కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు తన కొత్త 1200 సిరీస్ బైకులను విడుదల చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్త టైగర్ 1200 శ్రేణిలో టైగర్ 1200 జిటి మరియు టైగర్ 1200 ర్యాలీ ఉన్నాయి. ట్రయంఫ్ టైగర్ 1200 జిటి బైక్ రోడ్ మరియు ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం రూపొందించబడింది. అయితే టైగర్ 1200 ర్యాలీ బైక్ పూర్తిగా ఆఫ్-రోడ్ బైక్, కావున దీనిని ఆఫ్-రోడింగ్ మరియు అడ్వెంచర్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా ఉపయోగించవచ్చు.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

ట్రయంఫ్ టైగర్ 1200 జిటి బైక్ 19 ఇంచెస్ ఫ్రంట్ మరియు 18 ఇంచెస్ రియర్ టైర్‌లను పొందుతుంది. అయితే టైగర్ 1200 ర్యాలీ బైక్ మాత్రం 21 ఇంచెస్ ఫ్రంట్ మరియు 18 ఇంచెస్ రియర్ టైర్లను కలిగి ఉంటుంది. ఇవి రైడింగ్ సమయంలో వాహన వినియోగదారునికి మంచి పట్టుని అందిస్తాయి.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 రేంజ్ కొత్త 1160 సీసీ ఇంజన్‌ని పొందుతుంది. ఈ ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా శక్తివంతమైనది. ఈ ఇంజన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 బిహెచ్‌పి పవర్ మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. మొత్తానికి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా 9 బిహెచ్‌పి పవర్ ఎక్కువగా ఉంటుంది, టార్క్ కూడా ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

కంపెనీ ఇది ఎక్కువ పనితీరుని అందించడానికి ఇంజన్‌ను మెరుగుపరిచినట్లు తెలిసింది. ఈ ఈ ఇంజిన్‌లో బోర్ మరియు స్ట్రోక్ నుండి క్రాంక్, సిలిండర్ హెడ్, గేర్‌బాక్స్, క్లచ్, షాఫ్ట్ డ్రైవ్ మరియు బెవెల్ బాక్స్ కొత్తవిగానే ఉన్నాయి. కావున ఇది ఎక్కువ శక్తివంతమైనది.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

ట్రయంఫ్ టైగర్ 1200 జిటి మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్నోడోనియా వైట్, సఫైర్ బ్లాక్ మరియు లూసర్న్ బ్లూ కలర్స్. అదే విధంగా ట్రయంఫ్ టైగర్ 1200 ర్యాలీ బైక్ కూడా మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్నోడోనియా వైట్, సఫైర్ బ్లాక్ మరియు మ్యాట్ ఖాకీ కలర్స్.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

ట్రయంఫ్ టైగర్ 1200 అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది, మరియు అధునాతన పరికరాలతో కూడా నిండి ఉంటుంది. ఇందులో షోవా సెమీ-యాక్టివ్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ మై ట్రయంఫ్ కనెక్టివిటీ సిస్టమ్‌తో కూడిన 7 ఇంచెస్ TFT డిస్‌ప్లే, IMU తో ఆప్టిమైజ్ చేయబడిన కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు, ఇగ్నిషన్‌తో కూడిన కీలెస్ సిస్టమ్, స్టీరింగ్ లాక్ మరియు ఫ్యూయల్ క్యాప్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

కంపెనీ తన కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 రేంజ్ ని త్వరలో భారతీయ మార్కెట్లో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త బైక్స్ గురించి కంపెనీ ఎక్కువ సమాచారం అధికారికంగా విడుదల చేయలేదు. ఇందులో ధర వంటి విషయాలు కూడా అందుబాటులో లేదు, కావున దీని గురించి పూర్తి సమాచారం త్వరలో అందుబాటులోకి వస్తుంది.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

నివేదికల ప్రకారం కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 శ్రేణిని భారతదేశంలో రూ. 18 నుంచి రూ 21 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేయవచ్చు. భారతీయ మార్కెట్లో ఈ కొత్త 1200 రేంజ్ విడుదలైతే డుకాటి మల్టీస్ట్రాడా V4, హోండా ఆఫ్రికా ట్విన్ మరియు బిఎండబ్ల్యు ఆర్ 1250 జిఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ బైక్స్ భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత తప్పకుండా మంచి ఆదరణ పొందుతాయి.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

ఇదిలా ఉండగాట్రైయంప్ ఇటీవల విడుదల చేసిన స్ట్రీట్ ట్విన్ గోల్డ్ లైన్ ఎడిషన్ విజయం తర్వాత, ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ ఇండియా ఇప్పుడు తమ బోన్‌విల్ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ లైన్ ఎడిషన్‌లను ఆవిష్కరించింది. కొత్త ట్రైయంప్ బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్స్ లో బోన్‌విల్ టి100, స్ట్రీట్ స్క్రాంబ్లర్, బోన్‌విల్ స్పీడ్‌మాస్టర్, బోన్‌విల్ బాబర్ మరియు బోన్‌విల్ టి120 మోడళ్లు ఉన్నాయి.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు కొత్త గోల్డ్ ఎడిషన్ పెయింట్ స్కీమ్ తో అందిస్తోంది. అయితే, ఈ గోల్డ్ లైన్ ఎడిషన్ మోడళ్లు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయని, వీటి డెలివరీలు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

స్టాండర్డ్ ట్రైయంప్ బోన్‌విల్ మోడళ్లతో పోల్చుకుంటే, ఈ స్పెషల్ ఎడిషన్ బోన్‌విల్ గోల్డ్ లైన్ ఎడిషన్ మోడళ్ల ధరలు సుమారు రూ. 30,000 నుండి రూ. 40,000 వరకు ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్త గోల్డ్ లైన్ ఎడిషన్ డిజైన్‌లు రెండు రంగుల కలయికతో రూపొందించబడినట్లు ట్రైయంప్ తెలిపింది.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

ట్రైయంప్ బోన్‌విల్ టి100 గోల్డ్ లైన్ ఎడిషన్‌ లో సిల్వర్ ఫ్యూయల్ ట్యాంకులు, ముందు మరియు వెనుక మడ్‌గార్డ్‌లు మరియు ఆకుపచ్చ కలర్ ఇంధన ట్యాంక్ ఇన్‌ఫిల్‌తో కూడిన సైడ్ ప్యానెల్‌లు, హ్యాండ్-పెయింటెడ్ గోల్డ్ లైనింగ్ మరియు 'గోల్డ్ లైన్' లోగో మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

కొత్త Tiger 1200 రేంజ్ ఆవిష్కరించిన Triumph.. డిజైన్, ఫీచర్స్ & వివరాలు

కొత్త వైట్ అండ్ గోల్డ్ కలర్ బోన్‌విల్ టి100 లోగో మరియు చేతితో పెయింట్ చేయబడిన గోల్డ్ కలర్ లైనింగ్‌ను కలిగి ఉన్న సైడ్ ప్యానెల్ స్ట్రిప్ గ్రాఫిక్స్‌లో ఆకుపచ్చ రంగు కూడా కలిసి ఉంటుంది. దీని డిజైన్ ను పూర్తి చేయడానికి, ఇందులోని అనుబంధ ఫ్లై స్క్రీన్ ఇప్పుడు సరిపోలే సిల్వర్ ఐస్‌ కలర్ లో అందుబాటులో ఉంటుంది. మొత్తానికి ఈ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Most Read Articles

English summary
New triumph tiger 1200 range unveiled features specifications details
Story first published: Wednesday, December 8, 2021, 12:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X