సుజుకి హయబుసా డెలివరీలు ప్రారంభం; త్వరలోనే సెకండ్ బ్యాచ్ బుకింగ్స్!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా, ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 2021 సుజుకి హయాబుసా డెలివరీలు ప్రారంభమయ్యాయి. గడచిన ఏప్రిల్ నెలలో కంపెనీ ఈ మోడల్‌ను రూ.16.40 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో విడుదల చేసింది.

సుజుకి హయబుసా డెలివరీలు ప్రారంభం; త్వరలోనే సెకండ్ బ్యాచ్ బుకింగ్స్!

మొదటి బ్యాచ్‌లో భాగంగా, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఈ సూపర్‌బైక్ అమ్మకాలను 101 యూనిట్లకు పరిమితం చేసింది. అయితే, సుజుకి హయబుసా మార్కెట్లోకి విడుదలైన మొదటి వారంలోనే అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి. కాగా, రెండవ బ్యాచ్ ఆగస్ట్ 2021 నాటికి భారతదేశానికి చేరుకుంటుందని అంచనా.

సుజుకి హయబుసా డెలివరీలు ప్రారంభం; త్వరలోనే సెకండ్ బ్యాచ్ బుకింగ్స్!

పాత వెర్షన్‌తో పోల్చుకుంటే, ఈ మూడవ తరం సుజుకి హయబుసాలో కాస్మెటిక్ మరియు మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఈ కొత్త 2021 సుజుకి హయాబుసా మొత్తం మూడు కలర్ అప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి: గ్లోస్ స్పార్క్లీ బ్లాక్ / కాండీ బర్న్ట్ గోల్డ్, మెటాలిక్ మ్యాట్ స్వోర్డ్ సిల్వర్ / కాండీ డేరింగ్ రెడ్ మరియు పెరల్ బ్రిలియంట్ వైట్ / మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ.

సుజుకి హయబుసా డెలివరీలు ప్రారంభం; త్వరలోనే సెకండ్ బ్యాచ్ బుకింగ్స్!

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 సుజుకి హయాబుసాలో 1,340సిసి, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్, డిఓహెచ్‌సి, ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 187 బిహెచ్‌పి శక్తిని, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

సుజుకి హయబుసా డెలివరీలు ప్రారంభం; త్వరలోనే సెకండ్ బ్యాచ్ బుకింగ్స్!

ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్ మరియు ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త 2021 సుజుకి హయబుసా సూపర్ బైక్ కేవలం 3.2 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 299 కిలోమీటర్లుగా ఉంటుంది.

సుజుకి హయబుసా డెలివరీలు ప్రారంభం; త్వరలోనే సెకండ్ బ్యాచ్ బుకింగ్స్!

మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్‌లోని ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి కాస్తంత తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది మునుపటి కన్నా కాస్తతం తక్కువ బరువును కూడా కలిగి ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం, దీని సస్పెన్షన్ సెటప్‌లో చేసిన మార్పులే.

సుజుకి హయబుసా డెలివరీలు ప్రారంభం; త్వరలోనే సెకండ్ బ్యాచ్ బుకింగ్స్!

కొత్త 2021 సుజుకి హయబుసాలో పూర్తిగా ఎల్‌ఇడి లైట్లను ఉఫయోగించారు. టర్న్ ఇండికేటర్లు, హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్స్ అన్నీ కూడా ఎల్ఈడిల రూపంలో లభిస్తాయి. టర్న్ ఇండికేటర్లను ఇప్పుడు ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైకి మార్చారు. ఈ ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉంటాయి.

Most Read Articles

English summary
New 2021 Suzuki Hayabusa Motorcycle Deliveries Commenced In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X