Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రపంచవ్యాప్తంగా 2021 స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ బైక్ ఆవిష్కరించిన ట్రయంఫ్; వివరాలు
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 2021 స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. కొత్త (2021) ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ కాస్మెటిక్ మరియు మెకానికల్ అప్డేట్స్ మాత్రమే కాకుండా కొత్త ఫీచర్స్ మరియు పరికరాలతో వస్తాయి.

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ యొక్క 2021 స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ మోటార్‌సైకిల్ భారతదేశంలో ఒకసారి లాంచ్ అయిన తర్వాత, బ్రాండ్ యొక్క ప్రధాన రోడ్‌స్టర్‌గా నిలువనుంది. ఇది ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్ పైన ఉంచబడింది. ఈ ఇది ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్ బైక్ గత సంవత్సరం దేశీయ మార్కెట్లోకి అమ్మకాలకు వచ్చింది.

కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ బైక్ ముఞ్చి స్టైలిష్ డిజైన్ కలిగి ఉండటమే కాకుండా మినిమమ్ బాడీవర్క్ మరియు ఎక్స్‌పోజ్డ్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఇందులో ఉన్న స్కల్ప్డ్ ఫ్యూయల్ ట్యాంక్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో డ్యూయల్ హెడ్‌ల్యాంప్ యూనిట్లు, షార్ప్ బెల్లీ పాన్, కార్బన్-ఫైబర్ ఫ్రంట్ ఫెండర్, రియర్ సీట్ కౌల్ మరియు ఎల్‌ఈడీ టైల్లైట్స్‌తో కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ ద్వారా స్పోర్ట్స్ లుక్ మరింత మెరుగుపడుతుంది.
MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

మోటారుసైకిల్ సరికొత్త అల్యూమినియం చాసిస్ ఉపయోగించి నిర్మించబడింది. కావున ఇది పాత మోడల్ కంటే 10 కేజీల తక్కువ బరువు కలిగి ఉంటుంది. కావున 2021 ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ బరువు ఇప్పుడు 198 కిలోలు మాత్రమే.

కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ బైకులో పుల్లీ ఎల్‌ఈడీ లైటింగ్‌తో పాటు ఇతర ఫీచర్లతో వస్తుంది. ఇందులో 5 ఇంచెస్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్విచ్ గేర్, కీలెస్ ఇగ్నీషియన్, ఇంటిగ్రేటెడ్ గోప్రో కంట్రోల్స్ మరియు మైట్రయంఫ్ కనెక్టివిటీ టెక్నాలజీ వంటివి ఇందులో ఉన్నాయి.
MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

కొత్త 2021 ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ బైక్ సరికొత్త 1160 సిసి త్రీ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 178 బిహెచ్‌పి మరియు 9000 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. బై డైరెక్షనల్ క్విక్ స్విఫ్టర్ కూడా ఇందులో ఉంటుంది.

కొత్త స్పీడ్ ట్రిపుల్ దాని మునుపటి మోడల్‌తో పోలిస్తే 30 బిహెచ్‌పి మరియు 8 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్ చేస్తుంది. కొత్త ఇంజన్ 7 కిలోగ్రాముల తేలికైనదిగా ఉంటుంది.
MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

2021 స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టాప్-స్పెక్ ఓహ్లిన్స్ ఎన్ఐఎక్స్30 USD ఫోర్కులు మరియు వెనుక వైపున ఓహ్లిన్స్ టిటిఎక్స్36 మోనోషాక్ సెటప్ కలిగి ఉంటుంది. ముందు మరియు వెనుక సస్పెన్షన్ రెండూ ప్రీలోడ్, రీబౌండ్ మరియు డంపింగ్ కోసం పూర్తిగా అడ్జస్ట్ చేయబడతాయి.

ఈ బైక్ యొక్క మోటారుసైకిల్ యొక్క బ్రేకింగ్ సిస్టంలో, ముందు భాగంలో డ్యూయల్ 320 మిమీ డిస్క్‌లు మరియు వెనుకవైపు ఒకే 270 మిమీ డిస్క్ బ్రేకులు కలిగి ఉంటాయి. మోటారుసైకిల్ మెట్జెలర్ రేసెటెక్ ఆర్ఆర్ టైర్లతో స్టాండర్డ్ గా వస్తుంది. కొత్త స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్‌లో డ్యూయల్-ఛానల్ ఎబిఎస్, కార్నరింగ్ ఎబిఎస్, 6-యాక్సిస్ ఐఎంయు, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ మరియు 5-రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి రోడ్, రైన్, స్పోర్ట్, ట్రాక్ మరియు రైడర్ మోడ్లు.
MOST READ:బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ప్రపంచవ్యాప్తంగా తమ కొత్త స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి కొద్ది రోజుల ముందు ఆవిష్కరించింది. స్పీడ్ ట్రిపుల్ 2021 వ సంవత్సరంలో భారతదేశంలో లాంచ్ అయ్యే మొదటి ఉత్పత్తి అవుతుంది. దీని ధర రూ. 14 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని భావిస్తున్నాము.