అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

ఇటీవల కాలంలో యువకులు మరియు పెద్దవారు సైతం ఎక్కువగా ఇష్టపడే బైక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పడు ఈ బైక్ లో వచ్చిన ఒక చిన్న సమస్య వల్ల దాదాపు 2,36,966 బైకులకు రీకాల్ ప్రకటించారు.

అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

ప్రస్తుతం ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌తో సహా మొత్తం ఏడు దేశాలలో 236,966 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను రీకాల్ చేశారు. ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియార్ 350, క్లాసిక్ 350 మరియు బుల్లెట్ 350 బైక్‌లు ఉన్నాయి.

అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

ప్రస్తుతం ఈ బైక్స్ లో ఇగ్నీషన్ కాయిల్‌లో లోపం ఉండవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ లోపం బైక్ లో ఇంజిన్ పనిచేయకపోవచ్చు లేకుంటే బైక్ యొక్క పనితీరు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతే కాదు దీని వల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది.

MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల యొక్క అంతర్గత పరీక్షను నిర్వహించినప్పుడు ఈ లోపం కనుగొనబడింది. ఈ సమస్య డిసెంబర్ 2020 మరియు ఏప్రిల్ 2021 మధ్య పంపిణీ చేయబడిన నిర్దిష్ట బ్యాచ్‌లలో ఉందని స్పష్టంగా గుర్తించబడింది.

అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియార్ 350 డిసెంబర్ 2020 మరియు ఏప్రిల్ 2021 మధ్య తయారు చేయబడింది మరియు అదే కాలంలో విక్రయించబడింది. కానీ క్లాసిక్ మరియు బుల్లెట్ 2021 జనవరి మరియు ఏప్రిల్ మధ్య తయారు చేయబడి విక్రయించబడుతోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ కాలంలో విక్రయించిన బైక్‌లలో లోపభూయిష్టం లేవని రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది.

MOST READ:ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

కానీ కొన్ని భద్రతా నిబంధనలు మరియు ముందు జాగ్రత్త చర్యల ప్రకారం, అన్ని మోడళ్లకు తిరిగి రీకాల్ ప్రకటిస్తూ కంపెనీ ఉత్తర్వులు జరీ చేసింది. అవసరమైతే, లోపభూయిష్ట భాగం తనిఖీ చేయబడి భర్తీ చేయబడుతుంది. లోపభూయిష్ట బైక్‌లలో 10% కన్నా తక్కువ భర్తీ అవసరమని రాయల్ ఎన్‌ఫీల్డ్ అంచనా వేసింది.

అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

గత నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 53,298 యూనిట్లను మార్కెట్లో విక్రయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ మార్చి 2021 లో మొత్తం 66,058 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే నెలవారీ అమ్మకాలు 19.32% తగ్గినట్లు కంపెనీ నివేదికల ద్వారా తెలిసింది.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

ఒక్క భారతీయ మార్కెట్లో మాత్రమే రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో దాదాపు 48,789 యూనిట్లను విక్రయించింది. మార్చి 2021 లో, రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ మార్కెట్లో 60,173 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 18.92% తగ్గుదలను సూచిస్తుంది.

అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్లు లోపభూయిష్ట బైక్‌ల యజమానులను సంప్రదిస్తారు. అలా కాకుండా వినియోగదారులు తమ బైక్‌లో ఇలాంటి సమస్య ఉందని గుర్తిస్తే తప్పకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్లను సంప్రదించవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. తద్వారా ఎలాంటి సమస్య తలెత్తదు.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

Most Read Articles

English summary
Royal Enfield Recalls Over 2.36 Lakh Motorcycles Across Seven Countries. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X