Just In
- 29 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 40 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 48 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2021 సుజుకి హయబుసా బుకింగ్స్ ఓపెన్, ఏప్రిల్‌లో డెలివరీలు!
జపాన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్స్ తమ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ 'హయాబుసా'లో ఇటీవలే కొత్త 2021 వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ సరికొత్త సూపర్‌బైక్ మన భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో, తాజాగా ఎక్స్‌ప్రెస్ డ్రైవ్స్ నుండి వచ్చి సమాచారం ప్రకారం, భారతదేశంలో సుజుకి మోటార్‌సైకిల్ డీలర్‌షిప్ కేంద్రాలు ఈ కొత్త సూపర్‌బైక్ కోసం అనధికారికంగా బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు సమాచారం. అందరికన్నా ముందుగా ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు దీనిని ముందుగా బుక్ చేసుకోవచ్చని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆసక్తి గల కస్టమర్లు రూ.2 లక్షల అడ్వాన్స్ చెల్లించి ఈ మోడల్‌ని బుక్ చేసుకోవచ్చని, ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే కొత్త 2021 సుజుకి హయబుసా బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయని అందులో తెలిపారు. అయితే, ఈ విషయంపై సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
MOST READ:ఇలాంటి రోల్స్ రాయిస్ కారును ఎప్పుడైనా చూశారా? ఇది ఏ సెలబ్రిటీదో తెలుసా?

కొత్త 2021 సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌లో కాస్మెటిక్ మార్పులతో పాటుగా అధునాత ఫీచర్లను మరియు అనేక ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ పరికరాలతోనూ అందుబాటులోకి రానుంది. దీని ఐకానిక్ డిజైన్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాకపోతే, ఫ్రంట్‌లో చేసిన చిన్నపాటి మార్పుల కారణంగా ఇది మునుపటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

ఈ సూపర్‌బైక్ లోని లైట్లన్నింటినీ ఎల్ఈడిలతో భర్తీ చేశారు. హయాబుసాలోని ఫ్రంట్ ఫెయిరింగ్ చాలా షార్ప్‌గా ఉండి, స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది. ముందు వైపు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, దాని పైభాగం ఎల్‌ఈడి డిఆర్ఎల్, దిగువ భాగంలో రెండు ఎయిర్ ఇన్‌టేక్స్ మరియు వాటిని ఆనుకొని ఉండే రెండు టర్న్ ఇండికేటర్స్‌తో ఇది మరింత అగ్రెసివ్ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.
MOST READ:అరుదైన లగ్జరీ కార్లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

ఇందులో సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఇందులో రెండు గుండ్రటి అనలాగ్ డయల్స్ మధ్యలో మరో గుండ్రటి డిజిటల్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఈ అనలాగ్ డయల్స్‌కి ఇరువైపులా ఫ్యూయెల్ మరియు టెంపరేచర్ గేజ్‌లు కూడా ఉన్నాయి.

ఇందులో మధ్య భాగంలో ఉండే డిజిటల్ టిఎఫ్‌టి డిస్‌ప్లే కనెక్టింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఇది వేరే యుఐని కలిగి ఉండి, గేర్ స్థానం, లీన్ యాంగిల్స్, రైడ్ మోడ్‌లు, గడియారం మరియు ఉష్ణోగ్రతలతో పాటుగా రైడర్‌కు కావల్సిన అనేక రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కొత్త మోటార్‌సైకిల్‌లోని టిఎఫ్‌టి డిస్‌ప్లేలో ట్రాక్షన్ కంట్రోల్, పవర్ మోడ్స్, ల్యాప్ టైమర్ వంటి మరెన్నో వివరాలు ఉంటాయి.
MOST READ:కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

కొత్త 2021 సుజుకి హయబుసా మోటారుసైకిల్‌లో అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు లభించే అవకాశం ఉంది. వీటిలో కార్నరింగ్ ఫోర్సెస్, వీలీ కంట్రోల్ మొదలైన వాటి కోసం 6-యాక్సిస్ ఐఎమ్‌యూ, మూడు పవర్ మోడ్స్, లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబిఎస్, హిల్-హోల్డ్ కంట్రోల్ మరియు త్రీ లెవెల్ ఇంజన్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఇందులో బ్రాండ్ యొక్క సరికొత్త ఎస్ఐఆర్ఎస్ (సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్) టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇందులో కొత్తగా అమర్చిన స్విచ్ గేర్ క్యూబ్ సాయంతో ఈ ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.
MOST READ:డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా.. ఇది చూడండి

ఇంజన్ విషయానికి వస్తే, ఇదివరకటి హయాబుసాలో ఉపయోగించిన అదే 1340సిసి ఇన్లైన్-ఫోర్-సిలిండర్ డిఓహెచ్‌సి లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌నే ఈ కొత్త మోడల్‌లోనూ ఉపయోగించనున్నారు. అయితే, గరిష్ట పనితీరు కోసం ఈ ఇంజన్‌ను తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రీట్యూన్ చేశారు.

ఇందులోని అప్‌డేట్ చేయబడిన ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పి పవర్‌ను మరియు 150 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది బై-డైరెక్షన్ క్విక్‌షిఫ్టర్‌తో రైడ్-బై-వైర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది కేవలం 2.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 290 కిలోమీటర్లు. ఈ మోటారుసైకిల్ బరువు 265 కిలోలు. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 20 లీటర్లు, సీటు ఎత్తు 800 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 125 మిమీగా ఉంటుంది.