మీరు ఎంత CO2 ఆదా చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే MyRevolt యాప్ అప్‌డేట్ మీకోసమే..!

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'రివోల్ట్ మోటార్స్' (Revolt Motors) తమ కస్టమర్‌ల కోసం మైరివోల్ట్ (MyRevolt) యాప్‌లో ఒక ప్రధాన అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా కస్టమర్లు ఇప్పుడు తాము ఎంత మొత్తం కార్బన్ ఉద్గారాలను ఆదా చేస్తున్నారో తెలుసుకోవచ్చు. కస్టమర్‌లు MyRevolt యాప్‌లో My Rides ట్యాబ్‌ను క్లిక్ చేయడం ద్వారా తాము ఇంతవరకు ఆదా చేసిన ఇంధనం మరియు కార్బన్ ఉద్గారాల మొత్తాన్ని చూడవచ్చు.

మీరు ఎంత CO2 ఆదా చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే MyRevolt యాప్ అప్‌డేట్ మీకోసమే..!

ఈ యాప్ కస్టమర్‌లకు కవర్ చేసిన కిలోమీటర్ల సమాచారాన్ని అందించడమే కాకుండా రైడ్ సమయంలో ఇంధన వినియోగం మరియు CO2 ఉద్గారాల గురించి కూడా సమాచారాన్ని అందిస్తుంది. ఈ అప్‌డేట్ సహాయంతో, మీరు ఇప్పుడు ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) మోటార్‌సైకిళ్లు విడుదల చేసే CO2 ఉద్గారాలతో పోలిస్తే ఎంత తక్కువ ఉద్గారాల ఆదా చేశారనే సమాచారాన్ని చూడవచ్చు. అదే సమయంలో, ఈ కార్బన్ పొదుపు తాము ఎన్ని చెట్లను నాటిన దానితో సమానం అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.

మీరు ఎంత CO2 ఆదా చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే MyRevolt యాప్ అప్‌డేట్ మీకోసమే..!

రివోల్ట్ మోటార్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. వీటిలో రివోల్ట్ ఆర్‌వి300 మరియు రెండవది రివోల్ట్ ఆర్‌వి400. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ సాయంతో కనెక్ట్ చేసుకొని వివిధ రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం వారు ప్లేస్టోర్ నుండి MyRevolt అనే యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ మరియు యాపిల్ ఐస్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.

మీరు ఎంత CO2 ఆదా చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే MyRevolt యాప్ అప్‌డేట్ మీకోసమే..!

ఈ యాప్‌లో కొత్తగా ప్రవేశపెట్టబడిన అప్‌డేట్ ద్వారా, కస్టమర్‌లు చేస్తున్న కార్బన్ ఉద్గారాల పొదుపు గురించి వారికి అవగాహన కల్పించాలని కంపెనీ కోరుకుంటుంది, తద్వారా ఎక్కువ మంది ప్రజలు ఎలక్ట్రిక్ బైక్‌లను స్వీకరించడానికి ప్రేరేపించేలా చేయాలని యోచిస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో, రివోల్ట్ మోటార్స్ దేశంలో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు, కస్టమర్లకు మరింత చేరవయ్యేందుకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ లను ప్రవేశపెడుతోంది.

మీరు ఎంత CO2 ఆదా చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే MyRevolt యాప్ అప్‌డేట్ మీకోసమే..!

రివోల్ట్ మోటార్స్ కిపెరుగుతున్న కస్టమర్ డిమాండ్ కారణంగా కంపెనీ వేగంగా కొత్త నగరాల్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా, దేశంలోని మరిన్ని కొత్త నగరాల్లో కంపెనీ తమ డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. చండీగఢ్, లక్నో మరియు ఎన్‌సిఆర్ సహా 50 కి పైగా కొత్త నగరాల్లో సేల్స్ మరియు సర్వీస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి కంపెనీ ఈ లక్ష్యాన్ని సాధించాలని చూస్తోంది.

మీరు ఎంత CO2 ఆదా చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే MyRevolt యాప్ అప్‌డేట్ మీకోసమే..!

కంపెనీ ఈ నెల ప్రారంభంలో, తన కొత్త షోరూమ్‌లను కోల్‌కతా మరియు మదురై నగరాల్లో ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కంపెనీ డీలర్‌షిప్ ల నుండి మరియు అధికారిక వెబ్‌సైట్‌ నుండి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ తమ పాపులర్ రివోల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్‌ కోసం బుకింగ్స్ ప్రారంభించినప్పుడల్లా, అది కొద్దిసేపటికే పూర్తిగా అమ్ముడైపోతోంది. ఈ నేపథ్యంలో, తమ కస్టమర్‌లకు కాంటాక్ట్‌లెస్ అనుభవాన్ని అందించడానికి కంపెనీ AI అసిస్టెన్స్ కూడా తీసుకుంటోంది.

మీరు ఎంత CO2 ఆదా చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే MyRevolt యాప్ అప్‌డేట్ మీకోసమే..!

ఇక రివోల్ట్ ఆర్‌వి400 (Revolt RV400) ఎలక్ట్రిక్ బైక్ విషయానికి వస్తే, కంపెనీ ఈ బైక్‌లో 5kW ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించింది. ఇందులో 3.24 kWh స్వాప్ చేయగల బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది మూడు రకాల రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది, అవి - ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్స్. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది. రివోల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్‌లో చాలా శక్తివంతమైన బ్యాటరీ అందుబాటులో ఉంది. పూర్తి ఛార్జ్ పై ఇది గరిష్టంగా 156 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు.

మీరు ఎంత CO2 ఆదా చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే MyRevolt యాప్ అప్‌డేట్ మీకోసమే..!

ఈ ఎలక్ట్రిక్ బైక్ లోని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో రివోల్ట్ మోటార్స్ అత్యధికంగా ఈ బైక్‌పై 1.5 లక్షల కి.మీ వారంటీ అందిస్తోంది. రివోల్ట్ యొక్క ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఫలితంగా, ఇవి అత్యంత ఆధునిక బైక్‌లుగా ఉంటాయి. ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఇగ్నిషన్ మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మరెన్నో ఫీచర్లు ఈ బైక్ లలో లభిస్తాయి.

మీరు ఎంత CO2 ఆదా చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే MyRevolt యాప్ అప్‌డేట్ మీకోసమే..!

రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ను మైరివోల్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీని సాయంతో జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రియల్ టైమ్ పొజిషనింగ్ మరియు బ్యాటరీ హెల్త్ వంటి మరెన్నో విషయాల గురించి రిమోట్ గానే తెలుసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం అందిస్తున్న ఫేమ్ 2 సబ్సిడీ కారణంగా, రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర సుమారు రూ.28,000 వరకూ తగ్గింది. దీనితో పాటు, అనేక రాష్ట్రాల్లో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఫలితంగా, దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Revolt motors updates myrevolt app now riders can able to get carbon savings details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X