భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

ప్రీమియం బైక్ తయారీదారు Triumph Motorcycle (ట్రయంఫ్ మోటార్‌సైకిల్) దేశీయ మార్కెట్లో తన కొత్త 2021 Triumph Street Scrambler (2021 ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్‌) బైక్ ను విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్‌ ధర రూ. 9.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ గురించి మరింత్ సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

2021 Triumph Street Scrambler బైక్ రెండు సింగిల్ టోన్ కలర్ ఆప్సన్స్ మరియు ఒక డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

అవి:

1) జెట్ బ్లాక్

2) అర్బన్ గ్రే

4) మాట్ ఖాకీ / మాట్ ఐరన్‌స్టోన్ (డ్యూయల్ టోన్ కలర్‌)

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Triumph Street Scrambler బైక్ అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్, కీ-ఫోబ్ ఎన్‌క్యాప్సులేటెడ్ ఇమ్మొబిలైజర్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బ్రష్డ్ అల్యూమినియం హెడ్‌లైట్ బ్రాకెట్ వంటి వాటిని పొందుతుంది.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

ఇవి మాత్రమే కాకుండా ఇందులో కొత్త త్రాటల్ బాడీ ఫినిషర్, USB ఛార్జింగ్ సాకెట్, హై-మౌంటెడ్ ట్విన్-ఎగ్జాస్ట్, అల్యూమినియం నంబర్ బోర్డ్, ఇంజిన్ గార్డ్ మరియు స్లిమ్ సీట్ ఉన్న కొత్త సైడ్ ప్యానెల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ బైక్ ని చాలా దూకుడుగా కనిపించేలా చేస్తాయి.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

Triumph Street Scrambler బైక్‌లో లెదర్ సీట్లు, డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్, సర్క్యులర్ రియర్ వ్యూ మిర్రర్, సర్క్యులర్ టెయిల్ లైట్ మరియు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్ ఇవ్వబడ్డాయి. ఆల్-ట్రాక్ టైర్‌లతో పాటు స్పోక్ వీల్స్ ఈ బైక్ లో ఉపయోగించబడ్డాయి.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

ఈ బైక్ మంచి బ్రేకింగ్ సెటప్ పొందుతుంది. ఈ మెరుగైన బ్రేకింగ్ పెర్పామెన్స్ కోసం బైక్ ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. కావున ఇవి బైక్ వేగవంతం అయినప్పుడు కూడా వెంటనే ఆపడానికి అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

ఈ కొత్త బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉన్న, 900 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 7,250 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 64.1 బిహెచ్‌పి పవర్ మరియు 3,250 ఆర్‌పిఎమ్ వద్ద 80 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. అంతే కాకుండా ఇందులో స్విచబుల్ ఏబీఎస్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

కొత్త Triumph Street Scrambler బైక్ మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి రోడ్, రెయిన్ మరియు ఆఫ్ రోడ్ మోడ్స్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ 19/17-ఇంచెస్ వైర్-స్పోక్ వీల్ కాంబోలో నడుస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ సీటు ఎత్తు 790 మి.మీ వరకు ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో కొత్త Triumph Street Scrambler బైక్ Ducati Scrambler 800 (డుకాటి స్క్రాంబ్లర్ 800) కి ప్రత్యర్థిగా ఉంటుంది. డుకాటి స్క్రాంబ్లర్ 800 ధర దేశీయ మార్కెట్లో రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే ఈ బైక్ తక్కువ టార్క్ అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇటీవల 2021 ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ బైక్ ను రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది.

భారత్‌లో విడుదలైన 2021 Triumph Street Scrambler: ధర & వివరాలు

కొత్త 2021 ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ బైక్ యొక్క పవర్ అవుట్‌పుట్ విషయానికి వస్తే,ఇందులోని ఇంజిన్ 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 96 బిహెచ్‌పి పవర్ మరియు 4,950 ఆర్‌పిఎమ్ వద్ద 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ బోనెవిల్లే కంటే 17 శాతం ఎక్కువ శక్తిని అందిస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ బైక్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New 2021 triumph street scrambler launched in india at rs 9 35 lakhs details
Story first published: Tuesday, October 12, 2021, 18:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X