Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ కంపెనీ అందిస్తున్న ఆఫ్ రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'హిమాలయన్'లో కంపెనీ ఓ కొత్త 2021 మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లు మరియు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో కంపెనీ కొన్ని కీలకమైన అప్‌గ్రేడ్స్ చేసింది. రైడర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించిన రాయల్ ఎన్‌ఫీల్డ్, తన కొత్త హిమాలయన్ మోడల్‌లో ఇప్పుడు రైడర్‌పై వాయు పీడనాన్ని తగ్గించడానికి మరింత పొడవైన విండ్‌షీల్డ్‌ను జోడించనుంది.

అలాగే, రైడర్ కంఫర్ట్ కోసం ఇందులోని సీట్‌ను కూడా ఇప్పుడు మరింత దృఢమైన ఫోమ్‌తో ఎంతో సౌకర్యంగా ఉండేలా మార్చింది. ఎత్తైన రైడర్లను దృష్టిలో ఉంచుకొని, ముందు వైపు ఫుట్ ర్యాక్‌ని కూడా కంపెనీ రీడిజైన్ చేసింది (ఎత్తైన రైడర్స్ తరచుగా దీని గురించి ఫిర్యాదు చేయటంతో కంపెనీ నిర్ణయం తీసుకుంది).
MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం

అదనపు లగేజ్‌ను క్యారీ చేయటం కోసం దీని వెనుక వైపు ఇప్పుడు ఫ్లాట్‌గా ఉండే మెటల్ ప్లేట్ ర్యాక్‌ను కంపెనీ ఆఫర్ చేయనుంది. వీటన్నింటి కన్నా ఇందులో మరో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే, కంపెనీ ఇటీవలే విడుదల చేసిన తమ మీటియోర్ 350లో ఆఫర్ చేసిన గూగుల్ మ్యాప్స్ ఆధారిత ట్రిప్పర్ నావిగేషన్‌ను కూడా ఇందులో ఆఫర్ చేయనుంది.

పైన పేర్కొన్న మార్పులతో పాటుగా కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కొత్తగా గ్రానైట్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ మరియు పైన్ గ్రీన్ అనే మూడు ఆకర్షణీమయైన రంగులలో లభ్యం కానుంది. ఇవి కాకుండా, హిమాలయన్ స్నో వైట్, గ్రానైట్ బ్లాక్, రాక్ రెడ్, లేక్ బ్లూ, గ్రావెల్ గ్రే మరియు స్లేట్ గ్రే ఆరు ఇతర రంగులలో కూడా లభిస్తోంది.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

కొత్త హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో గూగుల్ మ్యాప్స్ ఆధారిత టిప్పర్ నావిగేషన్ చాలా ముఖ్యమైన అప్‌గ్రేడ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్ కారణంగా, ఇది పూర్తి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌గా మారుతుంది. ఈ బైక్‌పై సుదూర ప్రయాణాలు, కొత్త ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ మార్పుల మినహా, కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఇందులోని 411సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 24.3 బిహెచ్‌పి పవర్‌ను మరియు 32 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్‌లో కూడా ఎలాంటి మార్పు ఉండబోదు.
MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో చేసిన అప్‌గ్రేడ్స్ మరియు జోడించిన అదనపు ఫీచర్ల కారణంగా, దీని ధర కూడా ప్రస్తుత రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోడల్ కన్నా అధికంగా ఉండొచ్చని అంచనా. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న రెండు 650 మోటార్‌సైకిల్స్ మరియు క్లాసిక్ 350 మోడల్‌లో కూడా కంపెనీ అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ప్రవేసపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. బహుశా ఈ మోడళ్లలో కూడా కంపెనీ తమ లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్‌ను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.
MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే భారత మార్కెట్లోని తమ అన్ని మోటార్‌సైకిళ్ల ధరలను పెంచింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ధరలు రూ.3,000 వరకూ పెరిగాయి. - రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల కొత్త ప్రైస్ లిస్ట్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
మూలం: MotorBeam