భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

జపాన్‌కి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle) అనేక ఊహాగానాల తర్వాత ఎట్టకేలకు భారత మార్కెట్లో తమ సరికొత్త స్పోర్టీ స్కూటర్ 'సుజుకి అవెనిస్' (Suzuki Avenis) ను విడుదల చేసింది. దేశీయ విపణిలో సుజుకి అవెనిస్ స్పోర్టీ స్కూటర్ ప్రారంభ ధర రూ. 86,700 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది ఈ విభాగంలో టీవీఎస్ ఎన్‌టార్క్ మరియు హోండా డియో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

సుజుకి అవెనిస్ (Suzuki Avenis) మోటార్‌‌సైకిల్ ను కంపెనీ ప్రత్యేకించి స్పోర్టీనెస్ ను కోరుకునే నేటి యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయబడింది. తక్కువ బ్యాడీ ప్యానెల్స్, డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్, స్పోర్టీ గ్రాఫిక్స్ మరియు ఏరోడైనమిక్స్ తో ఇది చూపరులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, ఈ చిన్న స్కూటర్ చాలా తేలికగా ఉంటుంది. ఈ స్కూటర్ బరువురు కేవలం 106 కిలోలు మాత్రమే ఉంటుంది.

భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తమ అవెనిస్ స్కూటర్ విడుదలతో కస్టమర్లను సర్‌ప్రైజ్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ లేటెస్ట్ స్కూటర్ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా అధునాతన స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. సుజుకి ఇందుకోసం ఓ ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ యాప్ ను కూడా డిజైన్ చేసింది. ఇది కాలర్ ID, SMS అలర్ట్, WhatsApp అలర్ట్, హైస్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ స్థాయి డిస్‌ప్లే వంటి మరెన్నో ఫీచర్లను అందిస్తుంది.

భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

సుజుకి అవెనిస్ అండ్రాయిడ్ మరియు యాపిల్ ఫోన్ యూజర్ల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ యాప్ ను ఆయా ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఈ స్కూటర్‌లో బాడీ మౌంటెడ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ కవర్, అల్లాయ్ వీల్స్, క్యాచీ గ్రాఫిక్స్, సైడ్ స్టాండ్ లాక్, ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ లగేజ్ హుక్స్, ఫ్రంట్ రాక్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అవెనిస్ కోసం కొత్త ఎక్స్‌టర్నల్ హింజ్ టైప్ ఫ్యూయల్ క్యాప్‌ను కూడా పరిచయం చేసింది. కొత్త Suzuki Avenis FI (ఫ్యూయెల్ ఇంజెక్షన్) టెక్నాలజీతో కూడిన 125 సిసి ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 పిఎస్ ల శక్తిని మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10 ఎమ్ఎమ్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

మార్కెట్లో ఈ స్కూటర్ ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి.

 • సుజుకి అవెనిస్ - మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే / మెటాలిక్ లష్ గ్రీన్: రూ. 86,700
 • సుజుకి అవెనిస్ - పెర్ల్ బ్లేజ్ ఆరెంజ్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్: రూ. 86,700
 • సుజుకి అవెనిస్ - మెటాలిక్ మ్యాట్ బ్లాక్ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్: రూ. 86,700
 • సుజుకి అవెనిస్ - పెర్ల్ మిరాజ్ వైట్ / మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే: రూ. 86,700
 • సుజుకి అవెనిస్ - మెటాలిక్ ట్రిటాన్ బ్లూ (రేస్ ఎడిషన్): రూ. 87,000 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
 • భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  ఫీచర్ల పరంగా, సుజుకి అవెనిస్ స్కూటర్ యాక్సెస్ 125 మరియు బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 స్కూటర్ల యొక్క కనెక్ట్ చేయబడిన వేరియంట్‌ల మాదిరిగానే ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతుంది. ఈ డిస్‌ప్లే బ్లూటూత్ కనెక్టివిటీతో ప్రారంభించబడింది, ఇది కాల్/మెసేజ్‌ల అలర్ట్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్‌లను అందిస్తుంది.

  భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  ఈ స్కూటర్ లో మెటాలిక్ ట్రిటాన్ బ్లూ అనేది రేస్ ఎడిషన్ గా లభిస్తుంది. ఇది ప్రత్యేకమైన సుజుకి బ్రాండ్ రేసింగ్ ఇన్‌స్పైర్డ్ గ్రాఫిక్స్ ను కలిగి ఉంటుంది. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా డిసెంబర్ మధ్య తర్వాత సుజుకి అవెనిస్ రిటైల్‌ను ప్రారంభించనుంది. అయితే, కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు సుజుకి మోటార్‌సైకిల్ డీలర్‌షిప్ ల నుండి కానీ లేదా అధీకృత డీలర్‌షిప్ ల నుండి కానీ బుక్ చేసుకోవచ్చు.

  భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  ఈ స్కూటర్ విడుదల సందర్భంగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా మాట్లాడుతూ.. సుజుకి టూ-వీలర్ కస్టమర్‌లు సుజుకి యాక్సెస్ 125 మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్కూటర్ల పట్ల చూపిన విశ్వాసం మరియు విధేయత ఎల్లప్పుడూ అఖండమైనదని, సుజుకి ఉత్పత్తులపై తమ కస్టమర్ లు చూపిస్తున్న ఈ నమ్మకంతో సంపూర్ణంగా మిళితం చేయగల సరికొత్త మోడళ్లను అభివృద్ధి చేయడానికి తను ప్రోత్సహిస్తోందని అన్నారు.

  భారత మార్కెట్లో Suzuki Avenis స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  మా Gen Z (జనరేషన్ జి) కస్టమర్ ల అవసరాలతో జపాన్ మరియు భారతదేశంలోని తమ బృందాలు కొత్త తరం అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు గుప్త కస్టమర్ అంచనాలను నెరవేర్చగల కొత్త ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. సుజుకి అవెనిస్ ఈ విభాగంలో Honda Dio, TVS Ntorq మరియు Yamaha RayZR వంటి స్పోర్టీ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
New suzuki avenis 125 launched in india price engine features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X