రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

ప్రపంచ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు ఆధునిక ఫీచర్స్ తో విడుదలవుతున్నాయి. అయితే బైకుల విషయంలో మాత్రం సాధారణ బైకులకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఆఫ్ రోడ్ వాహనాలకు కూడా అంత డిమాండ్ ఏర్పడుతుంది. ఇందులో భాగంగానే చాలా కంపెనీలు కొత్త ఆఫ్ రోడ్ టూ వీలర్స్ విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటాలియన్ టూ-వీలర్ కంపెనీ అయిన డుకాటి (Ducati) కొత్త తరం 2022 DesertX మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

నివేదికల ప్రకారం డుకాటి ఈ కొత్త బైకును 2022 డిసెంబర్ 9న దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా టవర్‌లో జరిగిన ప్రపంచ ప్రీమియర్‌లో ఆవిష్కరించింది. ఈ బైక్ ఆధునిక డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఎలాంటి రహదారిలో అయినా రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

2022 DesertX మోటార్‌సైకిల్‌ అన్ని రకాల భూభాగాలను అధిగమించే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా, సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మంచి సామర్థ్యం అందిస్తుంది. కావున వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

డుకాటి యొక్క కొత్త డెసర్ట్‌ఎక్స్ బైక్ వాటర్-కూల్డ్ 937 సిసి డెస్‌మోడ్రోమిక్ 11° టెస్టాస్ట్రెట్టా ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్ మరియు 92 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ బైక్ మొత్తం 6 రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో రెండు మాత్రం ప్రత్యేకంగా స్పెషల్ ఆఫ్ రోడింగ్ కోసం అంకితం చేయబడ్డాయి. కావున ఇవి ఆఫ్ రోడింగ్ ప్రియులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

డెసర్ట్‌ఎక్స్ బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వీలీ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, క్విక్‌షిఫ్టర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక రైడర్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డెసర్ట్‌ఎక్స్‌లోని ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్ అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నదని కంపెనీ పేర్కొంది.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

అంతే కాకూండా, ఇందులో హై-రిజల్యూషన్ 5-ఇంచెస్ కలర్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది ఈ బైక్‌లో నిలువుగా అమర్చబడి ఉంటుంది. కావున నిలబడి ఉన్న రైడర్లకు కూడా ఉత్తమ దృశ్యమానతను అందిస్తుంది. ఇందులో మల్టీమీడియా సిస్టమ్ కూడా ఉంది, ఇది బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ పరికరాన్ని బైక్‌కి కనెక్ట్ చేయడంతో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను యాక్టివేట్ చేయడానికి రైడర్‌ని అనుమతిస్తుంది. కావున ఇది రైడింగ్ సమయంలో చాలా ఉత్తమంగా ఉంటుంది.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

ఇదిలా ఉండగా డుకాటి కంపెనీ గత నెలలోనే పానిగల్ వి4 ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్‌ను భారతదేశంలో రూ. 36 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేశారు. కంపెనీ భారతదేశంలోని అన్ని అధీకృత డీలర్‌షిప్‌లలో కొత్త పానిగల్ వి4 బుకింగ్‌లను ప్రారంభించింది. కావున కొనుగోలు చేయాలనుకునే వారు బుక్ చేసుకోవచ్చు.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త డుకాటి పానిగల్ వి4 SP దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే ఎక్కువ రేస్ ట్యూన్డ్ మరియు పెర్ఫార్మెన్స్ బేస్డ్ స్పోర్ట్స్ బైక్. స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా కంపెనీ ఇందులో మరిన్ని ఫీచర్లను అందించింది. ఇది మాట్ బ్లాక్ పెయింటెడ్ ఫెయిరింగ్‌లు, మార్చేసిని ఫోర్జ్డ్ మెగ్నీషియం వీల్స్, బ్రష్డ్ అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్‌పై రెడ్ కలర్స్ పొందుతుంది.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

బైక్‌కు కార్బన్ ఫ్రంట్ మడ్‌గార్డ్‌లు మరియు బిల్లెట్ అల్యూమినియంలో అడ్జస్టబుల్ రైడర్ ఫుట్‌పెగ్‌లు ఉన్నాయి, వీటిని రైడర్ ఇష్టపడే స్థానం ప్రకారం సెట్ చేయవచ్చు. ఇది ఓపెన్ కార్బన్ క్లచ్ కవర్, లైసెన్స్ ప్లేట్ హోల్డర్ మరియు మిర్రర్ రిమూవల్ క్యాప్, డుకాటి డేటా ఎనలైజర్ ప్లస్, GPS మాడ్యూల్‌తో కూడిన టెలిమెట్రీ కిట్ వంటి అనేక ట్రాక్ డేస్ ఓరియెంటెడ్ యాక్సెసరీలను పొందుతుంది.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

కొత్త డుకాటి పానిగల్ వి4 SP బైక్ 1,103 సిసి డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్‌తో శక్తిని పొందింది. ఈ ఇంజన్ గరిష్టంగా 13,000 ఆర్‌పిఎమ్ వద్ద 214 బిహెచ్‌పి పవర్ మరియు 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 12.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

రైడర్ల మనసు దోచే కొత్త Ducati DesertX.. త్వరలో రానుంది: డిజైన్ & ఫీచర్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

డుకాటి కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త 2022 DesertX బైక్ కి సంబంధిన ధర వంటి సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే దీనికి సంబంధించిన సమాచారం త్వరలో తెలుస్తుంది. అయితే ఇది మార్కెట్లో విడుదలైన తరువాత ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
New ducati desertx unveiled engine features specifications details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X