ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి రివాల్ట్ మోటార్స్‌ (Revolt Motors). కంపెనీ దేశీయ మార్కెట్లో తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది, ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు కంపెనీ ఈ నవంబర్ నెలలో మొత్తం 5 కొత్త నగరాల్లో తన డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) అక్టోబర్ నెలలో 3 నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. దీనితో ఇప్పటికి కంపెనీ మొత్తం 14 డీలర్‌షిప్‌లు ప్రారంభించినట్లు తెలుస్తుంది. కంపెనీ యొక్క డీలర్‌షిప్‌లు దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నెలలో Revolt Motors కలకత్తా, కోయంబత్తూర్, వైజాగ్, మదురై మరియు విజయవాడలలో మొత్తం 5 డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది.

ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

Revolt Motors అతి తక్కువ కాలంలోనే వినియోగదారుల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ తరుణంలో భాగంగానే కంపెనీ తన ఉనికిని మరింత విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే చాలా వేగంగా తన కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తోంది.

కంపెనీ కొత్త ప్రాంతాలలో కొత్త డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడం వల్ల, అమ్మకాల పెరుగుదల మాత్రమే కాకుండా, అమ్మకాల తర్వాత సర్వీస్ వంటివి చేయడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా బ్రాండ్ వాహనాలను కావాల్సిన విడిభాగాలు కంపెనీ యొక్క కొత్త డీలర్‌షిప్‌లో విక్రయించబడతాయి.

ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. ఈ కారణంగానే మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అయితే Revolt కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ బైక్‌లు అతి తక్కువ ఖర్చుతో మంచి పరిధిని అందిస్తాయి. కావున ఈ బైకులకు మంచి ఆదరణ ఉంది.

ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

Revolt కంపెనీ గత నెలలో సూరత్, జైపూర్ మరియు బెంగళూరు వంటి నగరాల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభించింది. గత నెల కంపెనీ అక్టోబర్ 21 న 70 నగరాలలో బుకింగ్ ప్రారంభించింది. ఈ కొత్త బ్యాచ్ డెలివరీని డిసెంబర్ నెలలో లేదా జనవరి నెలలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కంపెనీ అనేక నగరాలకు తన డెలివరీ టైమ్‌లైన్ గురించి కూడా సమాచారం అందించింది.

ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

Revolt కంపెనీ యొక్క RV400 బైక్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో 5kW ఎలక్ట్రిక్ మోటారును అందించింది. రివాల్ట్ RV400 బైక్ 3.24 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 72 వి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు పూర్తి ఛార్జీతో 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం 85 కిలోమీటర్లు. ఇందులోని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి నాలుగున్నర గంటలు పడుతుంది, మరియు బ్యాటరీ స్విచ్ స్టేషన్లలో మార్చుకోవచ్చు.

ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

ఈ బైక్ యొక్క బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4.5 నుండి 5 గంటల సమయం పడుతుంది. కంపెనీ ఈ బైక్ పైన 1.5 లక్షల కి.మీ వారంటీ ఇస్తోంది. రివోల్ట్ యొక్క ఈ ఎలక్ట్రిక్ బైక్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటాయి. దీని కారణంగా ఇది అత్యంత ఆధునిక బైక్‌లుగా మారింది. LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, LED టెయిల్‌ల్యాంప్‌లు, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ బటన్‌లతో కూడిన కీలెస్ ఇగ్నిషన్ మరియు Revolt RV400 మరియు RV300లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు.

ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు. జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రియల్ టైమ్ పొజిషనింగ్ మరియు బ్యాటరీ హెల్త్ ఫీచర్లను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఉపయోగించవచ్చు.

భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే అద్భుతమైన రాయితీలను కూడా అందిస్తున్నాయి. ఇప్పడు FAME-2 స్కీమ్ కింద భారత ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కారణంగా, Revolt బైక్ ధర రూ. 28,000 తగ్గింది. దీనితో పాటు, అనేక రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రవేశపెట్టారు, దీని కారణంగా ధర మరింత తగ్గుతుంది.

ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

Revolt RV400 బైక్ యొక్క ధర రూ. 90,799 (ఎక్స్-షోరూమ్) కి చేరింది. గతంలో ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,18,999. ఇదిలావుండగా, గుజరాత్ ప్రభుత్వం యొక్క కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రకారం, ఈ బైక్ ఇప్పుడు అహ్మదాబాద్‌లో కేవలం రూ. 87,000 కు అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో ఈ బైక్‌లపై సుమారు రూ.25,000 సబ్సిడీ ఇస్తుండగా, గుజరాత్‌లో ఈ బైక్ పైన సబ్సిడీ రూ. 20,000 గా ఉంది.

ఒకటి, రెండు కాదు.. ఈ నెలలో 5 డీలర్‌షిప్‌లు ప్రారంభించనున్న Revolt Motors.. ఎక్కడెక్కడో తెలుసా?

ఏది ఏమైన కంపెనీ ప్రారంభిస్తున్న ఈ కొత్త డీలర్‌షిప్‌లు తప్పకుండా ఈ బైక్ యొక్క అమ్మకాలను పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయితీలు కూడా ఈ బైక్ విక్రయాలను మరింత పెంచుతాయని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Revolts motors to open new 5 dealership in november details
Story first published: Tuesday, November 2, 2021, 18:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X