రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్‌వి400 కోసం కంపెనీ ఓ కొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్‌ను 'స్వైప్ టు స్టార్ట్' పేరుతో పరిచయం చేశారు. ఇది కీలెస్ ఎంట్రీ ఫీచర్‌లా పనిచేస్తుంది.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

ఈ కొత్త 'స్వైప్ టు స్టార్ట్' ఫీచర్‌ను మైరివోల్ట్ స్మార్ట్‌ఫోన్ యాప్ సహాయంతో కంట్రోల్ చేయవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, మీ స్మార్ట్‌ఫోనే మీ ఎలక్ట్రిక్ బైక్ కీ మాదిరిగా పనిచేస్తుందన్నమాట. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కొత్త ఫీచర్ సెప్టెంబర్ 2021 నుండి రివోల్ట్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

ఈ కొత్త ఫీచర్ సాయంతో రివోల్ట్ ఆర్‌వి400 బైక్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి భౌతిక కీ అవసరం లేకుండానే తమ ఏఐ-ఎనేబుల్డ్ మోటార్‌సైకిల్‌ను స్టార్ట్ చేయడానికి మరియు స్టాప్ చేయడానికి అనుమతిస్తుంది. స్వైప్ టు స్టార్ట్ ఫీచర్‌తో బైక్‌ను ఆన్ చేయడానికి, యూజర్ తన ఫోన్‌లో మైరివోల్ట్ యాప్‌ను ఓపెన్ చేసి పవర్ బటన్‌ను ఎడమ నుండి కుడి వైపుకి స్లైడ్ చేయాలి.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు కీ లేకుండా బైక్‌ను కంట్రోల్ చేయవచ్చు. అంతే కాకుకండా, వారు ఈ బైక్‌లోని ఇతర ఫీచర్‌లను కూడా రిమోట్‌గా యాక్సెస్ చేయవచ్చు. వీటిలో బైక్‌ను లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం మరియు అప్లికేషన్ ద్వారా వారి బైక్‌ను గుర్తించడం మొదలైనవి ఉన్నాయి.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

ఈ ఫీచర్‌ గురించి రివోల్ట్ మోటార్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ మాట్లాడుతూ, "తాజా ఆవిష్కరణలు మరియు సాంకేతికతను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడంలో రివోల్ట్ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉందని, ఇందులో భాగంగానే, కొత్త స్వైప్ టు స్టార్ట్ ఫీచర్‌ని ప్రవేశపెట్టడం తమకెంతో సంతోషంగా ఉందని, ఇది వినియోగదారుల స్వేచ్ఛను పునరుద్ధరిస్తుందని" అన్నారు.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

భారీగా తగ్గిన రివోల్ట్ ఆర్‌వి400 బైక్ ధర

ఇదిలా ఉంటే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేమ్ ( ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) II ప్రాజెక్టులో భాగంగా, ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలలో ఇటీవల చేసిన సవరణల నేపథ్యంలో రివోల్ట్ ఆర్‌వి400 బైక్ ధరలు భారీగా తగ్గాయి.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

రివాల్ట్ ఇంటెలికార్ప్ అందిస్తున్న ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర‌ను కంపెనీ రూ.28,200 మేర తగ్గింది. తాజా ధరల తగ్గింపు అనంతరం, రివాల్ట్ ఆర్‌వి400 బైక్ ధర రూ.90,799 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ ఆర్‌వి300 ఎలక్ట్రిక్ బైక్‌పై కంపెనీ ఇప్పటి వరకూ ఎలాంటి తగ్గింపును ప్రకటించలేదు.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

రివోల్ట్ ఆర్‌వి400 పవర్‌ట్రైన్:

రివాల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్‌లో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్‌పై 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

రివోల్ట్ ఆర్‌వి400 మెకానికల్స్ మరియు ఫీచర్స్:

రివోల్ట్ ఆర్‌వి400 బైక్‌లో ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇరు చక్రాలపై 240 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

ఇంకా ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ (ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్), మైరివోల్ట్ మొబైల్ యాప్ కనెక్టివిటీ, జియోఫెన్సింగ్, కస్టమైజ్డ్ ఎగ్జాస్ట్ సౌండ్స్, బైక్ డయాగ్నస్టిక్స్, బ్యాటరీ స్టేటస్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్-ల్యాంప్‌లు మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

రివోల్ట్ ఆర్‌వి400 బైక్ స్వైప్ టు స్టార్ట్ ఫీచర్.. ఇక ఫోన్‌తోనే బైక్ ఆన్/ఆఫ్..

రివాల్ట్ ఆర్‌వి300 రెబెల్ రెడ్ మరియు కాస్మిక్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్లగ్-ఇన్ ఛార్జింగ్, రిమూవబల్ బ్యాటరీ, బ్యాటరీ రీప్లేస్‌మెంట్ స్టేషన్ లేదా బ్యాటరీ యొక్క హోమ్ డెలివరీ వంటి సేవలను కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం అందిస్తోంది. ప్రస్తుతం రివాల్ట్ ఇ-బైక్స్ ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ నగరాల్లో మాత్రమే లభిస్తున్నాయి.

Most Read Articles

English summary
Revolt motors introduces swipe to start keyless entry feature for rv400 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X