Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 17 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఇప్పుడు సరికొత్త 'ఫారెస్ట్ గ్రీన్' కలర్‌లో..
భారత ప్రీమియం మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న ఐకానిక్ బుల్లెట్ 350 మోడల్‌లో కంపెనీ ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మోటార్‌సైకిల్‌ను ఇప్పుడు కొత్తగా 'ఫారెస్ట్ గ్రీన్' అనే కలర్‌లో అందిస్తున్నారు. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఫారెస్ట్ గ్రీన్ వేరియంట్ ధర రూ.1.33 లక్షలు, ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 లోని కొత్త ఫారెస్ట్ గ్రీన్ పెయింట్ స్కీమ్ స్టాండర్డ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ బ్లాక్, ఒనిక్స్ బ్లాక్ మరియు బుల్లెట్ సిల్వర్ అనే మూడు ఇతర రంగులలో కూడా లభిస్తుంది. కొత్త కలర్ ఆప్షన్ చేరికతో ఇందులోని కలర్ ఆప్షన్ల సంఖ్య నాలుగుకి చేరుకుంది.

అయితే, ఈ మోడల్‌లోని బుల్లెట్ ఈఎస్ (ఎలక్ట్రిక్ స్టార్ట్) వేరియంట్‌లో మాత్రం ఈ కొత్త ఫారెస్ట్ గ్రీన్ పెయింట్ స్కీమ్ లభించదు. ఇది రెడ్, బ్లూ మరియు బ్లాక్ కలర్లలో మాత్రమే లభిస్తుంది.
MOST READ:2021 కేంద్ర బడ్జెట్‌లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు

ఈ స్టాండర్డ్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350లో కొత్తగా ‘ఫారెస్ట్ గ్రీన్' పెయింట్ స్కీమ్‌ను చేర్చడం మినహా, ఈ మోటార్‌సైకిల్‌లో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. ఇందులో ఇంజన్ పరంగా కూడా ఏ మార్పులు లేవు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తున్న మోటార్‌సైకిళ్లలో బుల్లెట్ 350 మోడల్‌కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది చాలా కాలంగా మార్కెట్లో ఉన్న మరియు అత్యంత అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది.
MOST READ:పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలంటే, ఇలా చేయండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్‌లో గతేడాది ఆరంభంలో బిఎస్-6 ఇంజన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులోని 346సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 19.1 బిహెచ్‌పి పవర్‌ను మరియు 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

బుల్లెట్ 350 బైక్‌లోని ఇతర మెకానికల్స్‌ను పరిశీలిస్తే, దీని ముందు భాగంలో 35 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగంలో 280 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 153 మిమీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇది సింగిల్-ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.
MOST READ:ఒకప్పుడు చరిత్ర సృష్టించిన జాగ్వార్ సి-టైప్, మళ్ళీ రానుందా..?

ఈ మోటార్‌సైకిల్ ముందు మరియు వెనుక వైపు ఒకే పరిమాణంతో కూడిన 19-ఇంచ్ టైర్లు ఉంటాయి. దీని మొత్తం బరువు 186 కిలోలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ 13.5-లీటర్ ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. దీని సీట్ ఎత్తు 800 మి.మీ.గా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం భారత మార్కెట్లో తమ ప్రోడక్ట్ లైనప్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిలో ఉంది. ఇటీవలే కంపెనీ థండర్‌బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త మీటియోర్ 350 మోడల్‌ను ప్రవేశపెట్టింది. త్వరలోనే మరిన్ని మోడళ్లను కంపెనీ అప్‌గ్రేడ్ చేయనుంది.
MOST READ:కొత్త టాటా సఫారి ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వచ్చేసింది.. ఓ లుక్కేసెయ్యండి

వీటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మరియు కంపెనీ 650సీసీ ట్విన్ మోటార్‌సైకిళ్లు కూడా ఉన్నాయి. కొత్త 2021 హిమాలయన్ మోటార్‌సైకిల్ కాస్మెటిక్ మరియు మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. కొత్త 650సీసీ మోడళ్లలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొత్త అల్లాయ్ వీల్స్ అందుబాటులోకి రానున్నాయి.