విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310; ఈ బైక్ లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ వాహన తయారీదారు అయిన TVS Motor కంపెనీ యొక్క TVS Apache బైకులకు మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కారణంగానే కంపెనీ తన ఫోర్డ్ ఫోలియోను మరింత విస్తరించడానికి దేశీయ మార్కెట్లో కొత్త బైకులను విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే TVS కంపెనీ తన Apache RR 310 వెర్షన్ బైక్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310 బైక్

TVS Motor కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం, 2021 TVS Apache RR 310 బైక్ దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు 30 న అధికారికంగా విడుదల చేయబడుతుంది. ఈ బైక్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది.

విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310 బైక్

సాధారణంగా ఈ కొత్త TVS Apache RR 310 బైక్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రారంభించడానికి సన్నద్ధమయ్యింది. కానీ దేశంలో అధికంగా వ్యాపించిన కరోనా మహమ్మారి కారణంగా TVS Apache RR 310 బైక్ లాంచ్ వాయిదా పడింది. అయితే కరోనా ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టడం వల్ల ఈ బైక్ విడుదలకు సన్నద్ధమవుతోంది.

విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310 బైక్

కొత్త 2021 TVS Apache RR 310 బైక్ అనేక అప్డేట్స్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ బైక్ చాలావరకు స్థానికంగా తయారైన పరికరాలను వినియోగించుకుంటుంది. ఇందులో టైర్లు, అడ్జస్టబుల్ ఫోర్కులు వంటి వాటితోపాటు ఇతర పరికరాలు కూడా ఉన్నాయి.

విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310 బైక్

కంపెనీ విడుదల చేసిన కొంత సమాచారం ప్రకారం కొత్త 2020 TVS Apache RR 310 బైక్ మిచెలిన్ రోడ్ 5 టైర్లు ఉపయోగించబడ్డాయి. కావున ఈ బైక్ యొక్క నిర్వహణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టైర్లు మెరుగైన పట్టును అందిస్తాయి. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310 బైక్

ఇప్పుడు కంపెనీ యొక్క కొత్త TVS Apache RR 310 బైక్ లో ప్రోటోర్క్ ఎక్స్‌ట్రీమ్ రేడియల్ టైర్లు ఉపయోగించబడుతాయని భావిస్తున్నారు. ఈ టైర్లు 2021 Apache RTR 200 4V బైక్ లో లాగా, కొత్త Apache RR 310 కూడా ప్రీలోడ్-అడ్జస్టబుల్ లేదా ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ యుఎస్డి ఫోర్క్‌లను పొందవచ్చు.

విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310 బైక్

కంపెనీ ఈ కొత్త బైక్ లో ఇంజిన్ రీట్యూన్ చేసే అవకాశం ఉంది. కావున పవర్ డెలివరీ మరింత అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ లో 312 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉపయోగించవచ్చు. ఈ ఇంజిన్ 34 బిహెచ్‌పి పవర్ మరియు 27.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. TVS Apache RR 310 బైక్ నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి ట్రాక్, స్పోర్ట్, అర్బన్ మరియు రెయిన్ మోడ్స్.

విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310 బైక్

కొత్త TVS Apache RR 310 బైక్ ధర విషయానికి వస్తే, దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న Apache RR 310 రూ. 2.54 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విక్రయించబడింది. కావునా 2021 TVS Apache RR 310 ధర దాని మునుపటి మోడల్ కేట్ కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాము.

విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310 బైక్

TVS కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో తన అపాచీ సిరీస్ యొక్క అన్ని బైకుల ధరను పెంచింది. కంపెనీ ఈ సిరీస్ బైకుల ధరలను ఏకంగా రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు పెంచారు. ఇది కంపెనీ యొక్క అతి పెద్ద ధరల పెరుగుదల అని చెప్పవచ్చు. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కంపెనీ యొక్క ముడిసరుకుల ధరల పెరుగుదల.

విడుదలకు సిద్దమవుతున్న 2021 TVS Apache RR 310 బైక్

కంపెనీ ధరలు పెంచకముందు TVS Apache RR 310 బైక్ ధర రూ. 2,49,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద విక్రయించబడింది. కానీ ఇప్పుడు ధరల పెరుగుదల తర్వాత ఈ బైక్ ధర ఏకంగా రూ. 2,54,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) చేరింది. ధరల పెరుగుదల కంపెనీ యొక్క అమ్మకాలపైన ప్రభావం అవకాశం ఉంటుంది. అయితే కొత్త 2021 TVS Apache RR 310 బైక్ విడుదల కంపెనీ యొక్క అమ్మకాలకు బాగా దోహదపడుతుందని భావిస్తున్నారు.దేశీయ మార్కెట్లో ఈ బైక్ విడుదలైన తర్వాత చాలా మోడళ్లకు సరైన ప్రత్యర్థిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
New 2021 tvs apache rr 310 to be launched on 30 august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X