రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేమ్ ( ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) II ప్రాజెక్టులో భాగంగా, ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలలో ఇటీవల సవరణలు చేశారు.

రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

ఈ నేపథ్యంలో, భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా, ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రివాల్ట్ ఇంటెలికార్ప్ అందిస్తున్న ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర భారీగా తగ్గింది. ఈ మోడల్‌పై ఇప్పుడు అదనంగా రూ.28,200 మేర ధర తగ్గింది.

రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

తాజా ధరల తగ్గింపు అనంతరం, రివాల్ట్ ఇంటెలికార్ప్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన రివాల్ట్ ఆర్‌వి400 బైక్ ధర రూ.90,799 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ ఆర్‌వి300 ఎలక్ట్రిక్ బైక్‌పై కంపెనీ ఇప్పటి వరకూ ఎలాంటి తగ్గింపును ప్రకటించలేదు.

రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

ఇదిలా ఉంటే, రివాల్ట్ ఇంటెలికార్ప్ అందిస్తున్న ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల కోసం బుకింగ్‌లను తిరిగి ప్రారంభిస్తున్నామని కంపెనీ తెలిపింది. కస్టమర్లు జూన్ 18, 2021వ తేదీ నుండి ఈ బైక్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ మోడళ్ల కోసం బుకింగ్ అమౌంట్‌ను వరుసగా రూ.7,199 మరియు రూ.7,999 గా నిర్ణయించారు.

రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

ప్రస్తుతం రివాల్ట్ ఇ-బైక్స్ ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ నగరాల్లో మాత్రమే లభిస్తున్నాయి. ఈ నగరాల్లో శుక్రవారం నుండి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. గతంలో ఈ మోడళ్ల కోసం భారీ బుకింగ్స్ వచ్చిన నేపథ్యంలో, కంపెనీ గత కొంత కాలంగా ఈ మోడళ్ల కోసం బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసినదే.

రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

రివాల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఫేమ్ II ప్రోత్సాహకాల సవరణకు ముందు మార్కెట్లో ఈ బైక్ ధర రూ.1.19 లక్షలుగా ఉండేది. ధరల సవరణ అనంతరం దీని ధరలు రూ.90,799 కి దిగొచ్చింది. ఇకపోతే, ప్రస్తుతం మార్కెట్లో ఆర్‌వి300 బైక్ ధర రూ.95,000 గా ఉంది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

రివాల్ట్ ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్‌లో 3.0 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్‌పై 156 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది.

రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

రివాల్ట్ ఆర్‌వి300 ఎలక్ట్రిక్ బైక్‌లో 1.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది 2.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్‌పై ఎకో మోడ్‌లో 180 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ గరిష్టంగా గంటకు 65 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. కాకపోతే, ఎకో మోడ్‌లో దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ మాత్రమే.

రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

రివాల్ట్ ఆర్‌వి300 మరియు ఆర్‌వి400 రెండు మోడళ్లలో కూడా సిటీ, ఎకో మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. వీటి ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇరు చక్రాలపై 240 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తాయి.

రూ.28,200 తగ్గిన రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర; జూన్ 18 నుండి బుకింగ్స్ రీఓపెన్

రివాల్ట్ ఆర్‌వి300 నియోన్ బ్లాక్ మరియు స్మోకీ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రివాల్ట్ ఆర్‌వి300 మాత్రం రెబెల్ రెడ్ మరియు కాస్మిక్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్లగ్-ఇన్ ఛార్జింగ్, రిమూవబల్ బ్యాటరీ, బ్యాటరీ రీప్లేస్‌మెంట్ స్టేషన్ లేదా బ్యాటరీ యొక్క హోమ్ డెలివరీ వంటి సేవలను కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం అందిస్తోంది.

Most Read Articles

English summary
Revolt RV400 Prices Dropped By Rs 28,200, After FAME II Incentive Revision. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X