త శ్రేణి బూట్లను విడుదల చేసింది. ఈ బూట్లు భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా కఠినమైన భద్రతా పరీక్షలను కూడా ఆమోదించాయని కంపెనీ పేర్కొంది. Royal Enfield యొక్క టిసిఎక్స్ కలెక్షన్ ఇప్పుడు పురుషులు మరియు స్త్రీలకు ఇద్దరికీ వివిధ రకాల రైడింగ్ షూలను అందిస్తుంది.

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

స్టెల్వియో డబ్ల్యుపి రైడింగ్ బూట్స్ ఫుల్ లెంత్ వాటర్‌ప్రూఫ్ అడ్వెంచర్ రైడింగ్ బూట్‌ల ధర రూ. 21,000 వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ బూట్లు పూర్తిగా లెదర్ తో తయారు చేయబడి ఉంటాయి. కావున కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈ బూట్లు రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి.

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

ఈ బూట్లు రైడర్ యొక్క మోకాలి వరకు వస్తాయి, అంతే కాకుండా బి రైడింగ్ చేసేటప్పుడు రైడర్ యొక్క పాదాలను పూర్తిగా కప్పివేస్తాయి. ఈ బూట్ల క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది, కావున ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయిన చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ బూట్లు రెండు కలర్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవి ఒకటి బ్లాక్ (నలుపు) కాగా, రెండవది బ్రౌన్ (గోధుమ రంగు).

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

స్టెల్వియో మిడ్-రైస్ డబ్ల్యుపి రైడింగ్ బూట్స్ అనేది ఫుల్ లెంత్ మోడల్ యొక్క షార్ట్ బూట్స్ డిజైన్, మరియు లెదర్ ఫినిష్, టి-డ్రై వాటర్‌ప్రూఫ్ లైనింగ్ కలిగి ఇంటిగ్రేటెడ్ పియు ఇన్సర్ట్‌లు మరియు రీన్ఫోర్స్‌మెంట్‌లను కలిగి ఉంటుంది. ఈ బూట్ల ధర రూ .18,000 నుండి ప్రారంభమవుతుంది. ఇవి కూడా బ్లాక్ (నలుపు) మరియు బ్రౌన్ (గోధుమ రంగు) కలర్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

ఇక డబ్ల్యుపి బూట్ల విషయానికి వస్తే, ఇవి ఆధునిక తరహా రైడింగ్ స్నీకర్‌లు, ఇవి రోజంతా రైడర్ కి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతే కాకుండా రైడర్ లను మంచి భద్రతను అందిస్తాయి. ఇవి లెదర్ తో తయారుచేయబడి వాక్స్ ఫినిష్ తో వస్తాయి. కావున చాలా ఆకర్షణీయంగా మరియు రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ బూట్లు పాదాలను ధూళి మరియు శిధిలాల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

డబ్ల్యుపి బూట్లు మంచి పట్టుని అందిస్తాయి. అంతే కాకుండా ఈ బూట్లలో అమర్చిన టి-డ్రై వాటర్‌ప్రూఫ్ మెమ్‌బ్రేన్ వర్షపు వాతావరణంలో రైడర్ పాదాలను రక్షిస్తుంది. కాబో డబ్ల్యుపి రైడింగ్ స్నీకర్ల ధర రూ. 8,500. ఇవి నలుపు మరియు ఆలివ్ కలర్స్ లో లభిస్తాయి. ఇవి కూడా రైడర్ కి మంచి పట్టుని అందించి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

కేవలం రైడర్స్ పురుషులు మాత్రమే కాకుండా మహిళా రైడర్స్ కూడా ఉన్నారు. కావున మహిళా రైడర్స్ కోసం కంపెనీ క్లౌసేన్ లేడీ రైడింగ్ WP బూట్లను పరిచయం చేసింది. ఇవి కూడా ఫుల్ గ్రైన్ లెదర్ తో తయారు చేయబడి ఉంటాయి. అంతే కాకుండా ఇవి T- డ్రై వాటర్‌ప్రూఫ్.

ఈ బూట్లు మహిళా రైడర్స్ కి మంచి పట్టుని అందించడమే కాకుండా పాదాలకు మంచి రక్షణను కూడా కల్పిస్తాయి. CE సర్టిఫైడ్ రైడింగ్ బూట్లు హై హీల్ నిర్మాణంతో రూపొందించబడ్డాయి. కంపెనీ ఈ బూట్లను లాంగ్ రైడ్స్‌లో సౌకర్యం కోసం స్త్రీ పాదాలను ఖచ్చితంగా ఉంచేలా రూపొందించబడ్డాయి. వీటి ధర రూ. 15,000. ఇవి కేవలం బ్లాక్ కలర్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

ఇవి కాకుండా, గ్రిమ్సెల్ లేడీ వాటర్‌ప్రూఫ్ రైడింగ్ బూట్లను లేడీస్ కలెక్షన్‌లో లెదర్ బూట్‌లుగా పరిచయం చేశారు. ఇవి క్లాసిక్ రెట్రో రూపాన్ని ఇస్తాయి. వాటి ధర రూ .13,000 మరియు వాక్స్ ఫినిష్‌తో ప్రీమియం పూర్తి గ్రైన్ లెదర్ తో తయారు చేయబడ్డాయి. ఇవి కూడా మంచి పట్టుని అందిస్తాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

మనం మొదట్లో చెప్పుకున్నట్లు కంపెనీ ఇప్పటికే 'మేక్ ఇట్ యువర్' అనే ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందగలిగింది. Royal Enfield మేక్ ఇట్ యువర్ ప్రోగ్రామ్ కింద హెల్మెట్‌లు, టీ-షర్టులు మరియు జాకెట్లను కొనుగోలుదారులు కోరుకున్న విధంగా తయారు చేసి అందిస్తుంది.

పురుషులు మరియు స్త్రీలు కోసం Royal Enfield రైడింగ్ బూట్లు.. పూర్తి వివరాలు

Royal Enfield కంపెనీ 'మేక్ ఇట్ యువర్స్' ప్రోగ్రామ్ గత సంవత్సరం Royal Enfield Meteor 350 మరియు Royal Enfield 650 Twins ప్రారంభించిన సమయంలో ప్రారంభించింది. ప్రారంభించిన మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Royal enfield introduced riding boots range for men and women
Story first published: Tuesday, September 28, 2021, 10:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X