కొత్త కలర్లు మరియు ఫీచర్లతో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

ప్రముఖ దేశీయ ప్రీమియం టూవీలర్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇటీవలే అప్‌డేటెడ్ 2021 హిమాలయన్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు భారత మార్కెట్లో విక్రయిస్తున్న 650సీసీ ట్విన్ బైక్స్ (కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650)లో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

కొత్త కలర్లు మరియు ఫీచర్లతో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్తగా రానున్న ఈ మోటార్‌సైకిళ్లు ప్రస్తుత వెర్షన్లతో పోల్చుకుంటే స్వల్ప మార్పుల చేర్పులతో రానున్నాయి. ఇందులో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. ఇప్పటికే ఈ కొత్త 650సిసి మోటార్‌సైకిళ్ళను భారత రోడ్లపై పరీక్షిస్తుండగా పలు సందర్భాల్లో గుర్తించడం జరిగింది.

కొత్త కలర్లు మరియు ఫీచర్లతో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

తాజాగా కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650 మోడళ్లకు సంబంధించిన ఓ డాక్యుమెంట్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. లీకైన పత్రం ప్రకారం, కొత్త వస్తున్న ఈ రెండు మోడళ్లు సరికొత్త కలర్ ఆప్షన్లలో రానున్నట్లు తెలియజేస్తుంది.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

కొత్త కలర్లు మరియు ఫీచర్లతో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

ఇందులో కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఏడు పెయింట్ స్కీమ్స్‌తో అందించబడుతుంది. వీటిలో నాలుగు కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అవి: రావిషింగ్ బ్లాక్, గ్రే గూస్, వెంచురా బ్లూ మరియు రాయల్ రెడ్. ప్రస్తుతం అందిస్తున్న బేకర్ ఎక్స్‌ప్రెస్, గ్లిట్టర్ అండ్ డస్ట్ మరియు ఆరెంజ్ క్రష్ అలాగే కొనసాగుతాయి.

కొత్త కలర్లు మరియు ఫీచర్లతో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

అదేవిధంగా, కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 మొత్తం ఐదు పెయింట్ స్కీమ్‌లలో అందించబడుతుంది. అవి: కుకీస్ అండ్ క్రీమ్, వెంచురా బ్లాక్ అండ్ బ్లూ, బ్రిటిష్ రేసింగ్ లీన్, జిటి రెడ్ మరియు మిస్టర్ క్లీన్. వీటిలో, చివరి కలర్ ఆప్షన్ మాత్రమే ప్రస్తుత మోడల్‌లో అందిస్తున్నారు, మిగిలిన నాలుగు ఆప్షన్లు పూర్తిగా కొత్తవి.

MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ రివ్యూ.. ఇది విటారా బ్రెజ్జా కంటే మంచిదా, కాదా ?

కొత్త కలర్లు మరియు ఫీచర్లతో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ మోటార్‌సైకిళ్లలో కొత్త పెయింట్ స్కీమ్స్‌తో పాటుగా ఇతర సూక్ష్మమైన మార్పులను కూడా చేసే అవకాశం ఉంది. రెండు మోడళ్ల మొత్తం రైడింగ్ డైనమిక్‌లను కంపెనీ మరింత మెరుగుపరచనుంది. ఈ మోడళ్లలో కూడా తమ సిగ్నేచర్ ట్రిప్పర్ నావిగేషన్‌ను జోడించే అవకాశం ఉంది.

కొత్త కలర్లు మరియు ఫీచర్లతో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ట్రిప్పర్ నావిగేషన్‌ సిస్టమ్‌ను తొలిసారిగా మీటియోర్ 350 మోడల్‌లో పరిచయం చేసింది. ఇటీవలే విడుదలైన కొత్త 2021 హిమాలయన్ మోడల్‌లో కూడా ఈ ఫీచర్‌ను జోడించింది. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా పనిచేసే ఈ ట్రిప్పర్ నావిగేషన్‌ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను పొందవచ్చు.

MOST READ:భారత మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ కార్స్ డిమాండ్.. కారణం ఇదే

కొత్త కలర్లు మరియు ఫీచర్లతో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

ఇంజన్ పరంగా ఈ రెండు మోడళ్లలో ఎలాంటి మార్పులు ఉండవు. కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 రెండూ కూడా ఒకేరకమైన బిఎస్ 6-కంప్లైంట్ 648 సిసి పారలల్-ట్విన్ ఇంజన్‌తో పనిచేస్తాయి.

కొత్త కలర్లు మరియు ఫీచర్లతో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ బైక్స్

ఈ ఇంజన్ గరిష్టంగా 7150 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5250 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్‌తో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోడళ్లతో పాటుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓ 650సీసీ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌పై కూడా పనిచేస్తోంది. - దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

Most Read Articles

English summary
2021 Royal Enfield 650 Twins To Get New Colour Options, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X