Just In
- 40 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 51 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 59 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Finance
మార్చి 31 వరకు.. వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగింపు
- Movies
Check 1st day collections: బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినా.. తొలి రోజు ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ తమ సరికొత్త 2021 డ్యూక్ 890 మోడల్‌ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. పాత డ్యూక్ 790 స్థానాన్ని రీప్లేస్ చేస్తూ ఈ కొత్త 890 డ్యూక్ మోడల్‌ను ప్రవేశపెట్టారు. పాత మోడల్ (790 డ్యూక్)తో పోలిస్తే ఈ కొత్త మోడల్ (890 డ్యూక్) అన్ని విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో కఠినమైన యూరో 5 ఉద్గార నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత, మార్కెట్లలో పాత కెటిఎమ్ 790 డ్యూక్ మోడల్‌ని నిలిపివేశారు. కాగా, కొత్తగా వచ్చిన ఈ 2021 కెటిఎమ్ 890 డ్యూక్ మోడల్‌ను దాని పవర్‌ఫుల్ వేరియంట్ అయిన 890 ఆర్ డ్యూక్ వేరియంట్‌కు దిగువన ఆఫర్ చేయనున్నారు.

అయినప్పటికీ, ఇది దాని పవర్‌ఫుల్ వేరియంట్ మాదిరిగానే ఒకేరకమైన ఛాసిస్స్, ఇంజన్ మరియు బాడీ ప్యానెళ్లను కలిగి ఉంటుంది. మునుపటి తరం మోడల్ మాదిరిగానే, కొత్త డ్యూక్ 890 కూడా అగ్రెసివ్ డిజైన్ మరియు స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సింగిల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, స్ప్లిట్ సీట్స్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఇప్పుడు సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో కూడిన కొత్త పెయింట్ స్కీమ్‌తో లభిస్తుంది. ఇందులో కొత్తగా రెండు కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టారు. అవి: బ్లాక్ మరియు ఆరెంజ్. ఇతర కెటిఎమ్ మోడళ్లలో కనిపించినట్లుగా, ఈ మోటార్‌సైకిల్‌లో ఆరెంజ్ కలర్ ఫ్రేమ్ ఉండదు. దీనిని పూర్తిగా బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేశారు. కేవలం రిమ్స్ మాత్రమే ఆరెంజ్ కలర్‌లో లభిస్తాయి.

కొత్త (2021) కెటిఎమ్ 890 డ్యూక్ కూడా 790 డ్యూక్ మాదిరిగానే 169 కిలోల బరువును కలిగి ఉంటుంది. అయితే, డ్యూక్ 890 లోని సీట్ ఎత్తు మాత్రం దాని మునుపటి వేరియంట్ కంటే 5 మిమీ తక్కువగా ఉండేలా డిజైన్ చేశారు. ఫలితంగా, ఇది మంచి యాక్సెసబిలిటీని ఆఫర్ చేస్తుంది.
MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

ఇంజన్ విషయానికి వస్తే, ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, డ్యూక్ 890ఆర్ మోడల్‌లో ఉపయోగించిన అదే 889 సిసి పారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఈ కొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్‌లోనూ ఉపయోగించారు. అయితే, ఈ ఇంజన్ కొద్దిగా డీ-ట్యూన్ చేశారు.

ఫలితంగా, దీని పవర్ మరియు టార్క్ గణాంకాల్లో మార్పులు ఉంటాయి. డీట్యూన్ చేయబడి ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8000 ఆర్‌పిఎమ్ వద్ద 92 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటుగా స్టాండర్డ్ టూ-వే క్విక్-షిఫ్టర్‌తో లభిస్తుంది.

పైన పేర్కొన్న ఫీచర్లే కాకుండా, ఈ కొత్త 2021 డ్యూక్ 890 మోడల్‌లో ఇతర ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటిలో ఐఎమ్‌యూ అసిస్ట్, నైన్-వే ట్రాక్షన్ కంట్రోల్ మరియు బహుళ రైడ్ మోడ్‌లు (రెయిన్, స్ట్రీట్ మరియు స్పోర్ట్), 6డి లీన్ యాంగిల్ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి.

ఇక భారత మార్కెట్ విషయానికి వస్తే, 2021 చివరి నాటికి ఈ కొత్త కెటిఎమ్ 890 డ్యూక్ విడుదల కావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని కేటిఎమ్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఒకవేళ ఈ మోడల్ భారత్‌లో విడుదలైతే, ఇది కూడా దేశంలోని డ్యూక్ 790 మోడల్‌ను రీప్లేస్ చేసే అవకాశం ఉంది.
MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

భారతదేశంలో కొత్త 2021 కెటిఎమ్ డ్యూక్ 890 ధర సుమారు రూ.9 లక్షలు, ఎక్స్-షోరూమ్ రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. కాగా, ప్రపంచ మార్కెట్లలో విడుదల కానున్న కొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఈ విభాగంలో ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మరియు డ్యుకాటి మోన్స్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.