మలేషియాలో కొత్త 2021 Honda CBR150R లాంచ్; ఇండియాకు వచ్చే ఛాన్స్..

జపనీస్ టూవీలర్ బ్రాండ్ Honda Motorcycle (హోండా మోటార్‌సైకిల్) తమ కొత్త 2021 Honda CBR150R (హోండా సిబిఆర్150ఆర్) బైక్‌ను మలేషియా మార్కెట్లో విడుదల చేసింది. తాజా సమాచారం, ప్రకారం, ఇది భారత మార్కెట్లో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.

మలేషియాలో కొత్త 2021 Honda CBR150R లాంచ్; ఇండియాకు వచ్చే ఛాన్స్..

కొత్త 2021 Honda CBR150R ఈ విభాగంలో నేరుగా Yamaha YZF R15 (యమహా వైజీఎఫ్ ఆర్15) తో పోటీపడుతుంది. మలేషియన్ మార్కెట్లో ఈ కొత్త హోండా బైక్ ధర 12,499 మలేషియా రింగ్‌గిట్ (ఆర్ఎస్) గా ఉంటుంది. అంటే, మనదేశ కరెన్సీలో ప్రస్తుత మారకపు విలువ ప్రకారం, సుమారు రూ. 2.21 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.

మలేషియాలో కొత్త 2021 Honda CBR150R లాంచ్; ఇండియాకు వచ్చే ఛాన్స్..

పొత CBR150R మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2021 Honda CBR150R లో స్టైలింగ్ మరియు ఫీచర్ల పరంగా అనేక కొత్త అప్‌డేట్‌ లు ఉన్నాయి. ముందుగా దీని డిజైన్ ను గమనిస్తే, ఈ కొత్త 2021 Honda CBR150R మొదటి చూపులో చూడటానికి Honda CBR250R మోడల్ మాదిరిగా కనిపిస్తుంది.

మలేషియాలో కొత్త 2021 Honda CBR150R లాంచ్; ఇండియాకు వచ్చే ఛాన్స్..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న CBR250R లోని అనేక డిజైన్ ఎలిమెంట్స్ ఈ కొత్త 2021 CBR150R లో కూడా కనిపిస్తాయి. ప్రధానంగా దీని ముందు భాగంలో డ్యూయల్-బీమ్ ఎల్ఈడి హెడ్‌లైట్‌, షార్ప్ ఫ్రంట్ ఫెయిరింగ్, మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు నెట్టర్ టెయిల్ సెక్షన్ వంటి కొన్ని అంశాలు CBR250R నుండి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది.

మలేషియాలో కొత్త 2021 Honda CBR150R లాంచ్; ఇండియాకు వచ్చే ఛాన్స్..

ఇక ఇందులోని ఇతర స్టైలింగ్ అంశాల విషయానికి వస్తే, కొత్త 2021 Honda CBR150R లో స్ప్లిట్-స్టైల్ సీట్, పెంచిన టెయిల్ సెక్షన్, ఏరో-ఆకారపు స్ప్లిట్ టెయిల్-ల్యాంప్స్, అప్‌స్వీప్డ్ ఎగ్జాస్ట్ బాక్స్, ఎక్స్‌పోజ్డ్ రియర్ సబ్‌ఫ్రేమ్ మరియు క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్ మొదలైనవి ఉన్నాయి. మొత్తంగా ఇవ్ననీ ఈ బైక్ పాత మోడల్ కంటే మరింత అగ్రెసివ్ గా కనిపించేలా చేస్తాయి.

మలేషియాలో కొత్త 2021 Honda CBR150R లాంచ్; ఇండియాకు వచ్చే ఛాన్స్..

మలేషియా మార్కెట్‌లో హోండా ఈ బైక్‌ని మొత్తం రెండు కలర్ ఆప్షన్‌ లలో విడుదల చేసింది. వీటిలో మ్యాట్ చార్‌కోల్ గ్రే మెటాలిక్ మరియు కాండీ సింటిల్లెట్ రెడ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక కొత్త 2021 CBR150R ఫీచర్‌ల విషయానికి వస్తే, ఇందులో పూర్తిగా డిజిటల్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు ఇంధన వినియోగాన్ని చూపుతుంది.

మలేషియాలో కొత్త 2021 Honda CBR150R లాంచ్; ఇండియాకు వచ్చే ఛాన్స్..

కొత్త 2021 Honda CBR150R ఇంజన్ విషయానికి, ఈ మోటార్‌సైకిల్‌లో పెద్దగా అప్‌డేట్స్ ఏమీ చేయలేదు. ఇందులో అదే 149 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ డిఓహెచ్‌సి ఇంజన్ ను ఉపయోగించారు. మలేషియాన్ స్పెక్ ఇంజన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 16.09 బిహెచ్‌పి పవర్ ను మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.7 న్యూటన్ మీటర్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

మలేషియాలో కొత్త 2021 Honda CBR150R లాంచ్; ఇండియాకు వచ్చే ఛాన్స్..

ఇది ఇండోనేషియన్ స్పెక్ CBR150R మోడల్ కంటే 1 బిహెచ్‌పి తక్కువ పవర్ ను మరియు 0.7 న్యూటన్ మీటర్ తక్కువ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. Honda తమ కొత్త 2021 CBR150R ను దాని PGM-Fi ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మరియు eSP టెక్నాలజీతో అమర్చింది. ఈ ఇంజన్ స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్ తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

మలేషియాలో కొత్త 2021 Honda CBR150R లాంచ్; ఇండియాకు వచ్చే ఛాన్స్..

మెకానికల్స్ విషయానికి వస్తే, కొత్త 2021 Honda CBR150R లోని సస్పెన్షన్ సెటప్‌లో ముందు వైపు అప్ సైడ్ డౌన్ (యూఎస్‌డి) టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇందులోని షోవా గోల్డ్ ఫినిష్డ్ ఫ్రంట్ ఫోర్కులు బైక్ యొక్క మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తుంది.

Most Read Articles

English summary
New 2021 honda cbr150r launched in malesia india launch expected details
Story first published: Friday, September 10, 2021, 15:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X