2021 Royal Enfield Classic 350 వీడియో.. ఇప్పుడు మీకోసం

2009 లో మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన Royal Enfield Classic బైక్, కొనుగోలుదారుల కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ కాలంలోనే ఈ కంపెనీ బైక్ తయారీదారులలోనే ఒక తిరుగులేని బ్రాండ్ గా నిలిచింది. మొదటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నప్పటికీ, కంపెనీ యొక్క క్లాసిక్ బైక్ కొంత పాతది అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కావున కంపెనీ తరువాత దశలో కొత్త Royal Enfield Meteor 350 బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Royal Enfield Classic 350 ధర రూ. 1.84 లక్షలు.

ఇటీవల ఈ కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ రైడ్ చేసాము. 2021 Royal Enfield Classic 350 యొక్క ఫీచర్స్, పరికరాలు మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి వాటిని గురించి మాత్రమే కాకుండా ఇందులోని అప్డేట్స్ వంటి విషయాలను గురించి మరింత సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

Classic 350 బైక్ రౌండ్ హెడ్‌లైట్ మరియు రెండు సైడ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రౌండ్ టిఎఫ్‌టి స్క్రీన్, స్పీడోమీటర్ క్రింద చిన్న ఎల్‌ఇడి స్క్రీన్‌ వంటివి కలిగి ఉంటుంది. అయితే ఇందులోని హెడ్‌లైట్, టైల్ లైట్ మరియు ఇండికేటర్‌ వంటివాటితో హాలోజన్ బల్బులు ఉపయోగించబడ్డాయి.

కొత్త బైక్ మునుపటికంటే కూడా అద్భుతమైన మరిన్ని కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ క్రోమ్ రెడ్, డార్క్ స్టీల్త్ బ్లాక్, సిగ్నెల్స్ మార్స్ గ్రే, హాల్సియన్ గ్రీన్ మరియు రెడ్డిచ్ గ్రీన్ మొదలైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

కొత్త Classic 350 బైక్‌ 13-లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఒక లీటరుకు 36 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కావున ఒక ఫుల్ ట్యాంక్ తో ఈ బైక్ 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు మునుపటి కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త 2021 Royal Enfield Classic 350 బైక్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

కొత్త Royal Enfield Classic 350 బైక్ Honda Highness CB350, Jawa వంటి వాటికి మాత్రమే కాకుండా Royal Enfield Meteor 350 కి కూడా ప్రత్యర్దిగా ఉంటుంది. ఈ కొత్త బైక్ దాని ప్రత్యర్థులకంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. అయితే దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ఎలాంటి అమ్మకాలను నమోదు చేస్తుందో త్వరలో తెలుస్తుంది. కొత్త 2021 Royal Enfield Classic 350 గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2021 Royal Enfield Classic 350 వీడియో

Most Read Articles

English summary
New royal enfield classic 350 first ride review video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X